వైసీపీ యువ నేతలు : అతి నుంచి సైలెంట్ వరకు ..!
కొందరు యువ నాయకుల వ్యవహార శైలిపై వైసీపీ నేతలు ఖంగు తింటున్నారు. గత ఎన్నికల సమయం లో పిలిచి పిల్లనిచ్చినట్టు.. కొందరు నాయకులకు వైసీపీ అధినేత జగన్ టికెట్లు ఇచ్చారు.;
కొందరు యువ నాయకుల వ్యవహార శైలిపై వైసీపీ నేతలు ఖంగు తింటున్నారు. గత ఎన్నికల సమయం లో పిలిచి పిల్లనిచ్చినట్టు.. కొందరు నాయకులకు వైసీపీ అధినేత జగన్ టికెట్లు ఇచ్చారు. అయితే.. వారి లో ఒకరిద్దరు మినహా అందరూ విఫలమయ్యారు. ఆ తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక, వీరు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే.. ఈ వ్యవ హారంపై పార్టీ గతంలోనే చర్చించింది.
పార్టీ తరఫున యాక్టివ్‌గా పనిచేయాలని కోరింది. దీంతో నాయకులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ.. దీనిలో అతి చేయడంతో అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం.. మళ్లీ సైలెంట్ అయిపోయారు. దీనిపై ఇటీవల సమీక్షించిన పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ భార్గవరెడ్డి.. అయితే అతి చేస్తున్నారు. లేకపోతే.. మౌనంగా ఉంటున్నారంటూ.. పెద్దలకు చెప్పారు. ఇది క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామమే. ఈ విషయం పార్టీకి కూడా తెలుసు.
దీంతో పార్టీ అధినేత జగన్.. మౌనంగా ఉన్నారు. ఎవరి దారిలో వారు వెళ్తున్నారని తెలిసినా.. ఆయన మౌనంగా ఎందుకు వున్నారన్నది ప్రశ్న. ఇదిలావుంటే.. గ్రూపు రాజకీయాలు కూడా వైసీపీని ఇరుకున పెడు తున్నాయి. నిజానికి అధికారంలో ఉన్న పార్టీలు గ్రూపు రాజకీయాలు చేస్తాయి. కానీ.. అధికారంలో లేకపోయినా.. వైసీపీ నేతలు గ్రూపు రాజకీయాలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయినా.. పార్టీ వారిని మందలించే పరిస్థితి లేదన్నది వాస్తవం.
ఇప్పుడున్న పరిస్థితి పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నది వాస్తవం. కొందరు నాయకులు.. మౌనం గా ఉండడం.. మరికొందరు అవకాశం కోసం ఎదురు చూడడం.. కొత్త నేతలు.. ఇష్టానుసారం వ్యవహరిం చడం ఇలా.. వైసీపీలో భిన్నమైన వాతావరణం, భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కొత్త వారిని ఏమీ అనలేక.. పాతవారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక వైసీపీ ఆపశోపాలు పడుతున్న మాట వాస్తవం. మరి ఇది ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.