పాక్ అణ్వాయుధాలతో ప్రపంచానికి పెను ముప్పు
పాకిస్థాన్ విషయంలో ఇపుడు ప్రపంచానికి ముప్పు అన్న కోణంలో చర్చ జరుగుతోంది.;
పాకిస్థాన్ విషయంలో ఇపుడు ప్రపంచానికి ముప్పు అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఆ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలు ప్రపంచానికే పెను సవాల్ చేస్తాయని అంటున్నారు. ఎందుకంటే పాక్ ఇపుడు అంతర్గతంగా ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని యూకేకి చెందిన ఏషియన్ లైట్ అనే పత్రిక కీలకమైన వార్తా కథనాన్ని తాజాగా ప్రచురించింది. దాని మేరకు చూస్తే కనుక పాక్ వద్ద అణ్వాయుధాలు బాధ్యత ఏ మాత్రం లేని వారి చేతిలో రాయి మాదిరిగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ కధనం చెబుతోంది.
పాక్ లో పరిస్థితులు :
పాకిస్థాన్ లోకి పరిస్థితులు చూస్తే పూర్తి అస్థిరత్వం కూడుకుని ఉన్నాయని ఆ కధనం గుర్తు చేస్తోంది. పాక్ లో రాజకీయంగా ఆర్ధికంగా ఇతరత్రా అనేక సంక్షోభాలు ఉన్నాయని చెబుతోంది. ఈ నేపధ్యంలో పాక్ తన అణు సంపత్తి మీద ఏ విధంగా భద్రతను కలిగి ఉండగలదు అన్న సందేహాలను అయితే వ్యక్తం చేస్తోంది. పాక్ ని ఒక బాధ్యతాయుతమైన దేశంగా పరిగణించలేమని కూడా సదరు కధనం పేర్కొనడం విశేష పరిణామం.
పాక్ అన్ని విధాలుగా :
పాక్ అన్న దేశం ఇపుడు అన్ని విధాలుగా వీక్ గా ఉందని అక్కడ తరచూ రాజకీయంగా సంక్షోభాలు తలెత్తుతూ ఉంటాయని ఈ కధనం చెబుతోంది. ఇక అక్కడి సైనిక స్థావరాల మీదకు ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని కూడా డౌట్స్ వ్యక్తం చేసింది. అంతే కాదు పాక్ అణ్వాయుధాల భద్రత ఈ సమయంలో అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఈ పరిస్థితి పరిణామాలు కనుక అన్వయించుకుంటే అణ్వాయుధాలు కానీ వాటికి సంబంధించిన పదార్ధాలు కానీ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చే ప్రమాదాన్ని కొట్టి పారేయలేమని కూడా చెబుతోంది.
సంతకం చేయల్ని వైనం :
ఇక పాకిస్థాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయలేదని కూడా ఈ కధనం ఎత్తి చూపుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్థాన్ ఇరాన్ అణు కార్యక్రమానికి సైతం గతమో ఎంతో మేలు చేసేలా వ్యవహరించింది అని కూడా పేర్కొంటోంది. , ఇరాన్ వంటి దేశాల విషయంలో పాక్ అనుకూల వైఖరి ప్రపంచ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని నివేదిక హెచ్చరించింది. ఇక ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం 1980 90 దశకాలలో ఇరాన్ అణు కార్యక్రమాలకు పాక్ రహస్యంగా ఎంతో సాయం చేసింది అని కూడా యూకే వార్తా కధనం పేర్కొనడం విశేషం.
అణు నిపుణులను సైతం :
ఇక ఇపుడు ఇరాన్ చూస్తే తన యూరేనియం నిల్వలను ఏకంగా ఒప్పంద పరిమితికి మించి 48 రెట్లు పెంచుకోవడం కూడా పెను ముప్పుకు దారి తీసే పరిణామంగానే చెబుతోనిద్. అంతే కాదు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీలను కూడా ఇరాన్ కాదనడం తో ప్రపంచానికి ఈ పరిణామాలు ప్రమాదాన్ని తెచ్చేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇపుడు అదే పాక్ ఇరాన్ కి సమర్ధిస్తూ వ్యవహరించడం చూస్తూంటే అంతర్జాతీయంగా ఈ పరిణామాలు అణు నిపుణులను సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆ వార్తా కథనం లో వెల్లడి అయింది. పాక్ మద్దతు ఇరాన్ దూకుడు ఇవన్నీ ఏదో నాటికి అంతర్జాతీయంగా అణు ముప్పుని కలిగిస్తాయని కూడా ఈ కధనంలో చెప్పుకొచ్చింది.