అమెరికా, ఇరాన్ మధ్యలో సౌదీ !
అమెరికా - ఇరాన్ యుద్ధానికి ముందు సౌదీ అరేబియాలో 2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో హౌతీలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
అమెరికా - ఇరాన్ యుద్ధానికి ముందు సౌదీ అరేబియాలో 2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో హౌతీలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అక్కడ గత నాలుగేళ్లుగా శాంతి నెలకొంది. రియాద్, మక్కా, జెడ్డా వంటి నగరాల్లో సాధారణ జీవితం కొనసాగుతోంది. టూరిజం, ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. విజన్ 2030 కింద ఆర్థిక వైవిధ్యీకరణ, పర్యాటకం, విదేశీ పెట్టుబడులు, మహిళలకు డ్రైవింగ్ వంటి సామాజిక సంస్కరణలు ముందుకు సాగాయి.
రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో అంతర్గత భద్రత కఠినంగా కొనసాగింది. బయట నుండి ముప్పు తక్కువగా ఉండేది. సౌదీ అధికారులు హౌతీలతో చర్చలు సాగించి యెమెన్ నుంచి బయటకు రావాలని ప్రయత్నించారు. అయితే గాజా యుద్ధం కారణంగా ఆగిపోయింది.
అయితే ప్రస్తుతం పరిస్థితులు తీవ్రంగా క్షీణించాయి. హౌతీలు తరచుగా దాడులు చేస్తున్నారు. రియాద్ కింగ్ ఖాలిద్ విమానాశ్రయం, అభా విమానాశ్రయం, జాజాన్, నజ్రాన్, ఖమీస్ ముషైత్ వంటి దక్షిణ నగరాలు దాడులకు గురవుతున్నాయి. సౌదీ యెమెన్ లో కౌంటర్ ఎఫెన్సివ్ ప్రారంభించింది. దీంతో హౌతీలు సౌదీ లోపలి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.
కింగ్ ఖాలిద్ విమానాశ్రయం, అభా విమానాశ్రయం మీద దాడుల్లో ముగ్గురు మరణించగా, 36 మంది సూడానీ, ఈజిప్షియన్, అల్జీరియాను పౌరులు గాయపడ్డారు. విమానాలు దెబ్బతిన్నాయి. దక్షిణ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 73 మంది పౌరులు గాయపడ్డారు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద దాడుల్లో అమెరికా విమానాలు దెబ్బతిన్నాయి. 45 ఎమ్ క్యూ రీపర్స్ సహా 81 విమానాలు , డ్రోన్లు దెబ్బతిన్నాయి. దాదాపు 20 మంది అమెరికా సైనికులు మరణించారు. 3.3 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.
యూఏఈలో 43 లక్షల మంది, సౌదీలో 27 లక్షల మంది, మొత్తం గల్ఫ్ సహకార మండలి (GCC)లోని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో కోటిమంది భారతీయులు ఉన్నారు. భారత రాయబార కార్యాలయం భారతీయులకు ‘అప్రమత్తంగా ఉండండి. అవసరమైతే ఇంట్లోనే ఉండండి. స్థానిక అధికారుల సూచనలు పాటించండి. వీడియోలు, న్యూస్ లు షేర్ చేయవద్దు’ అని చెబుతున్నారు. దుబాయ్ లో పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పటికీ సౌదీలో భద్రత సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి.