రాత్రికి రాత్రే యూఎస్ వీసా స్లాట్స్ మాయం.. గందరగోళంలో విద్యార్థులు
ఉన్నత విద్య చదువుతున్న ప్రతి ఒక్కరి కల అమెరికా వెళ్లడం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అమెరికా పంపాలని ఎన్నో కలలు కంటున్నారు.;
ఉన్నత విద్య చదువుతున్న ప్రతి ఒక్కరి కల అమెరికా వెళ్లడం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అమెరికా పంపాలని ఎన్నో కలలు కంటున్నారు. అలాంటి వారికి పెద్ద షాక్ తగిలింది. ఈ వేసవిలో అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వేలాది మంది అహ్మదాబాద్ స్టూడెంట్స్‌కు వీసా అపాయింట్‌మెంట్ స్లాట్లు ఉన్నట్లుండి మాయమైపోయాయి. వాస్తవానికి జనవరిలో వీసా స్లాట్లు దొరికిన వాళ్లకు అంతా సాఫీగానే జరిగింది. కానీ గత 20 నుంచి 25 రోజులుగా సీన్ పూర్తిగా మారిపోయింది.
ట్రావెల్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి మధ్య నుంచి ఆయా విద్యార్థుల వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్స్ కనిపించడం లేదు. దీనితో స్టూడెంట్స్‌తో పాటు వీసా కన్సల్టెంట్స్ కూడా ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అహ్మదాబాద్‌కు చెందిన వీసా కన్సల్టెంట్ మౌలిన్ జోఫి మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి, మార్చి నెల మొదట్లో అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకున్న స్టూడెంట్స్ కు ఏప్రిల్ నెలలో స్లాట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మే నెల అపాయింట్‌మెంట్ డేట్స్ అస్సలు లేవు. వాళ్లు యూనివర్సిటీల నుంచి అడ్మిషన్లు, ఐ-20 ఫారంలు తెచ్చుకున్నారు. కానీ వీసా ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందో తెలీక గందరగోళంలో ఉన్నారు" అని అన్నారు.
గతేడాది చివర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత వీసా ప్రాసెస్ చాలా సులభంగా జరిగింది.జనవరి నెలలో యూనివర్సిటీల్లో జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్ తొందరగా అపాయింట్ మెంట్స్ లభించాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్ ఎంబసీ ఇటీవల ఇండియాలో తీసుకున్న కొన్ని చర్యలు కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వీసా అపాయింట్‌మెంట్ స్లాట్లను అక్రమంగా సంపాదించేందుకు కొంతమంది తప్పుదోవ పడుతున్నారు. అలాంటి మార్గాలను మూసి వేయడానికి అమెరికా ఎంబసీ తన సిస్టమ్స్ అప్ గ్రేడ్ చేస్తోందని ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ ఒకరు తెలిపారు.
మార్చి 10 నుంచి స్టూడెంట్ వీసాల కోసం ఒక్క స్లాట్ కూడా లేదని ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ భావిన్ థాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది అపాయింట్‌మెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ రిజక్షన్ రేటు ఎక్కువగా ఉండడంతో స్టూడెంట్స్ భయపడ్డారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్ ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో చాలా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది విద్యార్ధులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. అమెరికా స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్ స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయోనని విద్యార్థులు చాలా ఒత్తిడిలో ఉన్నారు.