కొరియోగ్రాఫర్ తో చాహల్ భార్య ధనశ్రీ ఎఫైర్.. అందుకే విడాకులు అంటూ!

అదేంటంటే ధనశ్రీ ప్రముఖ ఇండియన్ కొరియోగ్రాఫర్ అయినటువంటి ప్రతీక్ ఉటేకర్ తో డేటింగ్ లో ఉందనే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.;

Update: 2025-08-07 20:29 GMT

భారత క్రికెట్ ఆటగాడు చాహల్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. దానికి ప్రధాన కారణం ఆయన విడాకులే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న యుజ్వేంద్ర చాహల్ పెళ్లయిన ఐదు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడంతో ఈయన వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.అయితే చాహాల్ తన భార్య ధనశ్రీతో విడాకులు తీసుకోబోతున్నాడనే వార్త వినిపించగానే వీరి విడాకులకు కారణం ఏంటి? అనే విషయంపై ఎన్నో రూమర్లు తెరమీద చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య విడాకులకు అసలు కారణమైతే బయట పడలేదు. అయితే తాజాగా చాహల్ - ధనశ్రీ విడాకులకు అసలు కారణం ఇదే అంటూ ఒక విషయం బయటకు వచ్చింది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబర్.. కొరియోగ్రాఫర్.. డెంటిస్ట్ అయినటువంటి ధనశ్రీ ని 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్న చాహల్.. పెళ్ళైన 5 ఏళ్లకు అంటే 2025లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో మార్చి 20న అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. అయితే చాహల్ ధనశ్రీ విడిపోతున్నట్టు ప్రకటించిన కొద్ది రోజులకే చాహల్ ఆర్జే మహ్వేష్ తో కలిసి తిరగడంతో మహ్వేష్ తో ఉన్న రిలేషన్ వల్లే చాహల్ తన భార్యకు విడాకులు ఇచ్చారనే రూమర్లు వినిపించాయి.

దీనికి తోడు తాజాగా ధనశ్రీకి సంబంధించిన మరో మ్యాటర్ వెలుగులోకి వచ్చింది.అదేంటంటే ధనశ్రీ ప్రముఖ ఇండియన్ కొరియోగ్రాఫర్ అయినటువంటి ప్రతీక్ ఉటేకర్ తో డేటింగ్ లో ఉందనే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో ధనశ్రీ ఎక్కువగా ఆ కొరియోగ్రాఫర్ తో కలిసి కనిపిస్తోంది. దీనికి తోడు వీరిద్దరి మధ్య ఈ వార్తలు వినిపించడానికి ప్రధాన కారణం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ధన శ్రీ ప్రతీక్ ఉటేకర్ తో క్లోజ్ గా కనిపించింది. వీరిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే న్యూస్ వైరల్ చేశారు.

అయితే దీనిపై ప్రతీక్ ఉటేకర్ తన ఇంస్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చారు. ధనశ్రీతో తనకి ఎఫైర్ ఉన్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని,ఒకే ఒక్క ఫోటోతో ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని కన్ఫామ్ చేసుకోవద్దని చెప్పారు. ఇక ప్రతీక్ ఉటేకర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ రూమర్లు ఆగడం లేదు. ప్రతీక్ తో ఉన్న సంబంధం వల్లే ధనశ్రీ తన భర్తకు విడాకులు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ రూమర్స్ కి ఎప్పుడు చెక్ పడుతుందో చూడాలి.

Tags:    

Similar News