నేనే సీనియర్ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి...ఉన్నదే చెప్పారా ?

ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారు అంటే తెలంగాణ శాసనసభలో అందరిలోకీ తాను అత్యంత సీనియర్ ఎమ్మెల్యేను అని.;

Update: 2025-11-25 23:30 GMT

తెలంగాణా కాంగ్రెస్ లో రాజకీయం అంతా బయటకు సాఫీగానే సాగుతోంది. కర్ణాటకలో మాత్రం సీఎం కుర్చీ కోసం పోటీ స్టార్ట్ అయింది. అయితే అక్కడ ఒప్పందం ఉందని అంటున్నారు. మరి తెలంగాణాలో అలాంటి లోపాయికారీ ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే కర్ణాటకతో పోలిస్తే తెలంగాణాలోనూ సీనియర్ నేతలు ఎక్కువ మందే ఉన్నారు అందరూ దిగ్గజ నేతలే. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా రెండు దశాబ్దాల అనుభవం కలిగిన నేత అయినప్పటికీ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన వీరితో పోలిస్తే కొత్త వారే అని అంటారు. అయినా ఆయనను ముఖ్యమంత్రి పదవి లభించింది అంటే ఆయనకు ఉన్న మాటకారితనం, ప్రజాకర్షణ శక్తి. కేసీఆర్ ని ఢీ అంటే ఢీ కొట్టిన డేరింగ్ పర్సనాలిటీ.

కీలక వ్యాఖ్యలేనా :

ఇక కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం కుస్తీ మొదలైన వేళ తెలంగాణా కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యల మర్మమేంటి అన్న చర్చ సాగుతోంది. ఆయన మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూనే తాను సీనియర్ అని చెప్పుకున్నారు. నిజం చెప్పాలి అంటే ఈ వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోవాల్సింది లేదని అంటున్నారు. పైగా ఆయన చెప్పినది కరెక్టే కదా అని అంటున్నారు.

ఇంతకీ ఏమన్నారు అంటే :

ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారు అంటే తెలంగాణ శాసనసభలో అందరిలోకీ తాను అత్యంత సీనియర్ ఎమ్మెల్యేను అని. ఇక తన కంటే సీనియర్ గా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉన్నారని కానీ ఆయన అసెంబ్లీకే సభకు రావడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఇక అలా చూస్తే కనుక ప్రస్తుతం అసెంబ్లీకి వచ్చే వారిలో మాత్రం తాను సీనియర్ నాయకుడినని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుల్ క్లారిటీగా చెప్పేశారు అంతే కాదు ఆయన మరో మాట కూడా అన్నారు. ఏడుసార్లు ఒకే పార్టీ బీఫామ్‌పై గెలిచిన వ్యక్తిని తానే అని. అంటే తాను పార్టీలు మారలేదని కాంగ్రెస్ నే నమ్ముకుని గెలిచి వస్తున్న వాడిని అని గట్టిగా చెప్పారు అన్న మాట.

పీసీసీ చీఫ్ గా :

ఇక వైఎస్సార్ క్యాబినెట్ లోనే మంత్రిగా కీలక శాఖలు చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్ అని అంతా అంటారు. అంతే కాదు ఆయన తెలంగాణా కాంగ్రెస్ కి పీసీసీ చీఫ్ గా సుదీర్ఘ కాలం వ్యవహరించారు. బ్యాడ్ లక్ ఏమిటి అంటే ఆయన టైంలో రెండు సార్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పోటీ పడినా అధికారంలోకి రాలేకపోయింది. కనీసం 2018లో వచ్చినా కూడా మరో చాయిస్ లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయిపోయేవారు. కానీ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఉత్తం మాజీ పీసీసీ చీఫ్ గా అప్పటికి ఉన్నారు

అదన్న మాట మ్యాటర్.:

ఇక సీఎం రేసులో అప్పట్లో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ చివరికి మంత్రిగా సర్దుకున్నారు. మరి ఇపుడు ఆయన సీనియర్ నేతను అని ఒకే పార్టీ గుర్తు మీద వరసగా ఏడు సార్లు గెలిచాను అని ప్రత్యేకంగా చెప్పడమో అర్ధమేంటని అంతా ఆలోచిస్తున్నారు. రాజకీయాలో ఆశలు లేవని ఎవరు చెప్పినా తప్పే అవుతుంది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పదవుల విషయంలో ఆలోచించినా తప్పు ఏ మాత్రం కాదు, పైగా ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయనే అంటారు. అయితే కాలమే ఎవరికి అయినా కలిసి రావాలి. సో అదన్న మాట మ్యాటర్.

Tags:    

Similar News