అక్కడ వైసీపీ వెలుగులు ఏవీ ?

ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. దాంతో వైసీపీకి నాయకత్వం కొరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.

Update: 2026-06-19 04:45 GMT

వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాగా ప్రకాశం జిల్లాకు పేరుంది. అలాంటి జిల్లాలో ఇపుడు ఫ్యాన్ రెక్కలు సరిగ్గా తిరగడం లేదని అంటున్నారు. జిల్లా మొత్తాన్ని నడిపే సమర్ధ నాయకత్వం లేదని అంటున్నారు. గతంలో అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంటి చేత్తో జిల్లా రాజకీయాలను చక్కబెట్టేవారు. ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. దాంతో వైసీపీకి నాయకత్వం కొరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.

కో ఆర్డినేషన్ లేక :

ప్రకాశం జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ఇంచార్జిలను అందరినీ ఒకే త్రాటి మీదకు నడిపించే కో ఆర్డినేషన్ లేకుండా పోతోంది అన్న చర్చ సాగుతోంది. జిల్లాలో చూస్తే కూటమి పటిష్టంగా ఉంది. బాలినేని జనసేనలో చేరికతో ఆ పార్టీ కూడా బలం పుంజుకుంది అని అంటున్నారు. ఇటీవల కాలంలో బాలినేనికి పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో బాలినేని రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. అది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుందా అన్న చర్చ కూడా వస్తోంది.

యాక్టివ్ గా లేని తీరు :

ఈ నేపధ్యంలో జిల్లాలోని వైసీపీ ఇంచార్జిలు అంతా యాక్టివ్ మోడ్ లో లేరని విమర్శలు విన వస్తున్నాయి. సొంతంగా స్థానిక సమస్యల మీద పోరు సలపడం లేదు అని అంటున్నారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆందోళన మొక్కుబడిగా నిర్వహించి మమ అనిపిస్తున్నారు అని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఎందుకో జిల్లా రాజకీయాల మీద అంతగా ఆసక్తిని చూపించడం లేదని అంటున్నారు. ఇక జిల్లా అధ్యక్షుడుగా జగన్ సన్నిహితుడైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఆయన ఎక్కువగా తన సొంత నియోజకవర్గం దర్శి ప్రాంతాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

దిశా నిర్దేశం చేయాల్సిందే "

మరో వైపు చూస్తే అధినేత జగన్ ప్రకాశం జిల్లా మీద ఫోకస్ పెట్టి దిశా నిర్దేశం చేయాల్సిందే అని అంటున్నారు. అక్కడ సరైన నాయకత్వాన్ని గుర్తించి ప్రోత్సహించాలని కూడా అంటునారు. నియోజకవర్గాల స్థాయిలో బలమైన నేతలు ఉన్నారని అంటున్నారు. అలాగే పార్టీకి మంచి ఓటు బ్యాంక్ కూడా ఉంది. మరి వీటిని దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేసే నేతల కోసమే సెర్చ్ చేయాల్సి ఉంది అని అంటున్నారు. లేకపోతే మాత్రం ప్రకాశంలో వైసీపీ వెలుగులు గత కాలం కాంతులు అన్న తీరుగానే ఉంటాయని కూడా అంటున్నారు. ముఖ్యంగా క్యాడర్ అయితే పూర్తిగా అసంతృప్తితో ఉందని కూడా గుర్తు చేస్తున్నారు.

Tags:    

Similar News