భోగాపురం ఎఫెక్ట్...విశాఖకు వందే భారత్ రైళ్ళు
విశాఖను ఆర్థిక రాజధానిగా కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఆ విధంగానే అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.;
విశాఖను ఆర్థిక రాజధానిగా కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఆ విధంగానే అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఐటీ పరిశ్రమ విశాఖలోనే విస్తరిస్తోంది. ఇతర పరిశ్రమలు కూడా విశాఖలో ఏర్పాటు అవుతున్నాయి. రానున్న రోజులలో ట్రావెలింగ్ ట్రాఫిక్ హెవీగా పెరిగిపోతుంది. విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరు. ఇపుడు ఫ్యూచర్ ఆఫ్ ఏపీగా మారిపోతోంది. దాంతో మరింత మంది విశాఖకు వస్తారు. జనాభా పెరుగుతుంది. దాంతో విశాఖలో రవాణా సదుపాయాలు కూడా మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
వందే భారత్ రైళ్ళు :
విశాఖ చుట్టూనే ఇపుడు ఏపీ అభివృద్ధి అంతా ఆధారపడిన నేపధ్యంలో మరిన్ని వందే భారత్ రైళ్ళు విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు నడిచేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. విశాఖలో ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టు మరో ఆరు నెలలలో భోగాపురానికి మారుతుందని ఆయన గుర్తు చేస్తున్నారు. దాంతో విజయవాడ తదితర డొమెస్టిక్ టూర్లకు వెళ్ళే వారు భోగాపురం దాకా వెళ్ళి మరీ విమాన ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు. దానికి టైం తో పాటు ఖర్చు కూడా అధికం అవుతుందని చెబుతున్నారు. అందుకే దానిని అరికట్టేందుకు వందేభారత్ వంటి రైళ్ళను ఎక్కువగా నడిపితే తక్కువ దూరం ప్రయాణాలకు అవి ఆల్టర్నేషన్ గా ఉంటాయని ఆయన చెబుతున్నారు.
అదనపు రైళ్ళతో :
ఇదిల ఉంటే విశాఖలో అదనపు రైళ్ళు ప్రవేశపెడితే ప్రయాణీకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. విశాఖ నుంచి విజయవాడ హైదరాబాద్ తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటివి వెళ్ళేందుకు మరిన్ని రైళ్ళు అవసరం అని ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు ఏపీ రాజధానికి వెళ్ళేందుకు విశాఖ టూ విజయవాడ కేంద్రంగా ఎక్కువ రైళ్ల రాకపోకలు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి అయితే విశాఖ నుంచి సికింద్రాబాద్ కి వందేభారత్ రైళ్ళు ఉన్నాయి. వీటి సంఖ్యను మరింతగా పెంచాల్సి ఉందని చెబుతున్నారు.
ప్రజలకు ఆప్షన్ గా :
ఇప్పటిదాకా విజయవాడ వెళ్ళాల్సిన వారు విమానాన్ని ఎంచుకునేవారు అని అయితే అది భోగాపురం వెళ్ళిపోతోంది కాబట్టి స్పీడ్ గా నడిచే వందేభారత్ రైళ్ళను కనుక ఎక్కువ చేసే తక్కువ దూరం అవుతుందని అలాగే వేగంగా గమ్యానికి చేరుకోవచ్చు అని చెబుతున్నారు. అదే భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్ళాలీ అంటే చాలా శ్రమ సమయం ఖర్చు అన్నీ ఉంటాయని ఆయన వివరిస్తున్నారు. ఇక వీలైతే విశాఖ ఎయిర్ పోర్టుని అలాగే కొనసాగించాలని కూడా ఆయన కోరుతున్నారు. మరి ఆయన చేస్తున్న ఈ వినతిని కేంద్రం ఏ విధంగా పరిగణించి ప్రతిస్పందిస్తుందో చూడాల్సి ఉందని అంటున్నారు.