విజయవాడని టెన్షన్ పెడుతున్న అంచనా

విజయవాడ అంటే ఎండలు మండించే నగరం అంటారు. వేసవి కాలంలో విజయవాడ మండిపోతుంది.;

Update: 2025-10-28 03:38 GMT

విజయవాడ అంటే ఎండలు మండించే నగరం అంటారు. వేసవి కాలంలో విజయవాడ మండిపోతుంది. మిగిలిన కాలాలలో సైతం పగటి ఉష్ణోగ్రతలు ఒక మాదిరిగా ఉంటాయి. విజయవాడ వాణిజ్య నగరం. అన్నీ అక్కడ కొలువు తీరి ఉంటాయి. దాంతో జనాభా ఒత్తిడితో హెవీ ట్రాఫిక్ తో సతమతమవుతూ ఉంటుంది. ఇక విజయవాడ రాజకీయంగా రాజధాని నగరం. ఆ నగరం మీద ఈ మధ్య ఫోకస్ ఎక్కువ అయింది. దాంతో పాటుగా అభివృద్ధి మరింతగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి కూడా అపుడపుడు ఇబ్బంది పెడుతూ వస్తోంది. గత ఏడాది అతి భారీ వర్షాలు ఫ్లాష్ ఫ్లడ్స్ తో విజయవాడ ఎంతటి పెను విపత్తుని ఎదుర్కొందో అంతా చూశారు.

వరుణుడు ముంచెత్తుతాడా :

తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ఒకటి విజయవాడను టెన్షన్ లో పెడుతోంది. అదేంటి అంటే మొంథా' తుపాను ప్రభావంతో విజయవాడ నగరానికి అతి భారీ వర్ష సూచన ఉందని వెదర్ రిపోర్ట్ ఇచ్చింది మెంధా తుఫాను అతి తీవ్ర తుఫానుగా కోస్తా జిల్లాల మీద దూసుకుని వచ్చే మంగళవారం వేళ విజయవాడ నగరంలో ఎకంగా 16 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగంతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ పెను ముప్పుని ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

ప్రజలు బయటకు రావద్దు :

వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో అధికారులు ప్రజలకు కీలక జాగ్రత్తలు చెబుతూ కొన్ని సూచనలు చేశారు. మెంధా తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్యంత భారీ వర్షాలు కురుస్తయాని వెదర్ రిపోర్టు ఉన్న నేపధ్యంలో నంగరంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని సూచించారు వివిధ రకాలైన దుకాణాలతో పాటు వాణిజ్య సముదాయాలను పూర్తి స్థాయిలో మంగళవారం అంతా మూసివేయాలని అధికారులు స్పష్టంగా సూచించారు. అయితే కేవలం నిత్యావసరాలు అయిన పాలు, కూరగాయలు, మెడికల్ షాపుల వంటి వాటికి మాత్రమే మినహాయింపు ఉంటుందని అధికారులు అంటునారు

అక్కడే ఫోకస్ :

అత్యంత భారీ వర్షాలు ఏకంగా పదహారు సెంటీమీటర్ల వర్ష పాతం అంటూంటే లోతట్టు ప్రాంతాల మీద అధికారులు ఫుల్ ఫోకస్ పెడుతున్నారు చేశారు. ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పదే పదే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే విధంగా కీలక సమయంలో ఇబ్బందులు ఉంటే కనుక ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు మరో వైపు చూస్తే ముందస్తు చర్యలలో భాగంగా విజయవాడ కార్పోరేషన్ పరిధిలోని 64 డివిజన్లలో మొత్తం 34 పునరావాస కేంద్రాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. అక్కడికి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద వరుణుడు నిలువునా తలవంచి ఆకాశ గంగనే కురిపిస్తాడు అని అంటూంటే విజయవాడ అప్రమత్తం అయింది. గత అనుభవాలతో ఈసారి పూర్తి సమర్ధంగా చర్యలకు అంతా రెడీ అయ్యారు.

Tags:    

Similar News