• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  రాజరికం చూపించొద్దు.....

రాజరికం చూపించొద్దు.. ‘రాజవంశం’ మహిళకు సుప్రీం హితవు

| దీంతో ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ వీరి ఇష్యూ ఏమిటి? అసలేం జరిగింది? ఆ జంట ఎవరు? వారి మధ్య ఉన్న పంచాయితీ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

By - Tupaki Desk
Update: 2025-05-16 05:13 GMT

ఇప్పుడున్న కాలంలో భార్యభర్తల మధ్య పంచాయితీలు కామన్ గా మారిపోవటం తెలిసిందే. విభేదాలతో కోర్టుల్ని ఆశ్రయించే జంటలకు కాస్త భిన్నమైందీ ఉదంతం. రాజకుటుంబానికి చెందిన ఒక మహిళ.. తన భర్తతో నెలకొన్న ఆర్థిక అంశాలపై కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం సూచనపై సదరు మహిళ స్పందించిన తీరుపై సుప్రీం కోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. రాజరికాన్ని చూపించొద్దంటూ హితవు పలికింది. మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకుంటే కఠిన నిర్ణయాన్ని వెలువరించాల్సి వస్తుందంటూ స్పష్టం చేసింది. దీంతో ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ వీరి ఇష్యూ ఏమిటి? అసలేం జరిగింది? ఆ జంట ఎవరు? వారి మధ్య ఉన్న పంచాయితీ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

గ్వాలియర్ లో నివసిస్తున్న ఒక మహిళ తాను ఛత్రపతి శివాజీ మహారాజ్ నౌకాదళానికి అధిపతి.. కొంకణ్ ప్రాంత పాలకుడి వంశానికి చెందిన వ్యక్తిగా పేర్కొంటారు. ఆమె భర్త సైనికాధికారుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. మధ్యప్రదేశ్ లో విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. భార్య.. భర్తల మధ్య ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయి. దీంతో.. వారు కోర్టును ఆశ్రయించారు.

ఈ ఇష్యూను పరిష్కరించేందుకు మధ్యవర్తిగా సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ ను నియమించింది న్యాయస్థానం. తన భర్త.. వారి కుటుంబం వరకట్నంగా రోల్స్ రాయిస్ కారు.. ముంబయిలో ప్లాట్ డిమాండ్ చేస్తున్నట్లుగా సదరు మహిళ పేర్కొన్నారు. అయితే.. ఆమె వాదనను భర్త విభేదిస్తున్నారు. దీంతో వీరి మధ్య నెలకొన్న సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వం ఎలాంటి ఫలితాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో సదరు మహిళ మధ్యవర్తిత్వం విఫలమైందని వ్యాఖ్యానిస్తున్నారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. మధ్యవర్తిత్వం విఫలమైందంటూ ఏ రకంగా ప్రకటనలు చేస్తున్నారు? మహరాజులా వ్యవహరించొద్దని.. 75 ఏళ్ల ప్రజాస్వామ్యం గడిచిందన్న విషయాన్ని పేర్కొంటూ.. ‘మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం సాధించలేకపోతే మూడు రోజుల్లో కఠిన ఆదేశాల్ని జారీ చేస్తాం’ అని పేర్కొన్నారు. వీరి కేసు తదుపరి వారానికి వాయిదా వేశారు. ఈ కేసులో సుప్రీం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Tags:    
  • SupremeCourtIndia 
  • RoyalDispute 
  • MaritalConflict 
  • MediationFailure 
  • GwaliorRoyals 
  • LegalNews 
  • FamilyCourt 
  • RollsRoyceDemand 
  • DowryCase 

Similar News

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న

2026-10-21 14:28 GMT

మీరు జెన్ జెడ్ లే కాదు: ఢిల్లీ హైకోర్టు

2026-10-21 12:46 GMT

నామినేషన్ల పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు

2026-10-21 07:11 GMT

భారత్ లో విదేశీయులు నిరసనల్లో పాల్గొనకూడదా? చట్టం ఏం చెబుతోంది?

2026-10-19 10:33 GMT

సేఫ్టీ పేరుతో పిల్లల ఇంటర్నెట్‌పై ఆంక్షలు వద్దు: సుప్రీంకోర్టు

2026-10-17 15:30 GMT

భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌ల‌కు ఉరిశిక్ష‌లు.. మీరట్‌లో వ‌రుస‌ సంచ‌ల‌న తీర్పుల‌పై చ‌ర్చ‌!

2026-10-16 14:13 GMT

జర్నలిజంపై సరికొత్త చర్చ.. ఆసక్తి రేపిన సుప్రీం వ్యాఖ్యలు!

2026-10-16 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS