ఐఏఎంసీ కి భూ కేటాయింపులు క్యాన్సిల్!

ఇక ఐఏఎంసీ వివరాల్లోకి వెళ్తే 2022 మార్చి 11న ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దీనిని ప్రారంభించారు.;

Update: 2025-06-28 06:30 GMT

తెలంగాణాలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఐఏఎంసీని ఏర్పాటు చేస్తూ 3.5 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ భూ కేటాయింపులు ఉన్నాయన్న పిటిషనర్లు దాఖలు చేసిన దానితో ఏకీభవిస్తూ తెలంగాణా హైకోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది.

ఇక ఐఏఎంసీ వివరాల్లోకి వెళ్తే 2022 మార్చి 11న ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దీనిని ప్రారంభించారు. దేశంలోనే ఐఏఎంసీ ఏర్పాటు ఇదే ప్రధమం అని ఆయన అన్నారు. అంతే కాదు దీని వల్ల న్యాయపరంగా మరింత సరళత సులభమైన విధానం అందరికీ న్యాయం దక్కుతాయని కూడా అభిప్రాయపడ్డారు.

ఇక ఆనాటి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఐఏఎంసీ కి హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలో కేటాయించారు. 50 కోట్ల రూపాయలతో ఐఏఎంసీ నిర్మాణానికి కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది

అయితే పిటిషనర్ల వాదన ఏమిటి అంటే శేరులింగంపల్లిలోని సర్వే నంబర్ 83/1లో ఐటీ కారిడార్ పరిధిలోని ఈ భూమికి ఎంతో విలువ ఉందని. అంతే కాదు 350 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమి కేటాయింపు విషయంలో ఎలాంటి నియమ నిబంధనలను పాటించలేదని. న్యాయవాదులు ఏ రఘునాధరావు, వెంకటరాం రెడ్డి అనే ఇద్దరు వేసిన ప్రజా వాజ్యాల మీద విచారణ జరిపిన జస్టిస్ కె లక్ష్మణ్, కె సుజనలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఎంతో విలువైన ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా ఇస్తారు అన్నదే పిటిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలు. ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు అసలు పాటించలేదని కూడా పిటిషనర్లు వాదించారు. అంతే కాదు పారదర్శకత లోపించిందని విధానాలను సైతం కరెక్ట్ గా అమలు చేయలేదని ఆరోపించింది. ప్రభుత్వ ఆస్తులు కేటాయించినపుడు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా వాటిని పట్టించుకోలేదని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు.

అయితే దీని మీద ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆడ్వకేట్ జనరల్ అయితే ప్రజా ప్రయోజానాలు దృష్టిలో పెట్టుకునే ఈ కేటాయింపులు చేశామని స్పష్టం చేశారు. ఇక ఐఏఎంసీ ప్రజా ప్రయోజానలకు కోసం సంబంధించిన ఒక ఉన్నత సంస్థగా పేర్కొన్నారు. అయితే ఈ వాదనలు విన్న మీదట హైకోర్టు ఈ భూముల కేటాయింపుల విషయంలో పిటిషనర్లతో ఏకీభవిస్తూ భూ కేటాయింపులు రద్దు చేస్తూ సంచలనమైన తీర్పుని వెలువరించింది.

Tags:    

Similar News