ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ ఎంపీల క్రాస్ ఓటింగ్

ఉప రాష్ట్రపతి ఎన్నికలు మంగళవారం ఢిల్లీలో హోరా హోరీగా సాగాయి. ఉదయం పది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం అయిదు వరకూ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది.;

Update: 2025-09-09 12:31 GMT

ఉప రాష్ట్రపతి ఎన్నికలు మంగళవారం ఢిల్లీలో హోరా హోరీగా సాగాయి. ఉదయం పది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం అయిదు వరకూ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఎన్డీయే ఇండియా కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి తో తలపడ్డారు. ఇక భారత దేశ ఉప రాష్ట్రపతి ని పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది.

తొలి వేటు వేసిన ప్రధాని :

ఇక ఈ ఎన్నికల్లో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరిగింది. . ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు తమ నచ్చిన వారికి ఓటు వేయవచ్చు పార్టీ విప్ ఉండదు, ఏ విధమైన చర్యలు కూడా తీసుకునే వీలు ఉండదు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు విలువ ఒకే విలువను కలిగి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో 542 మంది సభ్యులు మరియు రాజ్యసభలో 239 మంది సభ్యులు ఉన్నారు. ఇలా చూస్తే కనుక ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటర్ల సంఖ్య 781 గా ఉంది. దాంతో సగానికి కంటే ఒక్క ఓటు అదనంగా వచ్చిన వారినే విజేతగా ప్రకటిస్తారు. మొదటిసారిగా ఉప రాష్ట్రపతి ఎన్నిక కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది.

తొలి ఓటు మోడీదే :

ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటుని ప్రధాని నరేంద్ర మోడీ వేశారు. ఆ వరసలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, అశ్విని వైష్ణవ్, రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ హరి వంశ్ కాంగ్రెస్ నాయకులు మల్లి ఖార్జున్ ఖర్గె, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంకా గాంధీ ఓటు వేశారు. సాయంత్రం అయిదు దాకా పోలింగ్ జరిగింది.

ఓట్లేసింది. 768 ఎంపీలు :

ఇదిలా ఉంటే మొత్తం లోక్ సభ రాజ్యసభలలో కలిపి చూస్తే ఎంపీల సంఖ్య 788గా ఉంది. అయితే ఏడు ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి, దాంతో ప్రస్తుతం ఆ సంఖ్య 781గా ఉంది. ఇందులో కూడా పోలింగ్ కి బీఆర్ఎస్ బీజేపీ, శిరోమణి అకాలీదళ్ దూరంగా ఉన్నాయి. దాంతో పాటు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసేనాటికి 768 మంది సభ్యులు 788 మందికిగాను ఓటు వేసిన 768 మంది పార్లమెంట్ సభ్యులు ఓట్లేశారు అని తుది నివేదిక తెలియచేస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 386 గా ఉంది. ఈ ఓట్లు ఎవరికి అయితే వస్తారో వారే కొత్త ఉప రాష్ట్రపతి అవుతారు. ఇక ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీతో పాటు ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు నికరంగా ఉంది.

ఎన్డీయేకు క్రాస్ ఓట్లు :

ఇదిలా ఉంటే ఇండియా కూటమికి క్రాస్ ఓట్లు వస్తాయని అంతా భావించారు అయితే చిత్రంగా ఎన్డీయేకు ఇద్దరు ఎంపీలు క్రాస్ ఓట్లు వేశారు. ఆప్ నుంచి ఒకరు, ఆర్జేడీ నుంచి మరొకరు ఈ విధంగా క్రాస్ ఓటు చేశారు. దాంతో ఎన్డీయే కూటమి అభర్ధి సీపీ రాధా కృష్ణన్ బలం మరింతగా పెరగనుంది అని అంటున్నారు.

Tags:    

Similar News