వైసీపీపై రెడ్ల ఒత్తిడి.. రీజన్ ఇదే...?
వైసీపీ అధినేత జగన్ పై ఆయన సొంత సామాజిక వర్గం రెడ్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.;
వైసీపీ అధినేత జగన్ పై ఆయన సొంత సామాజిక వర్గం రెడ్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్రధానంగా రెండు విషయాల్లో జగన్‌పై వారు ఒత్తిడి పెంచుతున్నారు. గత ఎన్నికల సమయంలోనే రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి దూరమైంది. జగన్ హయాంలో అనుసరించిన విధానాలు.. ఇతరత్రా అంశాలు.. పనులు కల్పించకపోవడం వంటివాటిని ప్రశ్నించారు. రెడ్లను పూర్తిగా గతంలోనే పక్కన పెట్టారు. ఫలితంగా సొంత సామాజిక వర్గం అండ మందగించి గత ఎన్నికల్లో జగన్‌కు ఘోర పరాభవం ఎదురైంది.
ఈ అనుభవాలను గుర్తు చేస్తున్న కొందరు నాయకులు.. ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం వచ్చిందని చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మనం మద్దతు ఇవ్వాలని ఉమ్మడి కడప జిల్లాకు చెందిన నలుగురు రెడ్డి నాయకులు జగన్ కు సూచించా రు. ఈ మేరకు పార్టీ కార్యాలయానికి వారు లేఖలు సంధించారు. దీనిలో సారాంశం మొత్తం సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వడమే.. అయినా, కొన్ని కీలక అంశాలను వారు ప్రస్తావించారు.
1) రెడ్డి సామాజిక వర్గాన్ని చేరువ చేసుకోవడం: గత ఎన్నికలకుముందు పోయిన, పోగొట్టుకున్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లను తిరిగి పొందాలన్నా.. వారి సానుభూతిని తిరిగి సొంతం చేసుకోవాలన్నా.. ప్రస్తుతం ఇండియా కూటమి నిలబెట్టిన రెడ్డి సామాజిక వర్గం వ్యక్తికి మద్దతు ఇవ్వడం ద్వారా తిరిగి రెడ్లను ఓన్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రెడ్డి కోణంలోనూ సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ కనుక చేతులు కలిపితే.. అది మున్ముందు కలిసి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
2) మేదావి వర్గం: ప్రస్తుతం మేధావి వర్గం వైసీపీకి కడుదూరంలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో అనేక మంది మేధావులు వైసీపీని ఎండగట్టారు. టీడీపీకి మద్దతు పలికారు. ఇప్పుడు వీరంతా కూడా.. రా జ్యాంగ కోవిదుడుగా.. ఉపరాష్ట్రపతి సీటుకు తగిన అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని చూస్తున్నారు. ఈ నేప థ్యంలో జగన్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించడం ద్వారా.. మేధావి వర్గాన్ని తిరిగి అక్కున చేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేతకు నాయకులు వివరించారు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.