ఉన్న సీట్లలో రెండు కట్...విపక్షాలకు విజయ్ మార్క్ షాక్ !

ఇక విజయ్ పార్టీ ఎన్నికల్లో అచ్చంగా గెలిచినవి 108 సీట్లు. అందులో విజయ్ రెండవ సీటు తీసేస్తే 107కి తగ్గింది. ఇక ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే సభ్యుడు ఓటు వేయలేకపోయారు.

Update: 2026-05-13 19:30 GMT

తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఇది కదా అసలైన పాలిటిక్స్ అనిపిస్తున్నారు. ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నేత మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారు. నిజానికి విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వానికి అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా బలం అయితే లేదు. కానీ బలపరీక్షకు గవర్నర్ ఇచ్చిన అతి తక్కువ టైం లోనే ఏకంగా 144 నంబర్ తో నిరూపించుకున్నారు. దాంతో 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ అయిన 118 కంటే 26 ఎమ్మెల్యేల అదనపు బలాన్ని సాధించి స్ట్రాంగ్ గవర్నమెంట్ గా చెప్పకనే చెప్పింది. ఇదంతా ఎలా సాధ్యం అయింది అంటే విజయ్ మార్క్ చాతుర్యమే అని అంటున్నారు.

అనుభవం లేకపోయినా :

ఇక విజయ్ పార్టీ ఎన్నికల్లో అచ్చంగా గెలిచినవి 108 సీట్లు. అందులో విజయ్ రెండవ సీటు తీసేస్తే 107కి తగ్గింది. ఇక ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే సభ్యుడు ఓటు వేయలేకపోయారు. దాంతో 106 మంది మాత్రమే విజయ్ పార్టీ నుంచి ఉన్నారు. ఇందులో స్పీకర్ ఓటు కూడా ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు వామపక్ష పార్టీల నుంచి చెరి రెండూ వీసీకే రెండు, ఐయూ ఎం ఎల్ నుంచి ఇద్దరు కలిపితే 119 మంది కూడారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 118కి బొటా బొటీ అన్న మాట. అయితే 144 మంది ఎమ్మెల్యేలు సపొర్ట్ చేశారు. అలా అమాంతం 38 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ఇది విజయ్ మార్క్ మార్క్ పొలిటికల్ స్ట్రెంగ్త్ అని అంటున్నారు. విజయ్ కి రాజకీయాలు ఏమి తెలుసు అన్నారు, ఆయనకు అనుభవం ఏమిటి అని కూడా ఎద్దేవా చేశారు. ఇవన్నీ కూడా విజయ్ పార్టీ పెట్టాక వచ్చిన ప్రశ్నలు. కానీ విజయ్ ఒకటే చెబుతూ వచ్చారు. అనుభవం అవసరం లేదు అని. అలా ఆయన జనం వద్దకు వెళ్లారు. ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారు. కాకపోతే త్రిముఖ పోటీలో 108 సీట్లు మాత్రమే ఆయన దక్కించుకున్నారు.

పళనిస్వామికి భారీ షాక్ :

ఈ పరిణామం చూస్తే తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశంగా చెబుతున్నారు. అదే సమయంలో అన్నా డీఎంకేకి భారీ షాక్ గా కూడా చూస్తున్నారు. ఇదిలా ఉంటే టీవీకే ఎమ్మెల్యేల బలం ఇంకా పెరుగుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే పళని స్వామి నాయకత్వం పట్ల అన్నాడీఎంకే లోని మరింత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆయనకు ప్రస్తుతం 22 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమె ఉంది. రానున్న రోజులలో అందులో కూడా మరి కొంత మంది ఎమ్మెల్యేలు టీవీకే వైపు రావచ్చు అని అంటున్నారు. అదే జరిగితే విజయ్ ప్రభుత్వం 150 మార్క్ ని కూడా దాటేస్తుంది అని అంటున్నారు. ఇక డీఎంకే కి కూడా ఇటువంటి ప్రమాదమే పొంచి ఉందని అంటున్నారు. ఆ పార్టీ భవిష్యత్తు అంతా ఉదయనిది స్టాలిన్ ప్రతిపక్ష పాత్ర మీదనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. రానున్న కాలంలో ముఖ్యమంత్రి విజయ్ మరింత దృఢంగా బలంగా తన విధానాలతో ముందుకు సాగిపోతే కనుక, తన పరిపాలనతో ప్రజల మెప్పు పొందితే కనుక కచ్చితంగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా కొందరైనా టీవీకే ప్రభుత్వం వైపు చూసే అవకాశం ఉంది అని అంటున్నారు ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సరికొత్త పొలిటికల్ ట్రెండ్ సృష్టించారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News