విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం

మరో వైపు చూస్తే కనుక ఈ మూడో బ్లాస్ట్ ఫర్నేస్‍తో రోజుకు 20 వేల టన్నులకు పైగా స్టీల్ ఉత్పత్తి జరుగుతుందని తెలుస్తోంది.;

Update: 2025-06-27 10:30 GMT

విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్వవైభవం వస్తుందా అంటే డౌట్ ఎందుకు అంటున్నారు టీడీపీ కూటమి పెద్దలు. నిన్నటికి నిన్నే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభలో మాట్లాడుతూ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా నిలబెట్టామని చెప్పారు. అది కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే సాధ్యపడింది అని అన్నారు.

ఇపుడు చూస్తే పరిణామాలు అలాగే ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3 తిరిగి ప్రారంభం అవుతోంది. ఇక చూస్తే ఇప్పటికే రెండు బ్లాస్ట్ పర్నేస్‍లు పూర్తి ఆపరేషన్‍లో కొనసాగుతున్నాయి. ఇపుడు మూడవ బ్లాస్ట్ ఫర్నేస్‍ ప్రారంభం అయితే కనుక పూర్తి సామర్థ్యానికి స్టీల్ ప్లాంటు సిద్ధమవుతుందని అధికారులు వెల్లడించారు.

మరో వైపు చూస్తే కనుక ఈ మూడో బ్లాస్ట్ ఫర్నేస్‍తో రోజుకు 20 వేల టన్నులకు పైగా స్టీల్ ఉత్పత్తి జరుగుతుందని తెలుస్తోంది. జూలై 9 నుంచి ఈ ఉత్పత్తి మొదలు అవుతుంది. కొద్ది నెలల క్రితం విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం 11 వేల 440 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. ఆనాడే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ ని తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.

దానిని తగినట్లుగానే ఇపుడు అంతా జరుగుతోంది. దాంతో ఒక్కసారిగా విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి పెరగడమేకాకుండా దీంతో పాటుగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలుకూడా మెరుగుపడతాయని స్టీల్ ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్ లు పనిచేయడం మొదలైతే కనుక ప్లాంట్ పక్కాగా లైన్ లోకి వచ్చినట్లే అని అంటున్నారు. మరో వైపు చూస్తే కాంట్రాక్ట్ కార్మికులను అయిదు వేల మంది దాకా తొలగించారని వారిని తిరిగి తీసుకోవాలని కోరుతున్నారు.

అయితే ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే తప్పకుండా తీసుకుంటామని ఉక్కు యాజమాన్యం చెబుతోది. దాంతో ఇపుడు మళ్ళీ చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఈ విశాఖ ఉక్కుకి ప్రపంచ స్థాయిలోనే నాణ్యతా ప్రమాణాల విషయంలో మంచి పేరు ఉంది.

దాంతో ఉత్పత్తి ఎంత పెరిగితే అంత మార్కెట్ ఉంటుంది. దాంతో విశాఖ ఉక్కు లాభాల బాటన పట్టేందుకు సైతం అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇక విశాఖ ఉక్కులో అవసరమైనంత మేరకే సిబ్బందిని కానీ కార్మికులను కానీ తీసుకొవడంతో పాటు మరో వైపు వారితోనే ఉత్పత్తి పెంచడం ద్వారా లాభాలను గడించాలని ప్లాంట్ పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉంది. అనవసర ఖర్చులను అదుపు చేయడంతో పాటు అనుత్పాదక వ్యయాన్ని నియంత్రించడం ద్వారానే ప్లాంట్ కి మంచి మనుగడ ఉంటుందని అంటున్నారు. ఆ దిశగా ఇపుడు వేగంగా అడుగులు పడుతున్నాయి.

Tags:    

Similar News