• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  షాకింగ్: కాంబ్లీ భార్య...

షాకింగ్: కాంబ్లీ భార్య విడాకుల ప్లాన్స్‌!

| ఇటీవలి ఇంటర్వ్యూలో ఆండ్రియా మాట్లాడుతూ.. కాంబ్లీ మద్యపాన వ్యసనం త‌మ బాంధ‌వ్యంలో చిచ్చు పెట్టింద‌ని అన్నారు.

By - Tupaki Desk
Update: 2025-01-27 17:01 GMT

క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ స‌మ‌కాలికుడు, టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వినోద్ కాంబ్లీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అత‌డి వృత్తిగ‌త‌, వ్య‌క్తిగ‌త జీవితం ఆశించిన విధంగా సాగ‌లేదు. వ్య‌క్తిగ‌తంగా చూస్తే, మొద‌టి భార్య‌కు విడాకులిచ్చిన కాంబ్లీ రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌రాక్ష‌న్ లో రెండో భార్య ఆండ్రియా హెవిట్ ఒక షాకింగ్ విష‌యం చెప్పింది.

భ‌ర్త అల‌వాట్ల‌తో స‌రిప‌డ‌క‌ 2023లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని, కానీ అత‌డి నిస్సహాయ స్థితి చూసాక నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాన‌ని వెల్లడించింది. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆండ్రియా మాట్లాడుతూ.. కాంబ్లీ మద్యపాన వ్యసనం త‌మ బాంధ‌వ్యంలో చిచ్చు పెట్టింద‌ని అన్నారు. ఆండ్రియా- కాంబ్లీ జంట 2006లో సివిల్ కోర్టులో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. అయితే ఆండ్రియా అత‌డి తాగుడు అల‌వాటు గురించి క‌ల‌త చెందాన‌ని తెలిపారు. ఇటీవల లేటు వ‌య‌సులో కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి చాలా మంది అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అతడు డిసెంబర్ 21న మూత్ర సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొని ఆస్ప‌త్రిలో చేరారు.

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సూర్యాన్షి పాండేతో పాడ్‌కాస్ట్ లో కాంబ్లీ రెండో భార్య త‌న క‌ఠిన నిర్ణ‌యం గురించి బ‌య‌ట‌పెట్టారు. ఆమె మాట్లాడుతూ.. ``నేను వదిలేస్తే అతడు నిస్సహాయుడ‌వుతాడు. అత‌డు చిన్నపిల్లాడిలా ఉంటాడు.. అది నన్ను బాధపెడుతుంది. ఆందోళనకు గురి చేస్తుంది. నేను ఒక స్నేహితుడిని కూడా వదిలి వెళ్ళలేను.. కానీ అతడు అంతకంటే ఎక్కువ. నేను దూరంగా వెళ్లాల్సిన‌ క్షణాలు ఉన్నాయని నాకు గుర్తుంది. కానీ అత‌డి గురించి ఆందోళన చెందుతాను. అతడు తిన్నాడా లేదా? మంచం మీద సరిగ్గా ఉన్నాడా లేదా? అతడు బాగున్నాడా? అంటూ వెతుకుతాను. అత‌డికి నేను అవసరమని అర్థం చేసుకున్నాను. అందుకే నిర్ణ‌యం మార్చుకున్నాను`` అని చెప్పారు.

కాంబ్లి వ‌య‌సు సంబంధిత స‌మ‌స్య‌లు, అనారోగ్యాలతో బాధపడుతున్నాడు. అతడు ఆసుపత్రిలో చేరాడు. అత‌డి మెదడులో గడ్డ ఉన్న‌ట్టు నిర్ధారణ అయింది. అయితే కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. ఇటీవల వినోద్ కాంబ్లి ముంబై- వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఆదివారం నాడు వేడుక కోసం స్టేడియంలోకి నడవడానికి భార్య ఆండ్రియా హెవిట్ అతడికి సహాయం చేసింది. కొన్ని రోజుల క్రితం ఓ సన్మాన కార్యక్రమానికి కూడా అత‌డు హాజరయ్యారు. అక్కడ ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) చాలా మంది మాజీ క్రికెటర్లకు అవార్డులు ప్రదానం చేసింది.

Tags:    
  • VinodKambli 
  • AndreaHewitt 
  • CricketLegends 
  • IndianCricket 
  • SachinTendulkar 
  • CricketerLife 
  • DivorceStory 
  • HealthIssues 
  • MumbaiCricket 
  • FormerCricketers 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS