సీఏఏ అమలుపై హీరో విజయ్ ఎందుకు అసహనం వ్యక్తం చేశారు?

దేశ ప్రజలకు సమాన న్యాయం అందించాల్సిన ప్రభుత్వం పక్షపాత ధోరణితో నిర్ణయాలు తీసుకోవడం సబబుకాదని హితవు పలికారు.

Update: 2024-03-12 07:58 GMT

కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ (సిటిజన్ షిప్ అమండ్ మెంట్ ఆక్ట్ ) అమలుకు ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ తమిళ నటుడు, తమిళగవెట్రి కళగం అధినేత విజయ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. దేశ ప్రజలకు సమాన న్యాయం అందించాల్సిన ప్రభుత్వం పక్షపాత ధోరణితో నిర్ణయాలు తీసుకోవడం సబబుకాదని హితవు పలికారు.

తమిళనాడులో ఇప్పుడే రాజకీయ ఓనమాలు దిద్దుకునే విజయ్ తన ప్రభావం చూపాలనే ఉద్దేశంతో తొందరపాటుగా రాలేదు. రాజకీయాలను అర్థం చేసుకుని అన్ని కుదిరాకే అరంగేట్రం చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే రాజకీయాలను ఔపోసన పట్టి తరువాత తన ప్రభావం చూపించాలని అనుకుంటున్నాడు. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇప్పటికే కేరళ సీఎం విజయన్ సీఏఏ అమలు చేయమని ప్రకటించడంతో విజయ్ స్వరం కూడా తోడు కావడంతో కేంద్రానికి మొట్టికాయలు వేయడం ఖాయమే అంటున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం సీఏఏ అమలుపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో బీజేపీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం ఆమోదయోగ్యం కాదనే వాదనలు వస్తున్నాయి.

విజయ్ సీఏఏ చట్టంపై స్పందించడంతో ఆయనకు మద్దతుగా చాలా మంది నిలుస్తున్నారు. ఇంకా పలు రాష్ట్రాల్లో సీఏఏ అమలుకు మొగ్గు చూపడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ తీసుకొచ్చిన చట్టం అబాసుపాలు కావడం తప్పనిసరని తెలుస్తోంది. ఇలాంటి ప్రజాకంటక నిర్ణయాలు తీసుకోవడం బీజేపీకి సముచితం కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి.

సీఏఏ చట్టం అమలు బాధ్యతను రాష్ట్రాలకు బదలాయించినా అవి ముందుకు రావడం లేదు. రాజకీయ పార్టీలు బీజేపీ చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో సీఏఏ అమలును వ్యతిరేకించడంతో బీజేపీ పునరాలోచనలో పడుతుందా? లేక ముందుకెళ్తుందా? అనేది చూడాలి. ఈ క్రమంలో సీఏఏ ఉన్నపళంగా అమలు చేయడానికి ఎందుకు అంత తొందరగా నిర్ణయం తీసుకుందనే ప్రశ్నలు వస్తున్నాయి.

Tags:    

Similar News