• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజ్ భవన్ లోకి డైరెక్ట్...

రాజ్ భవన్ లోకి డైరెక్ట్ గా విజయసాయి ?

| ఆయనే నిన్నటిదాకా వైసీపీలో నంబర్ టు గా వ్యవహరించిన మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి.

By - Tupaki Desk
Update: 2025-01-29 19:30 GMT

ఆడిటర్ నుంచి ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేసే కీలక నేతగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. పైగా వ్యూహకర్తగా కూడా ఆయనకు పేరుంది. ఆయనే నిన్నటిదాకా వైసీపీలో నంబర్ టు గా వ్యవహరించిన మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి. ఆయన స్వతహాగా ఆడిటర్. రాజకీయ లెక్కలు కూడా ఆయనకు బాగా తెలుసు అని అంటారు. ఆయన వేసిన ఏ లెక్కా తప్పు కాదని పక్కాగా ఉంటుందని కూడా చెబుతారు.

అటువంటి విజయసాయిరెడ్డి సడెన్ గా తన పదవులకు రాజీనమా చేసి రాజకీయాలకు టాటా గుడ్ బై అనేశారు. నిజానికి రాజకీయాల్లో ఉన్న వారు ఎవరూ అంత సులువుగా బయటకు రాలేరు. అటువంటి రంగం అది. అక్కడ ప్రవేశమే తప్ప నిష్క్రమణకు దారులు ఎవరికీ దొరకవు అని అంటారు. అలాంటిది నిన్నటిదాకా ఢిల్లీలో ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి నాకొద్దీ రాజకీయం అని అనగలరా అన్న దగ్గరే అందరికీ అనుమానాలు వస్తున్నాయి.

అగ్రికల్చర్ ఈజ్ మై కల్చర్ అని విజయసాయిరెడ్డి ఎంత గొప్పగా చెప్పుకున్నా పొలిటికల్ కల్చర్ లో అది సెట్ అవదని అంటున్నారు. ఇక రాజకీయ సేద్యం చేసిన వారు మళ్ళీ ఆ వైపే చూస్తారు అని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే విజయసాయిరెడ్డిది కేవలం తాత్కాలిక నిష్క్రమణ మాత్రమే తప్ప పూర్తి స్థాయిలో కానే కాదు అని చాలా మంది అంటున్నారు.

ఆయన బీజేపీలో చేరుతారు మళ్ళీ రాజకీయంగా లైమ్ లైట్ లోకి వస్తారు అని ఊహిస్తున్న వారూ ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి అవుతారని చెబుతున్న వారూ ఉన్నారు. అయితే ఈ ప్రచారం ఒక వైపు సాగుతూండగానే దీనికి ధీటుగా మరో ప్రచారం కూడా సాగుతోంది. అదేంటి అంటే విజయసాయిరెడ్డికి రాజ్ భవన్ దారులు తెరచుకోబోతున్నాయని. దీని అర్థం ఆయన గవర్నర్ గా మళ్ళీ తెర ముందుకు రాబోతున్నారని అంటున్నారు.

అందుకే ఆయన రాజకీయాలకు రాం రాం పాడేశారు అని అంటున్నారు. గవర్నర్ పదవిలోకి వెళ్ళడం అంటే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే. అలా బీజేపీ నుంచి ఆయనకు ఒక స్పష్టమైన హామీ లభించింది అని అంటున్నారు. లేకపోతే మూడున్నరేళ్ళ పాటు ఉన్న పెద్దల సభలో కీలకమైన పదవిని ఆయన ఎందుకు వదులుకుంటారు అని అంటున్నారు.

ఇక బీజేపీకి ఆయన సరైన సమయంలో రాజకీయ లాభం చేసి పెట్టడం కోసమే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు అని అంటున్నారు. విజయసాయిరెడ్డి వదిలేసిన రాజ్యసభ సీటులోకి ఒక ప్రముఖుడిని తమ పార్టీ తరఫున బీజేపీ తెచ్చుకుంటుందని ప్రచారం సాగుతోంది. ఇక రాజ్యసభలో బీజేపీ నంబర్ పెరుగుతుంది. అలా బీజేపీకి విజయసాయిరెడ్డి మహోపకారం చేశారు అని అంటున్నారు. బీజేపీ వారి కోసమే ఆయన సీటు త్యాగం చేశారు అని అంటున్నారు.

బీజేపీకే ఈ సీటు అని కన్ఫర్మ్ చేసుకున్న మీదటనే ఆయన రాజీనామా ఇచ్చారని అంటున్నారు. ఇక ఆయన తన పదవికి రాజీనామా చేసిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడం వల్ల కూటమికే లాభం అన్నారు. తాను వదిలేసిన సీటు కూటమికే పోతుందని ఆయన చెప్పారు. మరి అన్నీ తెలిసి ఆయన సీటు వదులుకున్నారు అంటే ఆయనకు గవర్నర్ వంటి అతి ముఖ్య పదవిని బీజేపీ ఆఫర్ చేసిందని ప్రచారం సాగుతోంది.

అయితే అది ఇపుడే కాకపోవచ్చు అని కొన్నాళ్ళ తరువాత ఆయనకు ఈ చాన్స్ ఇస్తారని ఇది పక్కాగా జరిగి తీరుతుందని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డికి ఈ గవర్నర్ పదవి దక్కితే మాత్రం ఒక ఆడిటర్ గా జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్ళిన నేతగా ఒక రికార్డు క్రియేట్ చేసిన వారు అవుతారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో.

Tags:    
  • VijaysaiReddy 
  • RajyaSabha 
  • Resignation 
  • Politicalfuture 
  • Bjp 
  • Governor 
  • Speculation 
  • Agriculture 
  • Politicalcareer 
  • AndhraPradesh 
  • Keyleader 
  • Politicalexit 
  • BjpSpeculation 
  • Politicalleader 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS