వైట్ హౌస్ వెబ్ సైట్ హ్యాక్.. 8 నిమిషాలు అతడి వీడియోలు

వైట్ హౌస్ కు హ్యాకింగ్ షాక్ తగిలింది. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు గుండెకాయ వైట్ హౌస్. ఎందుకంటే.. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ప్రతి నిర్ణయం ఇందులోనే తీసుకుంటారు.;

Update: 2025-12-20 05:43 GMT

వైట్ హౌస్ కు హ్యాకింగ్ షాక్ తగిలింది. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు గుండెకాయ వైట్ హౌస్. ఎందుకంటే.. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ప్రతి నిర్ణయం ఇందులోనే తీసుకుంటారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం కూడా ఇక్కడే. అలాంటి వైట్ హౌస్ కు చెందిన వెబ్ సైట్ తాజాగా హ్యాక్ కావటమే కాదు.. అందులో అర్థం లేని ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లకు సంబంధించిన ఎనిమిది నిమిషాల లైవ్ స్ట్రీమ్ అయ్యింది. దీంతో.. వైట్ హౌస్ అధికారులు షాక్ కు గురైన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. వైట్ హౌస్ సైట్ లో తన లైవ్ స్ట్రీవ్ రావటంపై ఆశ్చర్యానికి గురైన యూట్యూబర్ ఫార్లే.. తనకు ఈ ఉదంతంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూనే.. ఒకవేళ ఇలా జరుగుతుందని ముందే తెలిస్తే తాను మరింత బాగా తయారయ్యే వాడినంటూ హాస్యమాడాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వైట్ హౌస్ వెబ్ సైట్ లో ఇన్వెస్టు మెంట్ సంబంధిత చిట్కాలకు సంబంధించిన లైవ్ స్ట్రీమ్ రావటంపై వైట్ హౌస్ సిబ్బంది.. ఆ చిక్కుముడిని విప్పే ప్రయత్నంలో తలమునకలయ్యారు.

గత జనవరిలో ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వెబ్ సైట్లు తరచూ సెక్యూరిటీ బ్రీచ్ బారిన పడుతున్న ఉదంతాలు తరచూ చోటు చేసుుకోవటం తెలిసిందే. తాజాగా వైట్ హౌస్ సైట్ కు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావటంతో అధికారులు కిందామీదా పడుతున్నారు. నిజంగానే వైట్ హౌస్ సైట్ హ్యాక్ అయ్యిందా? లేదంటే పొరపాటున ఇలా జరిగిందా? అసలు కారణం ఏమిటన్నది తేల్చే పనిలో పడ్డారు.

తాజా పరిణామం నేపథ్యంలో గతంలో జరిగిన ఉదంతాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. గత మే లో పలువురు అధికారులు.. ప్రఖ్యాత వ్యాపార దిగ్జాలకు అమెరికా అధ్యక్షుని చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫోన్ నుంచి ఆయనకు తెలీకుండానే కాల్స్ వెళ్లటం.. మెసేజీలు వెళ్లటం పెద్ద కలకలాన్నే రేపింది. మొత్తంగా ట్రంప్ హయాంలో హ్యాకర్లు చెలరేగిపోవటమే కాదు.. వైట్ హౌస్ సిబ్బందికి తరచూ షాకులు ఇస్తున్నట్లుగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News