• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇండియా కూటమి...

ఇండియా కూటమి ఏమవుతుందో...ఏమిటో ?

| ఇక ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ వరసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాను చాటుకోలేక ఆపసోపాలు పడుతోంది.

By - Tupaki Desk
Update: 2024-12-08 03:39 GMT

కేంద్రంలో అధికారం చలాయిస్తున్న ఎన్డీయే కూటమికి సరైన ఆల్టర్నేషన్ గా ఏర్పాటు అయిన ఇండియా కూటమి అనుకున్న లక్ష్యాలను సాధించకుండానే ఇబ్బందులో పడుతోందా అన్న చర్చ సాగుతోంది. నిజానికి 2024 ఎన్నికల్లో కచ్చితంగా అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో భారీ టాస్క్ తో ఫీల్డ్ లోకి దిగిన ఇండియా కూటమి అనుకున్నది సాధించలేక చతికిలపడింది.

దాంతోనే ఇండియా కూటమిలో నిస్తేజం ఆవరించింది. ఇక ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ వరసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాను చాటుకోలేక ఆపసోపాలు పడుతోంది. అనేక చోట్ల జూనియర్ పార్టనర్ గా మారిపోయింది. కాంగ్రెస్ కి సోలోగా ఉన్న స్టేట్స్ లో పెద్దవి కర్ణాటక, తెలంగాణా తప్ప మరేమీ లేవు అంటే ఆశ్చర్యమే.

ఇంకో వైపు చూస్తే ఇండియా కూటమికి దూరంగా జరిగి తమ సొంత ఉనికిని చాటుకోవాలని అందులోని పార్టీలు ఆరాటపడుతున్నాయి. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా మొత్తం స్థానాలకి తాము విడిగానే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించడం ఇండియా కూటమిలోని లుకలుకలకు ఒక ఉదాహరణ అంటున్నారు.

మరో వైపు చూస్తే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే ఇండియా కూటమి తాజా పెర్ఫార్మెన్స్ పట్ల పెదవి విరుస్తున్నారు. తాను పూనుకుని ఇండియా కూటమి ఏర్పాటు చేస్తే ఈ రోజున దానిని నడిపిస్తున్న వారికి ఆ నిర్వహణ చేతకాకపోతే తాను ఏమి చేయగలను అంటూ ఆమె విమర్శలు చేశారు.

ఆమె కాంగ్రెస్ మీద దాని అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మీదనే ఈ రకంగా సెటైర్లు వేశారు అని అంటున్నారు. తనకు బెంగాల్ ని విడిచి వెళ్ళడం ఇష్టం లేదని కానీ ఇండియా కూటమికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తే కచ్చితంగా ఇక్కడ నుండి దానిని నడిపిస్తాను అని ఆమె అంటున్నారు. మొత్తానికి మమతా బెనర్జీకి ఇండియా కూటమి తాజా పోకడలు ఏ మాత్రం ఇష్టం లేదని అంటున్నారు. వీలైతే పగ్గాలు తాను అందుకోవాలని ఆమె చూస్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే మమతా బెనర్జీకి ఇండియా కూటమి పగ్గాలు ఇవ్వాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కోరుతున్నారు. మమతకు పగ్గాలు ఇస్తేనే మోడీ ప్రభుత్వం మీద ఇండియా కూటమి మీద గట్టిగా పోరాటం ఇండియా కూటమి చేయడానికి వీలు అవుతుందని ఆయన వాదిస్తున్నారు.

ఇక ఇండియా కూటమిలో ఉన్న ఆర్జేడీ అయితే తమ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కి ఇండియా కూటమి నాయకత్వం ఇవ్వాలని కోరుతుంది. దేశంలో సీనియర్ నేతగా ఉన్న లాలూ అయితేనే ఎండీయే దూకుడుకు అడ్డుకట్ట వేయగలరని అంటున్నారు.

ఇలా నాయకత్వం విషయంలో పట్టుబడుతూ పార్టీలు కొన్ని ఉంటే ఆప్ అయితే పూర్తిగా తప్పుకున్నట్లే అంటున్నారు. ఆ మధ్య జరిగిన మధ్య ప్రదేశ్, హర్యానా ఎన్నికల్లో తమను పట్టించుకోలేదని వామపక్షాలు కూడా ఇండియా కూటమి పట్ల అసహనంగా ఉన్నాయని అంటున్నారు. ఇలా అందులోని కీలక పార్టీలు అన్నీ ఎవరి కారణాలతో వారు టచ్ మీ నాట్ అంటున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి మనుగడ సాగిస్తుందా సాగిస్తే ఎలా అన్న చర్చ మొదలైంది. మొత్తనికి ఎన్డీయే కోరుకున్నట్లుగానే ఆధిపత్య పోరుతో ఇండియా కూటమి ముక్క చెక్కలు అవుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    
  • Bjp 
  • Congressparty 
  • IndianNationalCongress 
  • INC 
  • Incalliance 
  • Telangana 
  • Karnataka 
  • DelhiAssemblyelections 
  • WestbengalCm 
  • Mamatabanerjee 
  • Rahulgandhi 
  • PM 
  • NarendraModi 
  • Samajwadipartychief 
  • Akhileshyadav 
  • RJDleaderLaluprasadyadav 
  • Bihar 
  • AAP 
  • Madhyapradesh 
  • Haryana 

Similar News

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS