విశాఖ కనెక్ట్ టూ వరల్డ్ : సాగర తీరాన గూగుల్ రాగాలు
ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని గూగుల్ సంస్థ స్పష్టం చేస్తోంది.;
విశాఖ ఇక మీదట విశ్వ నగరంగా అవతరించబోతోంది. విశాఖ కనెక్ట్ టూ వరల్డ్ అన్నది ఈ రోజు నుంచి వినిపిస్తోంది. . దేశంలోనే అతి పెద్ద పెట్టుబడి ఇంకా చెప్పాలంటే అమెరికా తర్వాత ప్రపంచం బయట గూగుల్ పెడుతున్న అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారత్ రావడం, అందునా ఏపీకి ఆ చాన్స్ దక్కడం, విశాఖ ఆ లక్కీ సిటీ కావడం అంటే నిజంగా గ్రేటెస్ట్ అచీవ్ మెంట్ గానే చూడాలి. విశాఖ ఇన్నాళ్ళూ సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గడించింది. ఇపుడు విశాఖ కేరాఫ్ ఏఐగా మారబోతోంది.
థాంక్స్ టూ చంద్రబాబు :
ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో సాధించారు అని చెప్పాలి. దేశ ప్రధానిగా డైనమిక్ లీడర్ షిప్ తో నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం అత్యంత కీలకంగా ఉంది. ఏపీకి ఏమి తెస్తున్నారు అన్న వారికి జవాబు ఇది అని కూడా చెప్పాల్సి ఉంది. అదే సమయంలో దేశంలో ఎన్నో మహా నగరాలు ఉండగా పోటీని తట్టుకుని మరీ ఏపీకీ అందునా విశాఖకు ఈ భారీ ప్రాజెక్ట్ ని తెచ్చిన విజనరీ సీఎం చంద్రబాబుని మనస్పూర్తిగా ప్రశంసించాలి. ఇక దీంతో ఇప్పటిదాకా విశాఖ హిస్టరీ ఒకలా ఇక ముందు మరోలా అన్నది వాస్తవం.
వైజాగ్ దశ తిరిగింది :
విశాఖ సాగర తీరాన గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రానున్న ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని గూగుల్ నిర్ణయించింది. ఇది చాలా పెద్ద పెట్టుబడి, ఒక రికార్డు స్థాయి పెట్టుబడిగా చెప్పాల్సి ఉంది. అంతే కాదు దీని వల్ల ఏపీ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలు సైతం మారిపోతాయి. ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఏపీ వ్యాప్తంగా విస్తరిస్తాయి. విశాఖ ఐటే హబ్ కాదు ఏఐకి కేరాఫ్ గా మారి ప్రపంచాన్ని విశాఖ వైపుగా చూసేలా చేస్తుంది అన్నది ఐటీ నిపుణుల మాట.
స్పీడ్ డెసిషన్స్ కి చాన్స్ :
ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో రియల్ టైమ్ డేటా, హిస్టారికల్ డేటాల సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. అంతే కాదు, ఏపీ రాష్ట్ర రూపురేఖలను మార్చే ఓ చరిత్రాత్మక ఒప్పందంగా దీనిని పేర్కొనాలి. ప్రపమంలోనే ఒక టెక్నాలజీ దిగ్గజంగా గూగుల్ ఉంది. అలాంటి గూగుల్ విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంతో విశాఖ ఇపుడు ప్రపంచం తో డైరెక్ట్ గా కనెక్ట్ కాబోతోంది.
అద్భుతమే జరిగింది :
విశాఖలో వన్ గిగావాట్ సామర్థ్యంతో ఏఐ హబ్‌ను గూగుల్ సంస్థ ప్రారంభిస్తోంది. ఇంతే కాదు ఈ గిగావాట్ ని కూడా భవిష్యత్తులో దాని సామర్థ్యాన్ని మరింత పెంచుతామని గూగుల్ సంస్థ హామీ ఇస్తోంది. ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని గూగుల్ సంస్థ స్పష్టం చేస్తోంది. ఇక ఏఐ హబ్ కోసం ప్రత్యేకంగా సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నారు. ఇక ఈ కేంద్రంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను వినియోగిస్తారు. దీంతో ఏఐ ప్రాసెసింగ్‌కు రెట్టింపు వేగాన్ని అందిస్తాయి. విశాఖలో ఏఐ హబ్ తో గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీమెయిల్ వంటి ఎన్నో సేవలను ఇకపై భారత్ నుంచే ప్రపంచానికి అందించే అవకాశం అందరూ అందుకోబోతున్నారు
శిక్షణతో పాటు ఉపాధి "
ఈ ఏఐ హబ్ ద్వారా కేవలం ఆధునాతన సాంకేతికతను అందించడమే కాదు, స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయి ఏఐ స్థాయిలో నిపుణులుగా వారిని తీర్చిదిద్దుతారు. ఇది ఒక విధంగా విశాఖ వాసులకే కాదు, యావత్తు ఆంధ్రులకే అద్భుతమైన అవకాశంగా భావించాలి.
ఫిబ్రవరిలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్సు
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఫిబ్రవరి నెలలో గ్లోబల్ ఏఐ సదస్సుని నిర్వహించే విషయమై ఆలోచిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీ అందిపుచ్చుకోవటంలో భారత్ ప్రత్యేకమని ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇక ప్రతీ కుటుంబానికి ఏఐని దగ్గర చేసేలా ప్రయత్నిస్తామని రానున్న రోజులలో విశాఖ నుంచే సాంకేతిక విప్లవం మొదలవుతుందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మొత్తానికి విశాఖ ఇపుడు గెలిచింది. గూగుల్ తో సాగర తీరం ప్రగతి రాగాలను ఆలపిస్తోంది.