• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Astrology >  తన టైం బాగోలేదన్న...

తన టైం బాగోలేదన్న విషయాన్ని వేణు స్వామి గమనించట్లేదా?

| ముందు వేణు స్వామికి అమ్మవారి పూజ చేయించాలని.. నా దగ్గరకు వస్తే చేయిస్తానంటూ పలువురు డార్లింగ్ ఫ్యాన్స్ ఆయన్ను ఆడేసుకుంటున్నారు.

By - Tupaki Desk
Update: 2023-12-23 03:48 GMT

అన్ని తెలిసినోడు తక్కువ మాట్లాడతాడు. అందరి జాతకాల్ని ఇట్టే చెప్పేస్తూ.. అద్భుతమన్న రసాన్ని లైవ్ లో చూపిస్తూ.. కోట్లాది మందికి అబ్బురంగా మారిన ప్రముఖ అస్ట్రాలజర్ (?) వేణుస్వామి టైం అస్సలు బాగోలేదన్నట్లుగా మారింది. ఇటీవల ఆయనకు ఎదురవుతున్న షాకులు చూస్తున్నప్పుడు.. అయ్యోపాపం అనేలా మారింది. ఆ మధ్యన కేసీఆర్.. కేటీఆర్ జాతకాల్ని చెప్పే క్రమంలో 2023లో అప్పటి మంత్రి కేటీఆర్ నేరుగా ముఖ్యమంత్రిఅయిపోతారని.. అందులో వేరే సందేహమే లేదంటూ కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పిన కాన్ఫిడెన్సు తాలుకూ వీడియోను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చూసినప్పుడు వచ్చిన కామెడీ అంతా ఇంతా కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పిన వేణుస్వామి.. ఇప్పటివరకు తాను చెప్పిన ప్రముఖుల జాతకాలకు బదులుగా జరగటానికి సంబంధించిన వివరణను ఇచ్చింది లేదు. ఇలాంటివేళలోనే ఆయనకు ‘సలార్’మూవీతో మరో షాక్ ఎదురైంది. సలార్ సినిమా అడ్డంగా ఫెయిల్ అవుతుందన్న ఆయన జ్యోతిష్య అంచనా నేపథ్యంలో డార్లింగ్ అభిమానులు వేణు స్వామిని ఆడేసుకుంటున్నారు.

ఇన్ని రోజుల పాటు నోటికి వచ్చినట్లుగా చెప్పిన వేణు స్వామిలో అసలు విషయం లేదని..అందుకు నిదర్శనంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావటం.. సలార్ సక్సెస్ కాదన్న అంచనాలు తప్పు అయిన వేళ.. సోషల్ మీడియాలో విపరీతంగా విరుచుకుపడుతున్నారు. ప్రభాస్ కు కెరీర్ అన్నదే లేదని.. సలార్ మీద ఆయన చెప్పిన అంచనాతో అది కాస్తా బెడిసికొట్టిందని చెబుతున్నారు.

ముందు వేణు స్వామికి అమ్మవారి పూజ చేయించాలని.. నా దగ్గరకు వస్తే చేయిస్తానంటూ పలువురు డార్లింగ్ ఫ్యాన్స్ ఆయన్ను ఆడేసుకుంటున్నారు. రకరకాల మీమ్స్ తో ఆయన్ను సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ‘‘ప్రభాస్.. రాజమౌళి ఇద్దరిదీ విచిత్రమైన జాతకం. ప్రభాస్ కి కెరీర్ డౌన్ ఫాల్ చాలా త్వరగా స్టార్ట్ అయ్యింది. రాజమౌళికి ఇంకా టైం ఉంది. ప్రభాస్ మళ్లీ ఈశ్వర్ లాంటి చిన్న సినిమాలు చేసుకోవాల్సిందే’ అంటూ గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలపై తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ఆయన చెప్పిన మాటల్ని ప్రస్తావిస్తూ.. వేణుస్వామిటైం ఇప్పుడు అస్సలు బాగోలేదని.. అర్జెంట్ గా ఆయనిప్పుడు సరైన జాతకుడికి చూపించుకోవాలంటూ సెటైర్లు వేస్తున్నారు. అందరి భవిష్యత్తులు చెప్పే వేణుస్వామి.. తన భవిష్యత్తు విషయంలో కాస్తంత అప్రమత్తంగా లేకపోవటమే విధి వైచిత్రిగా చెప్పక తప్పదంటున్నారు.

Tags:    
  • Venuswami 
  • Astrologer 
  • Ktr 
  • Kcr 
  • Salaar 
  • Prabhas 
  • Socialmedia 
  • Rajamouli 
  • Trolling 

Similar News

శ్రీ పరాభవలో ఎన్నో శుభ ముహూర్తాలు !

2026-03-19 13:45 GMT

ఉగాది పండుగ ఎప్పుడు చేసుకోవాలంటే ?

2026-03-15 15:30 GMT

హోలాష్టక్...అశుభాలు ఎన్ని రోజులు ?

2026-02-23 22:30 GMT

ఇక అన్నీ మంచి శకునములే !

2026-01-31 13:30 GMT

2026 గురించి షాకింగ్ గా నోస్ట్రడమస్ అంచనాలు!

2025-12-26 19:30 GMT

2026లో అరుదైన ఖగోళ విశేషం: 13 నెలలు.. అధిక జ్యేష్ఠ మాసం!

2025-11-28 20:30 GMT

'ఏలియన్స్ వస్తున్నారు'.. 2026కి బాబా వంగా చెప్పిన అంచనాలివే!

2025-11-26 11:05 GMT

పవన్ నోట మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు మాట

2025-11-11 13:49 GMT

నవరాత్రుల్లో అదృష్టం దక్కే రాశులు : శుభయోగాలతో సంపన్నులవ్వబోయేవారు ఎవరు?

2025-09-22 06:46 GMT

చంద్రగ్రహణం: ఆ రాశుల వారంతా ఆర్నెల్లు అదరగొడతారట

2025-09-07 05:23 GMT

ప్రపంచ అంతానికి ఆరంభం వచ్చే ఏడాదేనా?

2024-11-04 04:44 GMT

వైరల్ ఆడియో : వేణు స్వామి అపాయింట్మెంట్ రూ.10 వేలు!

2024-08-13 08:30 GMT

Copyright @2026

Powered by Blink CMS