రెడ్డి గారికి జగన్ సారీ !

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాదూ కూడదు అని చెప్పారా. ఓ విధంగా సారీ చెప్పారా అంటే అవును అని వైసీపీ అంటోంది.;

Update: 2025-09-01 04:13 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాదూ కూడదు అని చెప్పారా. ఓ విధంగా సారీ చెప్పారా అంటే అవును అని వైసీపీ అంటోంది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ఇంతకు ఏమా కధ జగన్ ఎందుకు అలా చెప్పారు. ఎవరా రెడ్డి గారు అంటే మ్యాటర్ చాలానే ఉంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలు దేశంలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ ని పెంచేస్తున్నాయి. కేంద్రంలో అధికారలో ఉన ఎన్డీయే వర్సెస్ ప్రతిపక్షంలోని ఇండియా కూటమి మధ్య హోరా హోరీ పోరుగా ఇది పరిణమిస్తోంది అని అంటున్నారు

ఇండీ కూటమి అభ్యర్థి ఫోన్ :

ఇదిలా ఉంటే ఇండియా కూటమి అభ్యర్ధిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఫోన్ చేశారు అని అంటున్నారు. తనకు ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వవలసినదిగా ఆయన కోరారని అంటున్నారు. అయితే వైఎస్ జగన్ ఆయనకు తాము ఎన్డీయే అభ్యర్ధి రాధాక్రిష్ణన్ కి ముందుగా మాట ఇచ్చామని చెప్పారని అంటునారు. అందువల్లనే మద్దతు ఇవ్వలేకపోతున్నామని సుదర్శన్ రెడ్డికి వివరించారని అంటున్నారు ఈ విషయంలో అన్యధా భావించవద్దు అని కూడా జగన్ ఆయనను కోరారని చెబుతున్నారు. ఇక సుదర్శన్ రెడ్డి న్యాయ వ్యవస్థ ద్వరా ప్రజలకు ఎంతో సేవ చేశారు అని జగన్ ఈ సందర్భంగా కొనియాడారని అంటున్నారు. ఈ మేరకు వైసీపీ ట్వీట్ చేసింది.

రాజకీయంగా చర్చ:

వైసీపీ చాలా రోజుల క్రితమే ఎన్డీయేకు తమ మద్దతుని తెలియచేసింది. ఆ విషయాన్ని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియా ముఖంగా ప్రకటించారు కూడా. అయితే ఇన్నాళ్ళ తరువాత ఇపుడు ఇండీ కూటమి నుంచి జగన్ కి ఫోన్ రావడం అది కూడా నేరుగా అభ్యర్థిగా ఉన్న వారే చేయడంతో రాజకీయ చర్చ సాగుతోంది. దీంతో వైసీపీ తమ స్టాండ్ ని మరోసారి తెలియచేసింది కానీ ఒక సాటి తెలుగు వారికి మద్దతు ఇవ్వలేదు అన్న విమర్శలు వైసీపీకి ఈ విషయంలో వస్తాయా అన్నదే చర్చగా ఉంది.

ఎన్డీయే గుడ్ లుక్స్ లో :

మరో వైపు చూస్తే ఇండియా కూటమి అభ్యర్ధి నేరుగా ఫోన్ చేసినా సాటి తెలుగు వారు అందునా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అయి ఉన్నా కూడా వైసీపీ ఎన్డీయేకు స్ట్రాంగ్ గా నిలిచి మద్దతు తెలియచేయడం అంటే ఆ కూటమి గుడ్ లుక్స్ లో వైసీపీ ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో సాటి తెలుగు రాష్ట్రంలో మాత్రం తమ వారికి మద్దతు ఇవ్వలేదు అన్న బాధ అసంతృప్తి అయితే ఉంటుంది అది వైసీపీకి ఎంతో కొంత ఇబ్బంది కలిగిస్తుందా అన్న చర్చ కూడా ఉంది.

టీడీపీ కంటే కూడా :

ఇక ఏపీలో టీడీపీ జనసేనలకు ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే అవి అధికారికంగా ఎన్డీయే కూటమిలో ఉన్నాయి. కానీ వైసీపీ అలా కాదు న్యూట్రల్ గా ఉంది. ఏ కూటమిలో లేదు. స్వేచ్చగా తన నిర్ణయం తాను తీసుకోగలిగే స్థితిలో ఉంది పైగా వైసీపీ ఓటు వేయాపోయినా ఎన్డీఎయే అభ్యర్ధికి ఓటమి చెందేంత సింపుల్ మార్జిన్ అయితే లేదు. కానీ వైసీపీ ఫుల్ మెజారిటీ ఉంటూ ఎన్డీయే మద్దతు కోరడం ఒక రాజకీయ ఎత్తుగడ అయితే వైసీపీ మరే వ్యూహంతో మద్దతు ఇచ్చి ఉంటుందో అన్న చర్చ అయితే సాగుతోంది. ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికలు తెలుగు నాట అన్ని పార్టీల కంటే కూడా వైసీపీనే కొంత ఇరుకునపెట్టేలా ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News