వైసీపీని టెన్షన్ పెడుతున్న ఎమ్మెల్యే

కష్టాలు అన్నీ ఒకేసారి కమ్ముకుని వస్తాయి. వైసీపీకి ఇపుడు అలాంటి పరిస్థితి ఉందని అంటున్నారు.;

Update: 2025-09-20 04:01 GMT

కష్టాలు అన్నీ ఒకేసారి కమ్ముకుని వస్తాయి. వైసీపీకి ఇపుడు అలాంటి పరిస్థితి ఉందని అంటున్నారు. అసలే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయి కోలుకోలేని స్థితిలో ఉంది అంతే కాదు విపక్షంలోకి వచ్చి ఏణ్ణర్థం అవుతున్నా కూడా గ్రాఫ్ అయితే పెద్దగా పెరగడం లేదు. మరో వైపు చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలలో అసహనం బాగా పెరిగిపోతోంది అని అంటున్నారు. కూటమి ప్రభంజనంలో సైతం నెగ్గి ఎమ్మెల్యేలుగా అయిన వారు అధ్యక్షా అని అసెంబ్లీలో గొంతెత్తలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటున్నారు. దాంతో కొంతమంది ముభావంగా ఉంటే మరికొంత మంది సైలెంట్ తో చంపేస్తున్నారు వైసీపీకి మాత్రం ఇది యమ టెన్షన్ గా ఉంది అని అంటున్నారు.

అంటీ ముట్టనట్లుగా :

ఇక చూస్తే అల్లూరి జిల్లా అరకు ఎమ్మెల్యే మత్స్య లింగం తీరు వైసీపీకి కొత్త డౌట్లు వచ్చేలా చేస్తోంది అని అంటున్నారు. ఆయన మీద గతంలోనే కొన్ని పుకార్లు షికారు చేశాయి. ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారని కూటమికి టచ్ లోకి వెళ్తున్నారని ప్రచారం సాగింది. అయితే అలాంటిది ఏదీ లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఇపుడు మళ్ళీ దాదాపుగా అలాంటి ప్రచారమే మళ్లీ స్టార్ట్ అయింది దానికి ఆయన వ్యవహార శైలి కారణం అని అంటున్నారు వైసీపీ అధినాయకత్వం ఇస్తున్న ఏ అందోళనకు ఏ పిలుపునకు అందనంత దూరంలో ఆయన ఉంటున్నారుట. అంతే కాదు పార్టీ కార్యక్రమాలు అంటే అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని టాక్.

చలో పాడేరుకు డుమ్మా :

తాజాగా వైసీపీ అన్ని మెడికల్ కాలేజీల వద్ద తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. అలా పాడేరులో జరిగిన కార్యక్రంలో వైసీపీకి చెందిన నాయకులు ఎమ్మెల్యేలు అంతా పాల్గొన్నారు. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటే ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదలి వచ్చాయి. విశాఖ జిల్లా నుంచి నాయకులు పాడేరు వెళ్ళి మరీ ఆందోళన చేశారు కానీ పక్కనే ఉన్న అరకు ఎమ్మెల్యే మాత్రం డుమ్మా కొట్టారు అని అంటున్నారు. ఆయన ఈ ఆందోళనకు దూరంగా విజయవాడలో ఉన్నారని అంటున్నారు. ఎందుకు అలా ఆయన చేశారు అన్నదే ఇపుడు వైసీపీలో హాట్ డిస్కషన్ పాయింట్ గా ఉంది.

వేరే ఆలోచనలతో :

అరకు మీద జనసేన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తరచూ అక్కడికి వస్తున్నారు. అభివృద్ధి కార్య్రకమాలు చేపడుతున్నారు అంతే కాదు గిరిజనంతో మమేకం అవుతున్నారు. ఇక తెలుగుదేశం కూడా తమ పార్టీలో బలమైన నేతలకు కీలక పదవులు ఇచ్చింది దాంతో వారు జనంలోకి వస్తున్నారు. అధికారం చేతిలో ఉండడంతో సైకిల్ పార్టీ పటిష్టం అయ్యేందుకు చూస్తోంది. ఇక వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మాత్రం కనీసం అసెంబ్లీకి వెళ్ళడం లేదని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అంతే కాదు ఆయనను ఏ అభివృద్ధి కార్యక్రమానికి పిలవడం లేదు. ప్రోటోకాల్ ని పాటించడం లేదు అని ఆయన వర్గం అంటున్నా కూటమి పట్టించుకోవడం లేదు. దీంతో భవిష్యత్తు పరిణామాలను బేరీజు వేసుకుని మరీ వైసీపీ అరకు ఎమ్మెల్యే మౌనంగా ఉంటున్నారు అని అంటున్నారు

బాంబు పేలుస్తారా :

ఇంకో వైపు చూస్తే గడచిన మూడు ఎన్నికల్లో టీడీపీ అరకులో గెలిచింది లేదు. దాంతో ఈసారి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. వచ్చే ఏడాది స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో అరకు ఎమ్మెల్యేను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక అసెంబ్లీకే వెళ్ళలేని పరిస్థితి వైసీపీలో ఉందని అందువల్ల కూటమిలో చేరి సభకు వెళ్ళడమే కాదు తన పదవీ కాలంలో అభివృద్ధి పనులు చేసి చూపించి 2029లో రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకోవడానికి మత్య్సలింగం ప్లాన్ ఏమైనా రచిస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి అరకు నుంచి ఆయన రెడీ అంటే ఆ వరస ఎక్కడికి వెళ్తుందో అని అంటున్నారు.

Tags:    

Similar News