• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వ్య‌క్తులు కాదు.....

వ్య‌క్తులు కాదు.. విధానాల‌తోనే వైసీపీ హ‌వా.. !

| రాజకీయ పార్టీలు వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కంటే ప్రజా సమస్యలపై పోరాడితేనే ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. 2019లో జగన్ ప్రజా సమస్యలతో విజయం సాధించారని, ఆ తర్వాత వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం 2024లో వైసీపీకి ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడుతున్నారు. టీడీపీ కూడా ప్రతిపక్షంలో ప్రజా సమస్యలనే ప్రధానంగా ప్రస్తావించిందని గుర్తుచేస్తున్నారు.

By - Garuda Media
Update: 2026-11-11 23:30 GMT

వ్య‌క్తుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రాజ‌కీయాలు చేయ‌డం ఇటీవ‌ల కాలంలో పెరిగిపోయింది. ఇది అన్ని పార్టీల‌కూ వ‌ర్తిస్తుంది. కానీ,ఇది అంత‌గా స‌క్సెస్ కాలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉదాహ‌ర‌ణ‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ్య‌క్తులు కాకుండా.. విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను పునాదులుగా చేసుకుని పాద‌యాత్ర చేశారు. అది స‌క్సెస్ అయింది. పేద‌లు, బీసీలు, ఎస్సీ,ఎస్టీల స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించారు. అదేస‌మ‌యంలో ఇత‌ర వ‌ర్గాల వ్య‌క్తిగ‌త అంశాల‌ను కూడా.. ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు కీల‌కంగా తీసుకున్నారు.

దీనిలో ఉద్యోగుల నుంచి వైద్యులు, లాయ‌ర్లు ఇలా.. అన్ని వ‌ర్గాల వారు ఉన్నారు. ఫ‌లితంగావారికి భ‌రోసా ఇవ్వ‌గ‌లి గారు. ఇది.. ఆయ‌న‌కు అప్ర‌తిహ‌త విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టింది. అధికారంలోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత‌.. విధానాల‌ను వ‌దిలేసి.. చంద్ర‌బాబును వేధించ‌డం.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం,.. టీడీపీ విధానాల‌ను అడ్డు పెట్టి.. ప్ర‌జ‌ల‌ను కూడా వేధించ‌డం వంటివి అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల విష‌యంలో స్ప‌ష్టంగా క‌నిపించింది. అంటే.. అప్ప‌టి వ‌ర‌కు అనుస‌రించిన విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను వ‌దిలేశారు.

ఈ ప‌రిణామం 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపింది. అంటే.. ఏ పార్టీ అయినా.. విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను అందిపు చుకుంటేనే గెలిచిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇప్పుటు టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ప్రతిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ఒక‌వైపు జ‌గ‌న్‌ను లక్ష్యంగా చేసుకున్నా...మ‌రోవైపు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను.. ఇసుక‌, ఉద్యోగులు, గుంత‌ల మ‌య‌మైన ర‌హ‌దారులు, వేధింపులు, సోష‌ల్ మీడియా కేసులు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు, మ‌ద్యం మ‌ర‌ణాలు, భూములు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. ఇలా అనేక విధానప‌ర‌మైన అంశాల‌ను ప్ర‌స్తావించింది. ఫ‌లితంగా ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో టీడీపీ కూట‌మికి క‌నెక్ట్ అయ్యారు.

మ‌రి ఇప్పుడు వైసీపీ ఏం చేస్తోందంటే.. స్టిల్ ప్ర‌జెంట్ కూడా.. వైసీపీ విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను వ‌దిలేసింది. కేవలం చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకుని వీడియోలు, ఆడియోలు, గ్రాఫిక్‌లను న‌మ్ముకుంది. ఇది ఏమైనా ఫ‌లితాన్ని ఇచ్చిందా? అంటే.. స్థానిక ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌లు మ‌రోసారి షాక్ ఇచ్చారు. అలా కాకుండా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అందిపుచ్చుకుంటే.. ఆ ఫలితం వేరేగా ఉండేద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. వాస్త‌వానికి పార్టీ ఎప్పుడూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం.. వారి స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించ‌డం వంటివి చేస్తేనే పుంజుకుంటుంద‌ని అంటున్నారు. ఇది నాయ‌కుడైనా పార్టీకైనా ఒకే సూత్రం వ‌ర్తిస్తుంద‌ని చెబుతున్నారు.

Tags:    
  • ysrcp 
  • tdp 
  • chandrababunaidu 
  • jaganys 
  • andhrapolitics 

Similar News

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్

2026-11-12 04:24 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

బాబు లెక్కకు అందని జగన్ లెక్క !

2026-11-12 03:21 GMT

హైడ్రా రంగనాథ్ మీద నాగ్ పొగడ్తల వర్షం...మ్యాటర్ ఇదే !

2026-11-12 02:22 GMT

Copyright @2026

Powered by Blink CMS