బీజేపీలోకి విజయసాయి...మిత్రుల కండిషన్లు అప్లై ?
విజయసాయిరెడ్డి రాజకీయ కేంద్రమే ఏపీ అని అంటున్నారు. మరి ఏపీ కాకుండా ఆయన బయట రాష్ట్రాలలో ఎలా రాజకీయం చేస్తారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది అంటున్నారు.;
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ మీద రకరకాలైన చర్చలు ప్రచారాలు సాగుతున్నాయి. అందులో ఏది వాస్తవం అన్నది తెలియదు కానీ ఇవన్నీ భలే ఇంటరెస్టింగ్ గా ఉంటున్నాయి. రాజకీయాల గురించి ఆసక్తి ఉన్న వారికి విజయసాయిరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్న ఉత్కంఠ ఉంది అని అంటున్నారు.
ఇక విజయసాయిరెడ్డి విషయానికి వస్తే ఆయన రాజకీయ సన్యాసం అనేశారు. కానీ నిన్నటిదాకా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వారు ఎవరూ ఉన్నట్లుండి అలా చేయలేరు. దాంతో ఆయన తరువాత అడుగుల మీద రకరకాలైన స్పెక్యులేషన్స్ వస్తున్నాయి.
విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారు అన్నది చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. అయితే అదిపుడు మెటీరియలైజ్ అవుతుంది అని అంటున్నారు. ఆ సమయం దగ్గరకు వచ్చేసింది అని కూడా అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి చేరిక మీద ఏపీలోని బీజేపీ మిత్రులు ఎలా స్పందిస్తాయన్నది కూడా మరో చర్చగా చెబుతున్నారు.
అయితే విజయసాయిరెడ్డి చేరికకు మిత్రులు కూడా ఏ రకమైన అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని అంటున్నారు. టీడీపీ జనసేన ఆయన కమలం పార్టీలో చేరిక విషయంలో ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ఆయన ఏపీ రాజకీయాల్లో కాకుండా జాతీయ స్థాయిలో ఎక్కడ బీజేపీ ద్వారా పనిచేసినా తనకు అభ్యంతరం లేదని ఒక కండిషన్ పెట్టాయని ప్రచారం సాగుతోంది.
విజయసాయిరెడ్డి రాజకీయ కేంద్రమే ఏపీ అని అంటున్నారు. మరి ఏపీ కాకుండా ఆయన బయట రాష్ట్రాలలో ఎలా రాజకీయం చేస్తారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఆ వేంటనే ఆయనకు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి పార్టీ ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు
ఆయన నెల్లూరు వాసి కావడంతో తమిళనాడుతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయని అంటున్నారు. దాంతో మరో ఏడాదిలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయసాయిరెడ్డి సేవలను వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. మరి విజయసాయిరెడ్డికి ఈ పార్టీ పదవి మాత్రేమే ఇస్తారా లేక రాజ్యసభ సీటు కూడా ఇస్తారా అన్నది కూడా ఇంకో చర్చగా ఉంది.
ఏది ఏమైనా విజయసాయిరెడ్డి వైసీపీలో ఉంటూ తెర వెనక ముందూ చక్రం తిప్పారు. ఆయనకు ఒక కీలకమైన రాష్ట్రం బాధ్యతలు బీజేపీ అప్పగించాలని చూస్తే కనుక ఆయనకు మంచి రాజకీయ ప్రమోషన్ కిందకే వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఏ మేరకు నిజం ఉందో ఏమిటన్నది. అయితే ప్రచారాలు ఎవరు చేసినా ఎందుకు చేస్తున్నా విజయసాయిరెడ్డి విత్ బీజేపీ అన్న దాంట్లో మాత్రం అంతా ఒక్కటే మాట అంటున్నారు. సో ఆ విధమైన పుకార్ల లాంటి ప్రచారానికి తెర దించాలన్నా స్పష్టత ఇవ్వాలన్నా కూడా అది విజయసాయిరెడ్డి చేతిలో మాత్రమే ఉంది అని అంటున్నారు.