• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భార్యను జూదంలో...

భార్యను జూదంలో పెట్టాడు... ఇంటికొచ్చాక మరిది కన్నేశాడు!

| వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దిదోలి కొత్వాలి ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-11-11 12:30 GMT

ఈ సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అత్యంత దారుణంగా ఉంటుంటాయి. ఆ బాధితుల జీవితాలు, ఆ సమయంలో వారు అనుభవించిన మానసిక వ్యధ ప్రతీఒక్కరినీ కదిలించేవిగా ఉంటాయి. తాజాగా ఒక మహిళకు తన జీవితంలో ఎదురైన సంఘటనలు ఇదే విషయాన్ని తెరపైకి తెస్తున్నాయి. జూదశాలలో వదిలేసిన భర్త... ఇంటికి వచ్చాక కన్నేసిన మరిది.. సినిమాల్లో మాత్రమే కనిపించేలా ఉన్న ఈ సంఘటన యూపీలో జరిగింది.

అవును... ఉత్తరప్రదేశ్ లో ఒక కలియుగ మహాభారత సంఘటన జరిగింది. కట్టుకున్న భార్యను జూదంలో పెట్టి ఓడిపోయిన ధర్మరాజు టైపులో ఒక వ్యక్తి ఇలాంటిపనే చేశాడు. జూదశాలలో జూదం ఆడుతూ బాగా నష్టపోయే సరికి చేసేదేమీ లేక ఒక్క నిమిషం బయటకు వెళ్లి వస్తానని చెప్పి, తన భార్యను మాత్రం అక్కడే ఉంచి, పరారైపోయాడు! అనంతరం మరికొన్ని దారుణాలు జరగడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దిదోలి కొత్వాలి ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. కుటుంబ పెద్ద తన కుమార్తెను ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారి వివహం జరిగి సుమారు మూడేళ్లు అయ్యింది. ఈ మూడేళ్లు ఆమె ఆ ఇంట్లో ప్రత్యక్ష నరకాన్ని చూసింది. వ్యవసనాలకు బానిసైన భర్త.. వేధించుకుని తినే అత్తామామలు.. జులాయిగా తిరిగే మరిది వెకిలి చేష్టలు, కామపు చూపులు వెరసి నరకాన్ని ఇక్కడే చూసేస్తుంది!

ఈ పరిస్థితుల్లో పేకాటకు పూర్తిగా బానిసైన భర్త రూ.15 లక్షలు తేవాలని ఆమెను వేధించేవాడు. విపరీతంగా టార్చర్ చేసేవాడు. అవన్నీ పంటికింద భరిస్తూ ఆ మహిళ కాపురం నెట్టుకొస్తుంది. ఈ క్రమంలో ఓ రోజు ఆమెను నమ్మించి తనతో పాటు ఢిల్లీ తీసుకెళ్లాడు తన భర్త. అయితే... అక్కడ కూడా పేకాట ఆడాడు. ఆ సమయంలో తన భార్యను వెంటపెట్టుకుని వెళ్లాడు. ఈసారి కూడా ఓడిపోయాడు!

ఆ పరిస్థితుల్లో మహాభారతంలో కథ గుర్తుకు వచ్చిందో ఏమో కానీ... డబ్బులు కట్టలేక భార్యను డబ్బులు ఇవ్వాల్సినవాళ్లకు వదిలేసి వచ్చేశాడు! దీంతో షాక్ తిన్న ఆమె అలా నిస్సహాయంగా ఉండిపోయింది. దీంతో విషయం ఆమె సోదరుడికి తెలిసింది. దీంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లి వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులిచ్చి విడిపించుకుని వచ్చాడు. అనంతరం తీసుకెళ్లి అత్తారింటిలో విడిచిపెట్టాడు.

ఆ సమయంలో కూడా కొడుకుని మందలించని అత్తామామలు... ఎవడెవడివద్దో ఉండి వచ్చావంటూ ఆమెను వేదించడం మొదలుపెట్టారు! ఆ సమయంలో ఇంట్లో జులాయిగా తిరుగుతున్న మరిది కామలు చూపులు చూడటం మొదలుపెట్టాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అత్యాచారానికి ఒడిగట్టాడు.

దీంతో ఆ మహిళలోని సహనం నశించింది. ఇక ఈ బాధలు తాను భరించలేనని భావించింది. ఇలా ప్రతీ విషయానికీ రాజీపడుతూ ఉంటే తన బ్రతుకు ఇలానే ఉంటుందని.. మరింత నీచంగా మారిపోతుందని భావించింది. ధైర్యం తెచ్చుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె పరిస్థితి అర్ధం చేసుకున్న పోలీసులు ఆమె భర్తతో పాటు మరో తొమ్మిదిమందిపై వరకట్న వేధింపులు, గృహ హింస, భౌతిక దాడి వంటి పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వీటిపై దర్యాప్తు జరుగుతుంది. ఈ విషయం తెలిసినవారంతా ఆ భర్తపైనా, ఆ కుటుంబసభ్యులపైనా ఫైరవుతున్నారు.

Tags:    
  • Utterpradesh 
  • Didolikotwali 
  • Police 
  • Delhi 
  • Crime 
  • Lucknow 

Similar News

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

Copyright @2026

Powered by Blink CMS