జగన్ పొలిటికల్ ఫైల్స్ @ 2025 ..!
వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితంలో 2025 అత్యంత కీలకమైన సంవత్సరం.ఈ మాట చెప్పింది వైసీపీ నాయకులే.;
వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితంలో 2025 అత్యంత కీలకమైన సంవత్సరం.ఈ మాట చెప్పింది వైసీపీ నాయకులే. వాస్తవానికి 2024లో పార్టీ ఘోర పరాజయం తర్వాత.. వచ్చిన 2025లో జగన్ వ్యవహారం.. ఆయన పార్టీ విషయంలో తీసుకునే నిర్ణయాలుకీలకంగా మారుతాయని అందరూ అనుకున్నారు. అయితే .. ఊహించిన దానికంటే కూడా.. ఒక అడుగు ముందుకు వేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం 2025లో కూడా జగన్‌పెద్దగా సాధించిన విజయాలు కనిపించడం లేదు.
అయితే.. ప్రధానంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలోని లోపాలను ఎత్తి చూపడంలో మాత్రం జగన్‌ముందున్నారు. రైతుల సమస్యల విషయంలో బలమైన గళం వినిపించారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. నేనున్నానంటూ.. ఆయన స్పందించారు. మిర్చి, పొగాకు, మామిడి(చిత్తూరు) రైతుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా సర్కారు ఒకింత ముందుకు కదిలేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యార న్నది వైసీపీ నాయకులు చెబుతున్న మాట.
ఇక, పార్టీ పరంగా నాయకులు కట్టుతప్పకుండా .. చూసుకోవడంలో మాత్రం జగన్ 50 శాతం మాత్రమే సక్సెస్ అయ్యారు. పార్టీ నుంచి చాలా మంది ఈ ఏడాదిప్రారంభంలోనే జంప్ చేశారు. ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. అదేసమయంలో ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారని ప్రచారం జరిగినా.. వారిని నిలువరించడంలోను.. పార్టీలో కొనసాగేలా చేయడంలోనూ జగన్ విజయందక్కించుకున్నారు అసెంబ్లీకి వెళ్లినా.. వెళ్లకపోయినా.. జగన్ పేరు ప్రముఖంగా వినిపించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
ఇక, ప్రజల మద్యకు వస్తానని తరచుగా చెప్పినా.. జగన్ ఆ పనిచేయలేకపోయారు. బెంగళూరు-తాడేపల్లి అప్పుడప్పుడు.. పులివెందుల పర్యటనలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇక, ఈ ఏడాదిలో కీలక విషయం.. సొంత బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగినప్పుడు జగన్ ఫోన్ వచ్చిందని.. దీనిపై విచారణ చేపట్టాలని కోరగా.. కోర్టు తోసిపుచ్చడం ఒకటి. ఇక, పీపీపీ విధానంపై చేసిన నిరసన కూడా వైసీపీలో ఐక్యమత్యాన్ని చాటింది. మొత్తంగా 2025లో జగన్‌కు మిశ్రమ ఫలితాలు మాత్రమే దక్కాయి. అయినా.. కూడా జగన్ తన వైఖరినే కొనసాగించారు.