• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీనియ‌ర్లు ఏమంటున్నారో...

సీనియ‌ర్లు ఏమంటున్నారో విన్నావా జ‌గ‌న్ ..!

| దీనిని బట్టి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వైసిపి ఏ విధంగా దిగజారిపోయింది.. అనేది స్పష్టం అవుతుంది.

By - Tupaki Desk
Update: 2025-07-09 04:45 GMT

నానాటికి తీసి కట్టుగా వైసీపీ రాజకీయాలు మారుతున్నాయి. ఇది ఎవరో అంటున్న మాట కాదు. పార్టీ సీనియర్ నాయకుడు, ఎంతో కొంత‌ సానుభూతి ఉన్న కీలక మాజీ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్య ఇది. ఆయన కూడా నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడే కావడం విశేషం. ఆయన తాజాగా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ ''మా పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతుంది. మా నాయకుడు జారుడు బండపై ప్రయోగాలు చేస్తున్నారు'' అని వ్యాఖ్యలు చేశారు.

దీనిని బట్టి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వైసిపి ఏ విధంగా దిగజారిపోయింది.. అనేది స్పష్టం అవుతుంది. పార్టీ పరంగా ఇది ఒక సరిదిద్దుకోలేని పెద్ద వివాదంగా కూడా మారింది. ఒక్క విడతలో ఏడాదికాలంగా సంపాదించుకున్న సింప‌తీ రప్పా రప్పా వ్యాఖ్యలతో కొంత‌ పోగా.. ఇక మిగిలింది కూడా నల్లపరెడ్డి వ్యాఖ్య‌ల‌తో తుడిచిపెట్టుకుపోయింది. కూటమిలోని మంత్రులు ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా విరుచుకుపడ్డారు. ఎక్కడ విన్నా.. ఏం ఛానల్ చూసినా వారు చేస్తున్న విమర్శలు, వారు చేస్తున్న వ్యాఖ్యలతో వైసిపి పై తీవ్ర దుమారం రేగింది.

ఈ పరిణామాలు చూసే బహుశా సీనియర్ నాయకుడు సొంత పార్టీ అయినప్పటికీ మనసులో ఉన్న మాట బయటికి చెప్పారు. ''ఇది వాస్తవం. నల్లపరెడ్డిని ఇప్పుడు మీరు సమర్ధించుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో మరింత మంది నల్లపురెడ్డిలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని'' ఆయన వ్యాఖ్యానించారు. ఇది అంతర్గతంగా ఆయన వ్యాఖ్యానించినప్పటికీ పార్టీ ప్రమాదకర స్థితిలో ఉన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు జగన్ నేరుగా రంగంలోకి దిగి వాటిని ఖండించడమో లేక తప్పు పట్టడమో చేయాలి.

నాయకులపై చర్యలు తీసుకొని ఉండాల్సింది. కానీ, అమరావతి మహిళలపై సొంత చానల్లో వ్యక్తులు వ్యాఖ్య‌లు చేసినప్పుడు ఆయన బయటికి రాలేదు. ఇప్పుడు సొంత పార్టీ నాయకుడు, సీనియర్ నేత ఒక మహిళ ఎమ్మెల్యే పై, అందునా నిన్న‌టి దాకా ఇదే పార్టీలో ఉన్నటువంటి నాయకుడి సతీమణి పై వ్యాఖ్యలు చేయడం పట్ల, వీటిని జగన్ ఖండించకపోవడం పట్ల సమాజంలో వైసిపి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అనేది వాస్తవం. ఇలాంటి వ్యాఖ్యలను, ఇలాంటి విమర్శలను జగన్ చూస్తూ కూర్చుంటే మహిళా ఓటు బ్యాంకు సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇప్పుడు బాగానే ఉన్నా ఎన్నికల సమయానికి ఇవన్నీ పెద్ద రచ్చగా మారితే ఆనాడు వైసిపి సరిదిద్దుకోలేని తప్పులు చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా జగన్ ఈ విషయాలపై బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి తన వాదనని వినిపించి తప్పు చేసిన వారిపై సస్పెన్షన్ విధించడం లేక మరో రూపంలో చర్యలు తీసుకోవడం చేయడం ద్వారా పరిస్థితిని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆయన అలా చేయకపోవడంతోనే సీనియర్ నాయకులు సైతం వైసీపీ అంటే దూరంగా ఉంటున్నారు. మరి ఇది ఇలాగే కొనసాగుతుందా.. జగన్ ఇంకా మారడా.. అనేది కాలమే నిర్ణయించాలి. మరొకసారి గనక పరాజ‌యం ఏర్పడితే ఇక వైసిపి ఉండే అవకాశం కూడా లేకపోవచ్చు అన్నది ఆయ‌న నాయ‌కుడు చెప్పిన‌ మాట.

Tags:    
  • YSRCP 
  • JaganMohanReddy 
  • NallapureddyComments 
  • AndhraPolitics 
  • YSRCPControversy 
  • PoliticalCrisis 
  • WomenInPolitics 
  • APNews 
  • TeluguPolitics 
  • YSRCPLeadership 
  • PartyDissent 
  • NellorePolitics 
  • Nallapareddyprasannakumarreddy 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS