• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  కవిత కేసులో కోర్టు కీలక...

కవిత కేసులో కోర్టు కీలక తీర్పు!

| ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు.

By - Tupaki Desk
Update: 2024-05-20 11:49 GMT

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. మార్చి 15న ఆమెను ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోని తీహార్‌ జైలులోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసినా కోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది.

ఇంతకుముందు కవితకు మే 20 వరకు కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ గడువు పూర్తి కావడంతో జైలు అధికారులు ఆమెను కోర్టు ముందు హాజరుపర్చారు. దీంతో జూన్‌ 3 వరకు ఆమె రిమాండ్‌ ను కోర్టు పొడిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జూన్‌ 3 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

కవితను కోర్టు ముందు హాజరుపరిచిన సందర్భంగా కోర్టులో వాదనలు జరిగాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి దామోదర్, ప్రిన్స్‌ కుమార్, అరవింద్‌ సింగ్, చరణ్‌ ప్రీత్‌ పై ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశామని ఈడీ తరఫున న్యాయవాది న్యాయమూర్తికి నివేదించారు. ఈ నలుగురి పాత్రపై ఆధారాలున్నాయన్నారు.

మరోవైపు కవిత తరఫు న్యాయవాది ఆమెను విడుదల చేయాలని వాదించారు. ఈడీ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ, కవిత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు కవిత రిమాండ్‌ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కవిత బెయిల్‌ పిటిషన్‌ కు సంబంధించిన విచారణను కోర్టు మే 24కు వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి మే 10న విచారణ జరిపిన కోర్టు బెయిల్‌ అంశాన్ని మే 24న విచారిస్తామని వెల్లడించింది. కవిత బెయిలు పిటిషన్‌ పై ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ మద్యం కేసులో తనపై నమోదైన మనీలాండరింగ్‌ కేసును సవాల్‌ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మార్చి 15న ఆమె అరెస్టు కాగా మార్చి 26 నుంచి ఢిల్లీలోని తీహార్‌ జైలులోనే ఉన్నారు.

కాగా ఢిల్లీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, మరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్‌ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్‌ పై ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    
  • Kavitha 
  • Delhi 
  • Liquorcase 
  • Court 
  • Aravindkejriwal 
  • Aamadmiparty 
  • Brs 
  • Remand 

Similar News

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న

2026-10-21 14:28 GMT

మీరు జెన్ జెడ్ లే కాదు: ఢిల్లీ హైకోర్టు

2026-10-21 12:46 GMT

నామినేషన్ల పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు

2026-10-21 07:11 GMT

భారత్ లో విదేశీయులు నిరసనల్లో పాల్గొనకూడదా? చట్టం ఏం చెబుతోంది?

2026-10-19 10:33 GMT

సేఫ్టీ పేరుతో పిల్లల ఇంటర్నెట్‌పై ఆంక్షలు వద్దు: సుప్రీంకోర్టు

2026-10-17 15:30 GMT

భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌ల‌కు ఉరిశిక్ష‌లు.. మీరట్‌లో వ‌రుస‌ సంచ‌ల‌న తీర్పుల‌పై చ‌ర్చ‌!

2026-10-16 14:13 GMT

జర్నలిజంపై సరికొత్త చర్చ.. ఆసక్తి రేపిన సుప్రీం వ్యాఖ్యలు!

2026-10-16 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS