దళపతి విజయ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారా?
కోలీవుడ్‌లో క్రేజీ స్టార్‌గా ఎదిగిన హీరో దళపతి విజయ్. తనదైన మార్కు నటనతో, స్టైల్స్‌తో అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకుని తిరుగులేని స్టార్ అనిపించుకున్నారు.;
కోలీవుడ్‌లో క్రేజీ స్టార్‌గా ఎదిగిన హీరో దళపతి విజయ్. తనదైన మార్కు నటనతో, స్టైల్స్‌తో అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకుని తిరుగులేని స్టార్ అనిపించుకున్నారు. తమిళ నాట సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఆ స్థాయి డిమాండ్‌ని, బాక్సాఫీస్ వద్ద క్రేజ్‌ని సొంతం చేసుకున్న విజయ్ ఈ ఏడాది నుంచి సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు. తనని ఆదరించి స్టార్‌ని చేసిన ప్రేక్షకులకు అండగా నిలవాలనే లక్ష్యంతో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
తమిళగ వెట్రి గళగం పేరుతో పార్టీని స్థాపించి గత కొంత కాలంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. `జన నాయగన్` మూవీతో సినిమాలకు గుడ్ బై చెబుతున్న దళపతి విజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అతన్ని రాజకీయంగా ఎదగనివ్వకుండా ఆదిలోనే తొక్కెయ్యాలనే ప్లాన్ నడుస్తోందా? అంటే తాజాగా విజయ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కరూర్‌లో కొన్ని రోజులు క్రితం విజయ్ భారీ రోడ్ షోని నిర్వహించాడు.
దీనికి లక్షలాది మంది అభిమానులు, ఆయన ఫాలోవర్స్ హాజరు కావడంతో ఆ భారీ క్రౌడ్‌ని కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో అక్కడ తొక్కీసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ సంఘటనలో 41 మంది మరిణించగా, 60 మంది గాయపడ్డారు. పెను విషాదాన్ని నింపిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తుని ముమ్మురం చేసిన నేపథ్యంలో ఈ కేసుని సుప్రీం కోర్టు సీబీఐకి బదిలీ చేసింది.
కరూర్ తొక్కిసలాట సంఘటనపై సీబీఐ ప్రస్తుతం ముమ్మురంగా దర్యాప్తు చేస్తోంది. తొక్కీసలాటకు సంబంధించిన ఆధారాలని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ విషయంపై టీవీకే ఆఫీస్ బేరర్‌లని సీబీఐ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత విజయ్‌కి నోటీసులు జారీ చేసి ఆయనని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. విజయ్‌ని విచారించిన అనంతరం ఛార్జిషీట్‌ని దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ దర్యాప్తును సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్యకమిటీ పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట విజయ్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ విజయ్‌ని తమ వైపు తిప్పుకుని తనతో అలయన్స్ కోసం చూస్తున్నాయని, ఇదే సమయంలో బీజేపీ కూడా విజయ్ ని తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తోందని ఓ వర్గం కామెంట్‌లు చేస్తోంది.