పటీదార్ చేసిన తప్పు.. యువకుడికి విరాట్ , ఏబీ నుంచి కాల్స్
క్రికెట్ పట్ల భారతీయుల అభిమానాన్ని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. స్టేడియాల్లో తమ ఫేవరెట్ ప్లేయర్స్‌కు జోష్ ఇచ్చే క్రికెట్ ఫ్యాన్స్, సెల్ఫీ కోసం పరుగులు తీస్తారు.;
క్రికెట్ పట్ల భారతీయుల అభిమానాన్ని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. స్టేడియాల్లో తమ ఫేవరెట్ ప్లేయర్స్‌కు జోష్ ఇచ్చే క్రికెట్ ఫ్యాన్స్, సెల్ఫీ కోసం పరుగులు తీస్తారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన యువకుడు మాత్రం ఏ ప్రయత్నం చేయకుండానే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ క్రికెటర్ల నుంచి నేరుగా ఫోన్ కాల్స్ అందుకున్నాడు.
గరియాబంద్ జిల్లా దేవ్‌భోగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మడగావ్‌కు చెందిన 21 ఏళ్ల మనీష్ బీసీ జూన్ 28న కొత్త జియో సిమ్ కొనుగోలు చేశాడు. అతనికి కేటాయించిన నంబర్.. గతంలో భారత క్రికెటర్ రజత్ పాటిదార్ పేరుతో రిజిస్టర్ అయి ఉండేది. ఆ సిమ్ 90 రోజులకు పైగా వాడకంలో లేకపోవడంతో టెలికాం కంపెనీ దానిని తిరిగి యాక్టివ్ చేసి మనీష్‌కు ఇచ్చింది.
సిమ్ యాక్టివేట్ చేసిన వెంటనే వాట్సాప్‌లో రజత్ పాటిదార్ డిస్‌ప్లే పిక్చర్ కనిపించింది. మొదట్లో ఇది ఏదో టెక్నికల్ లోపమని భావించిన మనీష్, కొన్ని రోజుల తర్వాత తెలియని నంబర్ల నుంచి వరుసగా కాల్స్ రావడంతో ఆశ్చర్యపోయాడు. వాటిలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ క్రికెటర్ల కాల్స్ ఉండటం అతనికి నమ్మశక్యంగా అనిపించలేదు.
జూలై 15న వచ్చిన ఒక కాల్‌లో తనే రజత్ పాటిదార్ అని చెప్పిన వ్యక్తి, సిమ్‌ను తిరిగి ఇవ్వమని మనీష్‌ను కోరాడు. మొదట ఇది కూడా సరదా కాల్ అని అనుకున్న మనీష్, కొంతసేపటికి పోలీసులు ఇంటికి చేరుకున్నప్పుడు విషయం సీరియస్‌గా మారింది. ఎంపీ సైబర్ సెల్ , గరియాబంద్ పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ నంబర్ తిరిగి రజత్ పాటిదార్‌కు కేటాయించబడింది.
ఒక సాదాసీదా సిమ్ కార్డ్ మార్పు ఇలా అంతర్జాతీయ క్రికెట్ తారలతో నేరుగా కనెక్ట్ అవుతుందని ఊహించనివ్వకపోవడం నిజంగా వినూత్న సంఘటనగా మారింది.