• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు పోతే పవన్ తపన...

చంద్రబాబు పోతే పవన్ తపన ఇదే... వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు!

| ఇందులో భాగంగా ఎవరికి వారే సంకెళ్లు వేసుకుని ఐదు నిమిషాల పాటు నిరసన తెలిపారు! దీంతో తాజాగా ఈ కార్యక్రమంపై వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు.

By - Tupaki Desk
Update: 2023-10-16 17:23 GMT

ఏపీలో ఎన్నికలకు ఇంకా సుమారు ఐదారు నెలలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎన్నికల సందడి ఇప్పటినుంచే మొదలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటినుంచీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ ఉన్న అనంతరం జనసేన అధినేత పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పారు. ఈ సమయంలో బాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు గత మూడు వారాలుగా ప్రతీ వీకెండ్ కి ఒక కార్యక్రమం ప్లాన్ చేస్తున్న సంగతీ తెలిసిందే. ఇందులో భాగంగా "మోత మోగిద్దాం", "కాంతి క్రాంతి" వంటి కార్యక్రమాలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో... "న్యాయానికి సంకెళ్లు" అనే కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎవరికి వారే సంకెళ్లు వేసుకుని ఐదు నిమిషాల పాటు నిరసన తెలిపారు! దీంతో తాజాగా ఈ కార్యక్రమంపై వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఇందులో భాగంగా... తప్పుచేసిన టీడీపీ నేతలకు ఆ సంకెళ్లు పర్మినెంట్ గా పడతాయని తెలిపారు!

అవును... చంద్రబాబుకు ఆల్రెడీ సంకెళ్లు పడ్డాయి, తమకు కూడా సంకెళ్లు వేయండి అన్నట్లుగా టీడీపీ నేతలు ముందుకు వచ్చారని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో టీడీపీలో ఎవరు అవినీతి చేసినా అలా సంకెళ్లు వేసి తీసుకెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఐదు నిమిషాల నిరసన కార్యక్రమం అని ప్రకటించినా కూడా స్పందన కరువవుతుందని ఎద్దేవా చేశారు!

అనంతరం పవన్ కల్యాణ్ పైనా వెల్లంపల్లి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇందులో భాగంగా... చంద్రబాబు 7691 ముద్రవేసుకుని కోర్టు పరిధిలో ఉంటే ప్రభుత్వానికి ఏమి సంబంధం ఉంటుంది అని ప్రశ్నించిన ఆయన... ఈ సమయంలో ఆయన విషయంలో ఎలాంటి అనుమానం ఉన్నా, మరెలాంటి అభ్యర్థన చేయాలనుకున్నా కోర్టు దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు.

ఇప్పటికే ఏసీ కావాలని కోర్టుకి విన్నవిస్తే ఇచ్చారని గుర్తుచేసిన ఆయన... ఒకవేళ ప్రైవేటు వైద్యం కావాలని భావిస్తే దానిపై కూడా కోర్టుకు వెళ్లి అడగాలని సలహా ఇచ్చారు. ఈ విషయంలో ఎందుకు మాట్లాడరు అంటూ పవన్ ని ప్రశ్నించిన ఆయన... షూటింగుల్లో, ఫాం హౌసుల్లో బిజీగా ఉంటావంటూ ఆయనపై సెటైర్లు వేశారు! ఇదే సమయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు!

ఇదే క్రమంలో... "చంద్రబాబు ఎప్పుడుపోతే అప్పుడు ఆ పార్టీని కలిపేసుకోవచ్చు, మన పార్టీని కలిపేయొచ్చు అని నీ తపన నీది.. నీకు నిజంగా చంద్రబాబు మీద ప్రేమ ఉందా.. ప్రేమ ఉంటే కోర్టుకి వెయ్యి, మెరుగైన వైద్యం అందించండి, ప్రైవేటు వైద్యశాలలో ట్రీట్ మెంట్ ఇప్పించండి అని అడగండి" అని పవన్ కల్యాణ్ కు సూచించారు వెల్లంపల్లి శ్రీనివాస్.

ఇక, ఒకప్పుడు చంద్రబాబు ఉక్కు మనిషి అని, ఆయనది ఉక్కు సంకల్పం అని చెప్పుకున్నారని... ఇప్పుడు నెలరోజులకే ఆ ఉక్కంతా తుక్కైపోయిందని విమర్శించిన వెల్లంపల్లి... చంద్రబాబుకు లేని రోగం లేదని వాళ్ల కుటుంబ సభ్యులే చెప్పుకుంటున్నారన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Full View
Tags:    
  • Andhrapradesh 
  • Politicalnews 
  • Skilldevelopment 
  • Cbnjail 
  • Cbnarrest 
  • Janasena 
  • Alliacne 
  • Vellampallisrinivas 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS