విజయ్ ఎమ్మెల్యేలు అంటే...ఇది కదా అసలైన మార్పు
మార్పు తెస్తామని చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టారు, కానీ ఆచరణలో మాత్రం కులం ప్రాంతం ధన బలం పలుకుబడి పరిచయాలు స్నేహాలు ఇలా ఈ అడ్డు గోడలను దాటలేకపోయారు.;
మార్పు తెస్తామని చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టారు, కానీ ఆచరణలో మాత్రం కులం ప్రాంతం ధన బలం పలుకుబడి పరిచయాలు స్నేహాలు ఇలా ఈ అడ్డు గోడలను దాటలేకపోయారు. పక్కా ట్రెడిషనల్ పాలిటిక్స్ నే అంతా చేస్తూ వచ్చారు. ఏ నియోజకవర్గంలో ఎంత మంది ఏ సామాజిక వర్గం వారు ఉన్నారో చూసి మరీ అదే సామాజిక వర్గానికి చెందిన వారికి సీటు ఇవ్వడమే ఇప్పటిదాకా దేశంలోని రాజకీయ పార్టీలు అన్నీ చేస్తూ వచ్చాయి. కానీ తన కులమేంటో ఎవరికీ చెప్పని విజయ్ తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టారు. మత విశ్వాసాలు వ్యక్తిగతం అని భావించే దళపతి సరికొత్త మార్పునే రాజకీయాల్లో తీసుకుని రావాలని భావించారు. అది ఆచరణలో సైతం చూపించడమే విశేషం. దాంతో దేశమంతా ఇపుడు టీవీకే ఎమ్మెల్యే గురించే చర్చించుకుంటోంది.
ఎమ్మెల్యేను గుర్తు పట్టని వైనం :
ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, అంగబలం అర్ధబలం దర్జా అన్నీ కనిపించాలి. కొత్తగా ఎవరు పార్టీ పెట్టినా ఈ విషయాలనే పరిగణనలోకి తీసుకుని టికెట్లు ఇస్తూ ఉంటారు. కానీ విజయ్ మాత్రం కులం మతం ప్రాంతం వర్గం వర్ణం అంగ బలం అర్ధ బలం ఇవేమీ చూడలేదు, కష్టపడి ప్రజల కోసం పాటు పడే ఆశయం ఆరాటం ఉందనుకుంటే వారికే టికెట్లు ఇచ్చారు. అలా ఒక ఆటో డ్రైవర్, ఒక ట్యూషన్ టీచర్ తో పాటు మధ్య తరగతి వర్గానికి చెందిన వారు అంతా ఆయన చలవతో టికెట్లు పొంది ఎమ్మెల్యేలు అయిపోయారు. దంతో చెన్నైలోని టీవీకే పార్టీకి వస్తున్న విజయ్ పార్టీ ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం పోలీసులకే కష్టసాధ్యమవుతోంది. టీవీకే ఆఫీస్ వద్ద గట్టి బందోబస్తు కాస్తున్న పోలీసులు తాము టీవీకే ఎమ్మెల్యేలమని చెప్పినా లోపలికి వెళ్ళనీయడం లేదు, దాంతో వారంతా తమ రుజువులు చూపించడానికి ఎమ్మెల్యేలుగా గెలిచిన సర్టిఫికెట్లు పోలీసులకు చూపించి లోపలికి వెళ్లాల్సి వస్తోంది. ఇదిపుడు నెట్టింట అతి పెద్ద చర్చగా మారింది.
సాధారణ గృహిణికి :
శివకాశి అని తమిళనాడులో కీలక నియోజకవర్గం ఉంది. అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి జీవిస్తున్న ఒక మిడిల్ క్లాస్ మహిళకు విజయ్ టికెట్ ఇచ్చారు. దాంతో ఆమె తలపండిన రాజకీయ నేతలను ఓడించి మరీ ఎమ్మెల్యే అయిపోయారు. ఇది ఎవరైనా ఊహించగలరా, విజయ్ చేసిన ఈ మ్యాజిక్ మామూలుది కాదు ఎంతో మందికి ఇలా టికెట్ ఇచ్చారు. బాగా పనిచేసే వారు జనం వద్దకు వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించే వారిని గుర్తు పట్టి మరీ టికెట్ చేతిలో పెట్టిన విజయ్ ని చూస్తే దేశంలో కొత్త రాజకీయానికి ఆయన శ్రీకారం చుట్టారని పిస్తోంది.
విజయ్ తప్ప మరో పేరు :
నిజానికి టీవీకేలో విజయ్ తప్ప ఎవరి పేరు తెలియదు, విజయ్ తప్పించి టీవీకేకి గ్లామర్ గ్రామర్ కూడా లేదు. కానీ విజయ్ తానే ఒంటరిగా బరిలోకి దిగి తన బాలాన్ని తన పట్ల జనంలో ఉన్న నమ్మకాన్ని అందరికీ పంచి మొత్తం 108 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఇది నిజంగా ఒక రికార్డు. విజయ్ చేసిన ఈ ప్రయోగం రేపటి రోజున దేశానికి ఆదర్శం అవుతుందని చెప్పాలి. ధన రాజకీయాలు కుల మత రాజకీయాలతో పూర్తిగా కూరుకుపోయిన దేశానికి విజయ్ సరికొత్త దారి చూపించారని అంటున్నారు అయితే విజయ్ ప్రయోగం చేయడానికి ఎంత మందికి ధైర్యం ఉందన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.