ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిన వేళ భారత్ కు ఎంత మేలు?
2024 డిసెంబరు తర్వాత దాదాపు పది నెలలకు వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని ఫెడ్ రిజర్వు ప్రకటించింది.;
అక్కడెక్కడో అమెరికా. అల్లంత దూరాన ఉన్న ఒక దేశంలో.. మన భారతదేశంలోని రిజర్వు బ్యాంకు మాదిరి.. అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్ల మేర వడ్డీ కోత విధిస్తూ తన తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూఎస్ లో ప్రస్తుతం వడ్డీరేట్లు 4 నుంచి 4.25 శాతానికి చేరుకున్నాయి. వడ్డీ రేట్ల కోత విషయంలో ఇదే తొలిసారి ఈ ఏడాది ఆరంభమైన తర్వాత.
2024 డిసెంబరు తర్వాత దాదాపు పది నెలలకు వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని ఫెడ్ రిజర్వు ప్రకటించింది. అంతేకాదు.. రానున్న నాలుగు నెలల వ్యవధిలో మరో రెండుసార్లు పావు శాతం చొప్పున వడ్డీరేట్ల కోత ఉండే వీలుందన్న సంకేతాలు వచ్చాయి. మరి.. ఈ నిర్ణయంతో భారత ఆర్థిక వ్యవస్థకు కలిగే మేలంతా? మనకు లాభం జరుగుతందా? అంటే ఇక్కడో పాతకాలం నాటి సామెతను చెప్పాలి. చైనాలోని కమ్యునిస్టులకు జలుబు చేస్తే.. ఇండియాలో ఉన్న కామ్రేడ్స్ కు తుమ్ములు వచ్చేవని. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితే అమెరికా కారణంగా భారత్ కు. అదేమంటే.. అర
అలానే ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఒక దానితో ఒకటి అనుసంధానమై ఉండటం తెలిసిందే. అందునా అగ్రరాజ్యమైన అమెరికా తీసుకునే ఆర్థిక పరమైన నిర్ణయాలు ప్రపంచ దేశాల్ని.. అదే విధంగా అమెరికా మీద చాలా ఎక్కువగా ఆధారపడే భారత్ మీదా ప్రభావం పక్కాగా ఉంటుంది. మరి.. ఫెడ్ వడ్డీ రేట్ల కోత భారత్ కు ఏ మాత్రం సానుకూలంగా ఉంటుందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఫెడ్ వడ్డీ రేట్లలో కోత పెట్టటంతో.. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల జోరు పెరుగుతుంది. దీంతో స్టాక్ మార్కెట్ ఉత్సాహంతో ఉరకలెత్తే వీలుంది. అంతేకాదు.. డాలర్ బలహీనపడి రూపాయి మీద ఒత్తిడి తగ్గుతుంది. దిగుమతుల వ్యయం తగ్గి భారత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పై ఒత్తిడి తగ్గుతుంది. భారత స్టాక్ మార్కెట్.. ఈక్విటీ మార్కెట్ లోకి డబ్బు వస్తుంది. దీంతో సానుకూల వాతావరణానికి అవకాశం ఉంటుంది.డాలర్ బలహీనతతో భారత ఎగుమతులు పోటీ పరంగా మరింతగా బలపడతాయి.
ఇప్పుడు పెట్టిన కోత తక్కువే అయినా. రానున్న రెండు నెలల్లో మరింత కోత ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో ఇక్కడ పెట్టే పెట్టుబడుల జోరు మరింత పెరుగుతుంది. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు ర్యాలీ చేసే వీలుంది. బ్యాంకింగ్.. ఫైనాన్షియల్ సర్వీసులు.. ఇన్ ఫ్రా.. రియల్ ఎస్టేట్ రంగాలు లాభపడే వీలుంది.ఐటీ ఫార్మా కంపెనీలు సైతం లాభపడతాయి. మొత్తంగా చూస్తే ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు కోత.. భారత్ కు మేలు కలుగుతుందని చెప్పాలి. ట్రంప్ సుంకాల వేళ.. ఇది కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.
తాజాగా తగ్గిన 25 బేసిక్ పాయింట్ల తో భారత ఆర్థిక వ్యవస్థకు కలిగే లాభాన్ని ఒక అంచనా వేస్తే..మరింత బాగా అర్థమవుతుంది. నిజానికి 25 బేసిస్ పాయింట్లు తగ్గితే దీన్ని ఆర్థిక రంగ బాషలో సిగ్నల్ కట్ గా పరిగణిస్తారు. ఇది చిన్నదే అయినప్పటికి మార్కెట్ సెంటిమెంట్ ను బలపడేలా చేస్తుందని చెప్పాలి.తాజా వడ్డీ కోతతో చిన్న.. మధ్య స్థాయి ఇన్వెస్టర్లు భారత్ వైపు చూసే వీలుంది.
రూపాయి యాభై పైసల నుంచి రూపాయి వరకు లాభపడే వీలుంది. డాలర్ బలహీనతతో నెల వ్యవధిలో 2 నుంచి 5 బిలియన్ డాలర్ల వరకు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లు రాబడులు బాగున్న భారత మార్కెట్ లో డబ్బులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఐటీ సర్వీసుల డిమాండ్ కూడా మెరుగుపడే వీలుంది. సెన్సెక్స్ కూడా 1.5 శాతం నుంచి 3 శాతం వరకు షార్ట్ టర్మ్ ర్యాలీకి వీలుంది. ఇన్ని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. మరెలాంటి ప్రతికూలతలు ఉండవా? అన్న సందేహం కలగొచ్చు. ఆ అంశాల్లోకి వెళితే..
స్వల్పకాలిక విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చి.. మళ్లీ వెళ్లిపోతే దాని ప్రభావం స్టాక్ మార్కెట్ మీదా ఉంటాయి. డాలరు బలహీనమై రూపాయి ఎక్కువగా బలపడితే ఎగుమతి దారుల లాభాలు తగ్గే వీలుంది. క్రూడ్ ఆయిల్.. బంగారం లాంటి వస్తువుల ధరలు పెరిగే వీలుంది. అంతా బాగానే ఉన్నా.. అక్కడ ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రభావం మన మీదా.. మన మార్కెట్ మీదా ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఇప్పటికైతే అంతా బాగానే ఉన్నా.. అదేమీ శాశ్వితం కాదన్న విషయాన్నిమాత్రం మర్చిపోకూడదు.