అక్క‌డంతే: గెలిచింది టీడీపీ.. అధికారం వైసీపీదా.. ?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాల్లో వైసిపి మాటే నెగ్గుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నేత‌లు.;

Update: 2025-12-14 12:30 GMT

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాల్లో వైసిపి మాటే నెగ్గుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నేత‌లు. రెండు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గాలలో వైసిపి నే ప్రధానంగా ఇంకా చక్రం తిప్పుతోందన్న చర్చ నడుస్తుండడం విశేషం. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు అదేవిధంగా గంగాధర నెల్లూరు ఈ రెండు నియోజకవర్గాలు ఎస్సీ సామాజిక వర్గం పరిధిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గం నుంచి మురళీమోహన్ టిడిపి తరఫున విజయం దక్కించుకున్నారు.

అదేవిధంగా గంగాధర నెల్లూరు నుంచి థామస్ విజయం సాధించారు. వీరిద్దరూ కొత్త నాయకులు కావడం తొలిసారి విజయం దక్కించుకున్న నేపథ్యంలో వీరుపై పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. వచ్చే ఎన్నికలనాటికి మరింత బలంగా పార్టీని విస్తరించాలని కూడా భావించింది. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైసిపి నాయకులు చక్రం తిప్పుతున్నారు అన్నది రాజకీయంగా వినిపిస్తున్న మాట. పూతలపాటి నియోజకవర్గంలో ఎంఎస్ బాబు గంగాధర నెల్లూరులో మంత్రి నారాయణస్వామి మాటే పై చేయిగా ఉందని తెలుస్తోంది.

ముఖ్యంగా అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా టిడిపి నాయకుల కంటే కూడా వైసిపి నేతలకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు అన్న చర్చకు వచ్చింది. ఈ విషయంలో పార్టీకి కూడా సమాచారం అందింది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నా ప్రజలతో మమేకమవుతున్నా ఈ పరిస్థితులు ఉండవన్నది తరచుగా చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి గంగాధర్ నెల్లూరులో థామస్ పర్యటిస్తున్నారు.

అయితే ఆయన వైసీపీ నాయకులతో కలిసి పని చేస్తుండడం కొన్నాళ్ల కిందట వివాదంగా మారింది. ఇక పూతలప‌ట్టు నియోజకవర్గంలో మురళీమోహన్ కూడా ప్రజల మధ్య ఉంటున్నారు. కానీ, ఇక్కడ కూడా ఎమ్మెస్ బాబు వర్గానికి ఎక్కువ ప్రాధాన్య ఇస్తుండడం ముఖ్యంగా అధికారులు కూడా ఆయన చెప్పినట్టు పనిచేస్తున్నారు అన్న వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. టిడిపి నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా.. జనసేన చిత్తూరు జిల్లాలో పరిస్థితి బాగోలేదని చెప్పింది.

అధికారులు తమ మాట వినడం లేదని కూడా చెప్పుకు వచ్చారు ఈ పరిస్థితులు మార్చకపోతే వచ్చే ఎన్నికల నాటికి తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని కూడా వారు వెల్లడించడం విశేషం. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏ విధంగా ముందుకు సాగుతారు అన్నది చూడాలి. వాస్తవానికి వైసిపి అధికారం కోల్పోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు కూడా హెచ్చరిస్తున్నారు. ఇతర పార్టీల నాయకులతో కలిసి అడుగులు వెయ్యోద్దు అని కూడా చెబుతున్నారు.

అయినా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఈ పరిస్థితి ఉండడం విశేషం. అయితే దీనికి అధికారంలో ఉన్న టిడిపి నాయకులు చెబుతున్న మాట భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు కొంత కలిసి వచ్చారని అంతర్గతంగా తమకు హెల్ప్ చేశారని చెబుతున్నారు. మరి దీనిలో ఎంత నిజం ఉంది. ఏంటి అనేది చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయాలు చర్చనీయాంసంగా మారాయి.

Tags:    

Similar News