హీరో కొత్త రాజకీయ పార్టీ... ఆయనకి అంత సీన్ లేదు!
తమిళ రాజకీయాల్లో సినిమా ఇండస్ట్రీ ప్రభావం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ ప్రముఖులు ఎంతో మంది ఇండస్ట్రీ నుంచి వెళ్లిన వారే.
తమిళ రాజకీయాల్లో సినిమా ఇండస్ట్రీ ప్రభావం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ ప్రముఖులు ఎంతో మంది ఇండస్ట్రీ నుంచి వెళ్లిన వారే. సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత పార్టీ అధినేతలుగా, ముఖ్యమంత్రులుగా పని చేసిన ఘనత దక్కించుకున్నారు. ఆ జాబితాలో కొత్తగా సూపర్ స్టార్ విజయ్ చేరిన విషయం తెల్సిందే. సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో అడుగు పెట్టిన విజయ్ చాలా తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చాడు. మిత్రపక్షాల సహకారంతో ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తర్వాత మరింత మంది సినీ స్టార్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు సినీ సెలబ్రిటీలు విజయ్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటే, మరికొందరు ఇతర పార్టీల్లో జాయిన్ కాబోతున్నారు. కొద్ది మంది మాత్రం విజయ్ మాదిరిగా సొంత పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారట.
ధనుష్ పొలిటికల్ పార్టీ పేరు...
సొంత పార్టీ ఆలోచన చేస్తున్న వారిలో ధనుష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ధనుష్ చక్రం తిప్పాలని చాలా కాలంగా కోరుకుంటున్నాడట. గతంలో రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేస్తే ధనుష్ వెనుక ఉండి చక్రం తిప్పాలని భావించాడు. కానీ రజనీకాంత్ పార్టీ పెట్టలేదు, ఆ తర్వాత ధనుష్ పొలిటికల్ ఎంట్రీ గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవడం మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాలతో ధనుష్ ప్రజల్లో ఉన్నాడు. అందుకే పార్టీ పెట్టడం వల్ల జనాల్లోకి మరింతగా వెళ్లే అవకాశం ఉంటుందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారట, అందుకే ధనుష్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయ్ పొలిటికల్ జర్నీ తరహాలోనే ధనుష్ సైతం తన పొలిటికల్ జర్నీని ప్లాన్ చేస్తున్నట్లు తమిళనాట మీడియాలో కథనాలు వస్తున్నాయి.
2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు..
తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో విజయ్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్లీ 2031లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు ధనుష్ పార్టీని తీసుకు రావాలని భావిస్తున్నాడట. కొన్ని తమిళ మీడియాల కథనం ప్రకారం ఇప్పటికే ధనుష్ తన పార్టీని 'తమిళగా ఎళుచి కజగం' అనే పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రర్ చేయించాడని అంటున్నారు. ధనుష్ 2031 ఎన్నికలు టార్గెట్‌గా మరో ఏడాదిలో పొలిటికల్ రంగంలోకి దిగడం ఖాయం అని ఆయన అభిమానులు చెబుతున్నారు. ధనుష్ అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలపై, వారు చేస్తున్న ప్రచారంపై ముఖ్యమంత్రి విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు. ధనుష్ కొత్త పార్టీ అంటూ వస్తున్న వార్తలను సింపుల్‌గా కొట్టి పారేస్తూ, ఆయనకి అంత సీన్ లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
విజయ్ వర్సెస్ ధనుష్..
ఇప్పటి వరకు ధనుష్ ఎక్కడ కూడా రాజకీయ అరంగేట్రం గురించి మాట్లాడిందే లేదు. ఒక్కసారి కూడా పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా ధనుష్ మాట్లాడలేదు. అయితే ఆయన కొన్ని సార్లు జనాల గురించి మాట్లాడటం వల్ల రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందనే పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. సాధారణంగానే ధనుష్ పై విజయ్ అభిమానులు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ, ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజకీయ అరంగేట్రం, 2031 ఎన్నికలు టార్గెట్ అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ధనుష్ పై విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. ధనుష్ కి రాజకీయంగా ఎదిగేంత సత్తా లేదంటూ విజయ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ధనుష్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు, అయినా కూడా విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆయనకు అంత సీన్ లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక వేళ నిజంగానే ధనుష్ పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేస్తే విజయ్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో సోషల్ మీడియాలో ధనుష్ ను విమర్శిస్తారో మరి.