రావాలి జగన్ అంటున్న పులివెందుల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల వెళ్తున్నారు. ఆయన ఏకంగా మూడు రోజుల పాటు పులివెందులలో బస చేయనున్నారు.;

Update: 2025-08-31 21:30 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల వెళ్తున్నారు. ఆయన ఏకంగా మూడు రోజుల పాటు పులివెందులలో బస చేయనున్నారు. ఆయన ఈ సందర్భంగా సెప్టెంబర్ 2న దివంగత నేత మాజీ సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించనున్నారు. ఇక వరుసగా రెండు రోజుల పాటు ఆయన ప్రజా దర్బార్ ని నిర్వహిస్తారు. ప్రజలకు అందుబాటులో ఉంటారు.

ఓటమి తరువాత ఫస్ట్ టైం :

ఇదిలా ఉంటే ఈ మధ్యనే జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి మామూలుగా లేదు. అయితే వైసీపీ తాను ఓడలేదు అనవచ్చు. అధికార టీడీపీ దౌర్జన్యం చేసింది అని చెప్పవచ్చు. అయితే అధికార పార్టీ అంతా చేస్తూంటే ఫుల్ సైలెంట్ గా వైసీపీ శ్రేణులు కానీ నాయకత్వం కానీ ఉండడం మీదనే చర్చ సాగుతోంది వైసీపీకి కాదు వైఎస్సార్ కుటుంబానికే అంకితమైన గ్రామాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రతీ గడప వైఎస్సార్ ఫ్యామిలీ కోసం తపిస్తుంది. అలాంటి చోట ఓటమి సంభవించింది అంటే క్యాడర్ లో నిర్వేదం అని స్పష్టంగా తెలుస్తోంది. మరి అది ఎందుకు జరిగింది అన్నది జగన్ పులివెందుల పర్యటన సందర్భంగా కనుగొంటారా అన్న చర్చ అయితే సాగుతోంది.

నేతలతో ముఖాముఖీ :

ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత జగన్ స్థానికంగా ఉన్న నేతలతో ఫోన్ లో మాట్లాడారు అన్న ప్రచారం అయితే సాగింది. ఈ ఓటమి ఎందుకు సంభవించింది అన్న వివరాలను ఆయన నేరుగా స్థానిక నేతల నుంచే కొంత తెలుసుకునే ప్రయత్నం చేసారు అని అంటున్నారు. అదే సమయంలో వారు కూడా కొన్ని విషయాలు ఫోన్లో పంచుకుకున్నారు, కొన్ని చెప్పలేదని అంటున్నారు. ఇపుడు జగన్ ముఖాముఖీగా వారితో మాట్లాడనున్నారు. దాంతో వారు ఇప్పుడు జగన్ సమక్షంలో అయినా విషయాలు ఏమైనా చెబుతారా అన్నది కూడా ఆసక్తిని కలిగించే విషయంగా ఉంది అంటున్నారు.

లోతుల్లోకి వెళ్తేనే :

ఇదిలా ఉంటే వైసీపీని ప్రాణప్రదంగా అభిమానించే వారు సైతం కొంత నిరాశలో నిర్వేదంలో ఉన్నరు అని అటున్నారు. వారి మదిలో ఏముందో జగన్ కనుగొనే ప్రయత్నం చేస్తారా అని కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే క్యాడర్ వీక్ గా అయితే లేదు, కానీ వారు ఎందుకో పోరాటంలో వెనకడుగు వేశారు అన్నది స్పష్టంగా అర్ధం అవుతోంది అని అంటున్నారు. మరి వారి సమస్యలు ఫలానా అని అధినాయకత్వం తెలుసుకున్నట్లు అయితే వాటిని సాకారం చేయడానికి చూసే వీలు ఉంటుంది జగన్ పులివెందుల టూర్ లో ఆ దిశగా ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది.

తరచూ భేటీలు :

మరో వైపు చూస్తే జగన్ తరచుగా పులివెందులకు రావాలని కూడా క్యాడర్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే క్యాడర్ కి పార్టీతో అయితే గ్యాప్ ఉంది. వారి సమస్యలను పరిష్కరించే స్థానిక పార్టీ యంత్రాంగం అయితే అంత చురుకుగా లేదని అంటున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఈ విషయంలో అనుకున్నంత స్థాయిలో పనిచేయలేకపోతున్నారు అన్న మాట కూడా ఉంది. అందువల్ల జగన్ పులివెందుల పర్యటనలో క్యాడర్ అయితే రావాలి జగన్ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ తమ సమస్యలు తెలుసుకోవాలి జగన్ అని అంటున్నారని చెబుతున్నారు. మరి జగన్ నెలకు ఒకసారి అయినా పులివెందుల వెళ్తే కనుక పార్టీ మొత్తానికి జోష్ వస్తుంది అని అంటున్నారు. ఆ ప్రభావం ఇతర ప్రాంతాల మీద కూడా పడుతుంది అని అంటున్నారు

Tags:    

Similar News