వ‌క్ఫ్ బోర్డులో ఇత‌ర మ‌త‌స్థులా?: సుప్రీంకోర్టు నిల‌దీత‌?

'ఆర్టిక‌ల్ 26' ప్ర‌కారం.. దేశంలో మ‌త స్వేచ్ఛ ఉంద‌ని.. అదేస‌మ‌యంలో మ‌త ప‌ర‌మైన ధార్మిక సంస్థ‌ల‌ను నిర్వ‌హించుకునే హ‌క్కు కూడా రాజ్యాంగం క‌ల్పించింద‌న్న ధ‌ర్మాస‌నం.;

Update: 2025-04-16 18:21 GMT

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప‌ట్టుబ‌ట్టి సాధించుకున్న వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ చ‌ట్టం-2025పై సుప్రీంకోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. ఇటీవ‌ల ఈ బిల్లును పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఆమోదించ‌డం.. ఆ వెంట‌నే రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము కూడా ఆమోద ముద్ర వేసిన నేప‌థ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఇది చ‌ట్టంగా మారింది. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తూ.. హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ స‌హా యూపీలోని చిన్న‌పార్టీలు, దేశ‌వ్యాప్తంగా ఉన్న ముస్లింలు కొంద‌రు సుప్రీంకోర్టులో పిటిష‌న్ లు వేశారు. వీటిలో వైసీపీ కూడా పిటిష‌న్ వేసిన‌ట్టు ఆ పార్టీ నాయ‌కులు చెప్పారు.

ఈ మొత్తం పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు తాజాగా బుధ‌వారం క‌లిపి విచారించింది. ఈ సంద‌ర్భంగా వ‌క్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించేలా వర్ఫ్ చట్టంలో కేంద్రం చేసిన సవరణను సుప్రీం కోర్టు ఆక్షేపించింది. 'హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమి స్తారా? అలాంటప్పుడు వర్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకు ఉండాలి?' అని ప్రశ్నించింది. వక్ఫ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి న పిటిషన్లను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించిస్తూ.. ప‌లు ప్ర‌శ్నలు సంధించింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని 'ఆర్టిక‌ల్ 26'నుకూలంక‌షంగా చ‌దివి వినిపించింది.

'ఆర్టిక‌ల్ 26' ప్ర‌కారం.. దేశంలో మ‌త స్వేచ్ఛ ఉంద‌ని.. అదేస‌మ‌యంలో మ‌త ప‌ర‌మైన ధార్మిక సంస్థ‌ల‌ను నిర్వ‌హించుకునే హ‌క్కు కూడా రాజ్యాంగం క‌ల్పించింద‌న్న ధ‌ర్మాస‌నం.. ఒక‌రి మ‌త విష‌యాల్లోకి మరొక‌రు పెత్త‌నం చేయ‌రాద‌ని కూడా.. ఆ ర్టిక‌ల్ 26 స్ప‌ష్టం చేస్తున్న విష‌యాన్ని చ‌ద‌వి వినిపించింది. ఈ నేప‌థ్యంలో వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ చ‌ట్టం ఈ సూత్రాన్ని పాటించిందా? రాజ్యంగ‌ప‌ర‌మైన వెసులుబాటును క‌ల్పించిందా? అని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. వ‌క్ఫ్ బోర్డు విష‌యంలో క‌లెక్ట‌ర్ తీసుకునే నిర్ణ‌యానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం ఎందుక‌ని నిల‌దీసింది.

ఆయా అంశాల‌పై త‌మ‌కు స్ప‌ష్ట త ఇవ్వాల‌ని.. కేంద్రాన్ని ఆదేశించింది. పిటిష‌న‌ర్ల త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది, కేంద్ర మాజీ మంత్రి క‌పిల్ సిబ‌ల్ వాద‌న‌లు వినిపించారు. వ‌క్ఫ్ బోర్డు చ‌ట్టం-25 ద్వారా ముస్లింల వ్య‌వ‌హారాల్లోకి, వారి ఆస్తుల విష‌యంలోకి ఇత‌ర మ‌తాల‌కు చెందిన‌వారిజోక్యం పెరుగుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆర్టిక‌ల్ 26, 26 బి .. ప్ర‌కారం.. మ‌త ప‌ర‌మైన సంస్థ‌ల‌ను నిర్వ‌హించుకునే హ‌క్కు హిందువుల‌కు ఉన్న‌ట్టుగానే ఇత‌ర మ‌తాల‌కు, సంస్థ‌ల‌కు కూడా ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో వ‌క్ఫ్ చ‌ట్టంపై స్టే ఇవ్వాల‌ని ఆదేశించారు. అయితే.. ఈ విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చిన ధ‌ర్మాసనం.. త‌దుప‌రి విచార‌ణ‌లో మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు ఇస్తామ‌ని పేర్కొంది.

Tags:    

Similar News