పుణె విప్రోలో కొత్త రచ్చ.. మతం మారాలని ఒత్తిడి చేస్తున్నారా?
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నాసిక్ టీసీఎస్ ఉదంతానికి సంబంధించి.. వివరాలు బయటకు వెల్లడైనా.. లోతుగా నిర్వహించిన దర్యాప్తులో ఏమేం అంశాలు వెలుగు చూశాయన్నది పెద్దగా బయటకు రాలేదు.
ఐటీ కంపెనీల్లో మతం మారాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయా? తమ వద్ద పని చేసే ఉద్యోగులు మతం మారకుంటే.. ప్రమోషన్లు మొదలు కెరీర్ ముందుకు సాగదన్న హుకుం పెరుగుతున్నాయా? కార్పొరేట్ ప్రపంచానికి మతానికి మధ్య లింకేంటి? ఆ మాటకు వస్తే.. టెక్ ప్రపంచంలో ఉండేవారంతా విద్యాధికులే. అలాంటి వారు.. మతం మారాలంటూ తమ తోటి ఉద్యోగులు.. తమ వద్ద పని చేసే వారిపై ఒత్తిళ్లు చేయటం సాధ్యమేనా? అన్నది ఒక ప్రశ్న అయితే..ఇలాంటి దరిద్రాలు కూడా ఉన్నాయన్నట్లుగా నాసిక్ టీసీఎస్ ఉదంతం కొత్త చర్చకు తెర తీసింది.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నాసిక్ టీసీఎస్ ఉదంతానికి సంబంధించి.. వివరాలు బయటకు వెల్లడైనా.. లోతుగా నిర్వహించిన దర్యాప్తులో ఏమేం అంశాలు వెలుగు చూశాయన్నది పెద్దగా బయటకు రాలేదు. ఈ ఉదంతం గురించి దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న వేళ.. అనూహ్య రీతిలో అంతకు మించి అన్నట్లుగా తాజాగా ఫుణె విప్రోకు చెందిన మాజీ ఉద్యోగిని ఒకరు చేసిన సంచలన ఆరోపణ ఇప్పుడు మరింత షాకింగ్ గా మారింది. తనను మతం మారాలని.. ఇస్లామ్ పద్దతుల్ని అనుసరించాలని కోరుతూ తనపై ఒత్తిడి తెచ్చే వారంటూ ఫుణె విప్రో మాజీ ఉద్యోగిని ఒకరు చేసిన ఆరోపణ ఇప్పుడు మరింత షాక్ కు గురి చేసేలా మారింది.
తాను చెప్పినట్లుగా చేయకపోతే ఉద్యోగం తీయిస్తానంటూ తన బాస్ ఒత్తిళ్లకు తట్టుకోలేక తాను జాబ్ కు రిజైన్ చేసినట్లుగా సదరు మాజీ ఉద్యోగిని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న బాధితురాలు.. తమ మహిళా బాస్ పై పోలీసులతో పాటు.. మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయటంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. అయితే.. బాధితురాలికి సంబంధించి వివరాలు బయటకు రాకుండా పోలీసులు గోప్యతను పాటిస్తున్నారు.
ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. నాసిక్ టీసీఎస్ లోనూ.. పుణె విప్రోలో వెలుగు చూసిన ఈ దుర్మార్గ ఉదంతంలో మహిళా ఉద్యోగుల పాత్ర ఉండటం.. మహిళల్ని లక్ష్యంగా చేసుకోవటం కనిపిస్తుంది. ఇంతకూ బాధితురాలి ఆరోపణలోకి వెళితే..
- పుణెలోని హింజేవాడి విప్రో క్యాంపస్ లో పని చేసిన సందర్భంలో తన బాస్.. మరికొందరు కోలీగ్స్ ఇస్లాంలో మారాలని నిరంతరం మానసిక వేధింపులకు గురి చేశారు. ఇస్లాంలోకి మారితే దుబాయ్ లో విలాసవంతమైన జీవితం ఉంటుందని.. పెళ్లి చేసుకొని సెటిల్ కావొచ్చంటూ ప్రలోభ పెట్టారు
- ఇలాంటి వాటికి నేను నిరాకరించాను. దీంతో నా పని తీరు బాగోలేదంటూ నెగిటివ్ రిపోర్టులు ఇస్తామని.. ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ తరహా వేధింపులు నిరంతరం కొనసాగేవి. దీంతో వీటిని భరించలేక 2025లో ఆగస్టులో మైక్రోసాఫ్ట్ టీమ్స్ కాల్ ద్వారా నాతో బలవంతపు రాజీనామా చేయించారు.
- నాకు ఎదురైన వేధింపులపై తాను కంపెనీలోని ఉన్నతాధికారులకు.. హెచ్ విభాగ అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. అందుకే చట్టపమైన మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది.
- మతం మారాలంటూ వేధింపులకు గురి చేసింది ప్రధానంగా ఇద్దరు. అందులో మహిళా బాస్ ఉన్నారు. ఆమె బెంగళూరుకు చెందినవారు. ఆమెతో పాటు పని చేసే మరో మేల్ కొలీగ్. కొందరు సీనియర్ మేనేజర్లు.. టీమ్ లీడర్ల ప్రమేయం కూడా ఉంది.
- హింజేవాడి పోలీస్ స్టేషణ్ ఎదుట మీడియాతో చెప్పిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. నేను ఉద్యోగంలో చేరిన రోజు నుంచే మహిళా బాస్ షాహినా రఫీక్ వేధింపులకు గురి చేసింది. ఇస్లాం పద్దతులు పాటించాలని ఒత్తిడి తీసుకొచ్చేది. మరో కొలీగ్ తనతో రిలేషన్ లో ఉండాలని ఒత్తిడి చేసేవాడు. మతం మారితే పెళ్లి చేసుకుంటానని.. దుబాయ్ లో సెటిల్ అయ్యేలా చూస్తానని ఆశ పెట్టేవాడు. ఇలాంటి వ్యక్తులు ఒక సిండికేట్ గా మారి హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు.
- నా మహిళా బాస్ నాతో మాట్లాడుతూ కంపెనీ కంట్రీ హెడ్ తో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే సులువుగా దుబాయ్ కు బదిలీ చేయిస్తానని.. అక్కడ షేక్ లతో పెళ్లి జరిపించి భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తానని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన అనుమతి లేకుండా తనకు తెలియకుండానే ఆఫీస్ ల్యాప్ టాప్ పాస్ వర్డ్ లను మార్చేశారు. నా ప్రమేయం లేకుండానే అంతర్గత వ్యవస్థ ద్వారా రాజీనామా లేఖను కూడా సబ్మిట్ చేశారు. నా వ్యవహారంలో కంపెనీ ఇంటర్నల్ కమిటీ ఫెయిల్ అయ్యింది. నాకు తిరిగి జాబ్ ఇప్పించాలి. ఉద్యోగం లేని కాలానికి జీతభత్యాలు చెల్లించాలి.
ఈ ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీంతో ఫుణె పోలీసులు బెంగళూరు మహిళా బాస్ తో పాటు.. బాధితురాలి కోలీగ్ కు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపారు. ఆ సంచలన ఆరోపణలపై విప్రో స్పందించింది. తమ కార్యాలయాల్లో ఎలాంటి వివక్ష.. మతపరమైన వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో సహించే అవకాశం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. పోలీసులు చేపట్టిన విచారణకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామన్న సంస్థ.. దర్యాప్తునుకు అవసరమైన అంతర్గత డాక్యుమెంట్లను కూడా అందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులకు పలు పత్రాల్ని ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. మొన్న నాసిక్.. నేడు ఫుణె ఐటీ కంపెనీల్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలపై మరింత లోతు విచారణ జరగాల్సి ఉంది. తప్పు ఎక్కడ జరుగుతుంది? అలాంటి వాటికి కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉందని చెప్పాలి.