భార‌త్‌లో జిన్‌పింగ్‌కు కాలు నిల‌వ‌లేదా..?!

భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన చైనా అధ్య‌క్షుడు షి. జిన్‌పింగ్.. మీడియాలో హైలెట్ అయిన విష‌యం తెలిసిందే.

Update: 2026-09-13 09:29 GMT

భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన చైనా అధ్య‌క్షుడు షి. జిన్‌పింగ్.. మీడియాలో హైలెట్ అయిన విష‌యం తెలిసిందే. ర‌ష్యా, ద‌క్షిణాఫ్రికా స‌హా అనేక దేశాల నుంచి కూడా అధ్య‌క్షులు, ప్ర‌ధాన మంత్రులు ఢిల్లీలోని భార‌త మండ‌పంలో జ‌రిగిన బ్రిక్స్ స‌ద‌స్సుకు ఒక రోజు ముందే అంటే.. శుక్ర‌వార‌మే(శ‌నివారం నుంచి బ్రిక్స్‌) వ‌చ్చారు. కానీ, చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ మాత్రం శ‌నివారం ఉద‌యం 11 గంట‌లకు బీజింగ్ నుంచి ఢిల్లీకి వ‌చ్చారు. అప్ప‌టికే స‌ద‌స్సు ప్రారంభ‌మైపోయింది.

ఇక‌, ఆయ‌న క‌నీసం 24 గంట‌లు కూడా భార‌త్‌లో ఉండ‌లేక‌పోవ‌డం.. గ‌మ‌నార్హం. శ‌నివారం జ‌రిగిన తొలి రోజు సెష‌న్‌లో పాల్గొన్నా.. పెద్ద‌గా మ‌న‌సు పెట్ట‌లేక పోయార‌ని.. జాతీయ మీడియా భావిస్తోంది. అనంత‌రం.. ఆయ‌న ఆదివారం ఉద‌యం ప్ర‌ధాని మోడీ స‌హా.. బ్రిక్స్ దేశాల అధినేత‌ల‌తో క‌లిసి భార‌త మండ‌పం వ‌ద్ద ఫొటోలు దిగారు. వాస్త‌వానికి ఈ ఫొటో సెష‌న్ త‌ర్వాత‌.. రెండో రోజు.. స‌ద‌స్సు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, జిన్ పింగ్ కాలు నిల‌వ‌లేదు. ఆ వెంట‌నే ఆయ‌న బీజింగ్ దిశ‌గా విమానం ఎక్కేశారు.

హైలెట్ అయింది.. బ్రిక్స్ కాదా?

ఇక‌, చైనా అధ్య‌క్షుడి విష‌యంలో భార‌త మీడియా అతిగా స్పందించింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిజానికి బ్రిక్స్ స‌ద‌స్పును భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించింది. దీనికి వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసింది. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించ‌డం సాధార‌ణ పౌరులు కూడా ఇబ్బంది ప‌డ్డారు. ఇంత ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు బాగానేక‌వ‌రేజీ ఇచ్చిన భార‌త మీడియా.. చైనా అధ్య‌క్షుడు వాల‌డంతో ఫోక‌స్ అంతా ఆయ‌న‌పైనే ఉంచింది. ఆయ‌న చుట్టూనే క‌థ‌నాలు వండి వార్చింది.

ఎందు కింత ప్రాధాన్యం..

చైనా అధ్య‌క్షుడు ఏడు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. మ‌రీ ముఖ్యంగా గాల్వాన్ లోయ‌(స‌రిహ‌ద్దు)లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ త‌ర్వా.త‌. ఆయ‌న రావ‌డం ఇదే తొలిసారి. అయితే.. చైనాభార‌త్ దేశాల మ‌ధ్య కొన్ని చిక్కులు ఉన్న‌ప్ప‌టికీ.. సాంకేతిక‌త‌, ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల్లో మార్కెట్ విష‌యంలో ఇరు దేశాలు పర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే జిన్‌పింగ్ రాక‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. అయితే.. మీడియా ఇంత క‌వ‌రేజీ ఇవ్వ‌డం.. పై మాత్రం విమర్శ‌లు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News