• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  'శవంతో లైంగిక వాంఛ...

'శవంతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు'.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

| మనుషుల్లో మానవత్వం ఛాయలు రోజు రోజుకీ పోతూ, వారిలో మృగం లక్షణాలు ఇటీవల వెలుగులోకి వస్తోన్న ఘటనలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-07-20 05:14 GMT

మనుషుల్లో మానవత్వం ఛాయలు రోజు రోజుకీ పోతూ, వారిలో మృగం లక్షణాలు ఇటీవల వెలుగులోకి వస్తోన్న ఘటనలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఓ షాకింగ్ ఘటనలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... యజమాని భార్యను హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్న వ్యక్తిని మృగంగా హైకోర్టు అభివర్ణించింది!

అవును... తాను పనిచేస్తున్న హాస్పటల్ యజమాని భార్యను హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్న వ్యక్తికి బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులో బెయిల్‌ మంజూరు చేస్తే అది సమాజంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

యజమాని భార్యపై లైంగిక వ్యామోహంతో నిందితుడు మృగంలా వ్యవహరించాడని.. అయితే, ఆమె ప్రతిఘటించడంతో విషయం బయట పడుతుందని దారుణంగా హత్య చేశాడని కోర్టు తెలిపింది. అనంతరం, మృతదేహంతో కామవాంఛ తీర్చుకున్నాడని.. దీనికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని.. వాస్తవాలను ట్రయల్‌ కోర్టు తేలుస్తుందని తెలిపింది.

అయితే... కేవలం చాలాకాలం నుంచి జైలులో ఉన్నాడు అనే కారణంతో ఇలాంటి కేసులో బెయిల్‌ పొందేందుకు పిటిషనర్‌ అనర్హుడని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నేరానికి పాల్పడిన విధానం, నేర తీవ్రత, అది సమాజంపై చూపించే ప్రభావం, మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ పిటిషన్‌ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా... నెల్లూరు జిల్లా కావలిలో సుమారు 15 ఏళ్లుగా ఓ వైద్యుడు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అతనివద్ద కాంపౌండర్‌ గా పశ్చిమబెంగాల్‌ కు చెందిన నిందితుడు నయన్‌ బిస్వాస్‌ చేరాడు. అప్పటి నుంచీ యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న బిస్వాస్... 2024, డిసెంబరు 31 తెల్లవారుజామున యజమాని భార్యపై లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు.

అయితే... ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆ సమయంలో.. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావలి పోలీసులు నయన్‌ బిస్వస్ పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి ప్రైమరీ చార్జిషీట్‌ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలోనే కారాగారంలో ఉన్న నిందితుడు పోలీసులు చార్జ్‌ షీట్‌ దాఖలు చేసినందున బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఉన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడికి బెయిల్ ఇస్తే సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది.

Tags:    
  • HighCourtVerdict 
  • NelloreCrime 
  • JusticeForVictim 
  • IndiaCrime 
  • KavaliCrime 
  • NecrophiliaCase 
  • CourtVerdict 

Similar News

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న

2026-10-21 14:28 GMT

మీరు జెన్ జెడ్ లే కాదు: ఢిల్లీ హైకోర్టు

2026-10-21 12:46 GMT

నామినేషన్ల పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు

2026-10-21 07:11 GMT

భారత్ లో విదేశీయులు నిరసనల్లో పాల్గొనకూడదా? చట్టం ఏం చెబుతోంది?

2026-10-19 10:33 GMT

సేఫ్టీ పేరుతో పిల్లల ఇంటర్నెట్‌పై ఆంక్షలు వద్దు: సుప్రీంకోర్టు

2026-10-17 15:30 GMT

భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌ల‌కు ఉరిశిక్ష‌లు.. మీరట్‌లో వ‌రుస‌ సంచ‌ల‌న తీర్పుల‌పై చ‌ర్చ‌!

2026-10-16 14:13 GMT

జర్నలిజంపై సరికొత్త చర్చ.. ఆసక్తి రేపిన సుప్రీం వ్యాఖ్యలు!

2026-10-16 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS