• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  30 వారాల గర్భవిచ్ఛిత్తికి...

30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి... సుప్రీం సంచలన తీర్పు!

| అయితే... ఆ సమయం దాటాక కూడా గర్భవిచ్ఛిత్తి చేసుకోవాలనుకుంటే అందుకు న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.

By - Tupaki Desk
Update: 2024-04-22 08:30 GMT

సాధారణంగా మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం.. వివాహిత మహిళలు, ప్రత్యేక అవసరాలున్నవారు, అత్యాచారా బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే! అయితే... ఆ సమయం దాటాక కూడా గర్భవిచ్ఛిత్తి చేసుకోవాలనుకుంటే అందుకు న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. ఈ సమయంలో 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు ఇచ్చింది!

అవును... అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలికకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఇందులో భాగంగా... సుమారు 30 వారాల ఆమె గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో... దీన్ని ఒక అసాధారణ కేసుగా పరిగణించిన సుప్రీంకోర్టు... విస్తృత అధికారాలను ఉపయోగించుకుని తీర్పు వెలువరించింది.

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురవ్వడంతో గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఇందులో భాగంగా... తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని పిటిషన్‌ దాఖలు చేసింది.

అయితే.. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో ఉందని, ఈ సమయంలో విచ్ఛిత్తి చేస్తే పూర్తిగా రూపుదిద్దుకున్న పిండస్థ శిశువు జన్మించే అవకాశముందని అభిప్రాయపడింది. ఇలా గర్భవిచ్ఛిత్తికి అనుమతి నిరాకరిస్తూ... ఆ పిటిషన్ ను ఏప్రిల్‌ 4వ తేదీన కొట్టేసింది. దీంతో... ఈ తీర్పుపై బాలిక తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీంతో... ఈ పిటిషన్ పై గతవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ముంబైలోని సియాన్‌ ఆసుపత్రి మెడికల్‌ బోర్డును నివేదిక కోరింది. గర్భవిచ్ఛిత్తిపై తీసుకునే నిర్ణయం వల్ల బాలిక శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందో చెప్పాలని సూచించింది! దీంతో ఈ వ్యవహారంపై సియాన్ ఆసుపత్రి మెడికల్‌ బోర్డు న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.

ఇందులో భాగంగా... గర్భవిచ్ఛిత్తితో కొంత ప్రమాదం ఉన్నప్పటికీ, కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... ఈ గర్భాన్ని కొనసాగించడం వల్ల బాలికపై మానసికంగానూ, శారీరకంగానూ ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.

ఈ నివేదికను పరిశీలించిన జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. ఆ బాలికకు తక్షణమే వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేయాలని సియాన్‌ ఆసుపత్రి డీన్‌ ను ఆదేశించింది.

Tags:    
  • BombayHighCourt 
  • HighCourt 
  • ChiefJustice 
  • DyChandrachud 
  • MedicalExports 
  • MedicalReports 
  • SupremeCourt 
  • MaharashtraHospital 
  • SionHospital 
  • POCSOlaw 
  • TheMedicalTerminationofPregnancyAct 

Similar News

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న

2026-10-21 14:28 GMT

మీరు జెన్ జెడ్ లే కాదు: ఢిల్లీ హైకోర్టు

2026-10-21 12:46 GMT

నామినేషన్ల పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు

2026-10-21 07:11 GMT

భారత్ లో విదేశీయులు నిరసనల్లో పాల్గొనకూడదా? చట్టం ఏం చెబుతోంది?

2026-10-19 10:33 GMT

సేఫ్టీ పేరుతో పిల్లల ఇంటర్నెట్‌పై ఆంక్షలు వద్దు: సుప్రీంకోర్టు

2026-10-17 15:30 GMT

భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌ల‌కు ఉరిశిక్ష‌లు.. మీరట్‌లో వ‌రుస‌ సంచ‌ల‌న తీర్పుల‌పై చ‌ర్చ‌!

2026-10-16 14:13 GMT

జర్నలిజంపై సరికొత్త చర్చ.. ఆసక్తి రేపిన సుప్రీం వ్యాఖ్యలు!

2026-10-16 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS