• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  థియేటర్లకు పిల్లలు ఆ...

థియేటర్లకు పిల్లలు ఆ సమయాల్లో వద్దు.. హైకోర్టు కీలక సూచనలు!

| ఇటీవల జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో... బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల పెంపు, అర్ధరాత్రుల్లోనూ ప్రత్యేక షోలు, మొదలైన విషయాలపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-01-28 03:26 GMT

ఇటీవల జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో... బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల పెంపు, అర్ధరాత్రుల్లోనూ ప్రత్యేక షోలు, మొదలైన విషయాలపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా థియేటర్లకు పిల్లలు వెళ్లే సమయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... ఇటీవల కాలంలో సినిమాల స్పెషల్ షోలు, ప్రధానంగా సామాన్యుడికి మోయలేని భారంగా అన్నట్లుగా మారిన టిక్కెట్ ధరల పెంపు అంశాలు, వాటిలో కొన్ని సినిమాలకు మాత్రమే టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడాలు మొదలైన అంశాలపై అటు ఇండస్ట్రీలోను, ఇటు బయటా చర్చ జరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. సినిమా టిక్కెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు పర్మిషన్స్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా.. జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా.. 16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్స్ కు వెళ్లే వేళలపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచిందింది.

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకూ 16ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లకు అనుమతించొద్దని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ సమయంలో.. వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దీంతో... పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకూ 16ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లకు అనుమతించొద్దని సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    
  • Telanganahighcourt 
  • Childrens 
  • Movies 
  • Tollywood 
  • Filmindustry 
  • Telanganagovernment 
  • Theaters 
  • Justicevijaysenreddy 

Similar News

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న

2026-10-21 14:28 GMT

మీరు జెన్ జెడ్ లే కాదు: ఢిల్లీ హైకోర్టు

2026-10-21 12:46 GMT

నామినేషన్ల పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు

2026-10-21 07:11 GMT

భారత్ లో విదేశీయులు నిరసనల్లో పాల్గొనకూడదా? చట్టం ఏం చెబుతోంది?

2026-10-19 10:33 GMT

సేఫ్టీ పేరుతో పిల్లల ఇంటర్నెట్‌పై ఆంక్షలు వద్దు: సుప్రీంకోర్టు

2026-10-17 15:30 GMT

భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌ల‌కు ఉరిశిక్ష‌లు.. మీరట్‌లో వ‌రుస‌ సంచ‌ల‌న తీర్పుల‌పై చ‌ర్చ‌!

2026-10-16 14:13 GMT

జర్నలిజంపై సరికొత్త చర్చ.. ఆసక్తి రేపిన సుప్రీం వ్యాఖ్యలు!

2026-10-16 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS