కోడి పందాలలో మహిళలు.. సఖినేటిపల్లిలో ఆస్ట్రేలియన్లు సందడి.. వీడియో వైరల్!

ఆంధ్రప్రదేశ్ లో, ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో జోరుగా సాగుతున్న సంక్రాంతి సంబరాలు.. కోనసీమ జిల్లావ్యాప్తంగా కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.;

Update: 2026-01-15 06:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో, ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో జోరుగా సాగుతున్న సంక్రాంతి సంబరాలు.. కోనసీమ జిల్లావ్యాప్తంగా కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పచ్చని అరటి తోటలు, కొబ్బరి తోటల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బరుల్లో.. పెద్ద పండుగ సంక్రాంతి రోజు తెల్లవారుజాము నుంచే సందడి మొదలైంది. ఈ కార్యక్రమంలో.. కేవలం స్థానికులే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పందెం ప్రేమికులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పందాలలో మహిళల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




 


అవును... ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంబారాన్ని తాకాయి. ప్రధానంగా కోడి పందాల సందడి మామూలుగా లేదనే చెప్పాలి. ఇక ఈసారి పందాళలో మునిపటి కంటే ఎక్కువగా అన్నట్లుగా మహిళలు సందడి చేశారు. ఇందులో భాగంగా... గెలుపోటములతో సంబంధం లేకుండా మూడు రోజులూ ఈ కోడి పందాల సందడిలో పాల్గొనాలని మహిళలు ఫిక్సవ్వడం వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరో వైపు ఈ పందాలలో నోట్ల కట్టల ప్రవాహం పెద్ద ఎత్తున కనిపిస్తోందని అంటున్నారు.

ఈ క్రమంలో... ఉమ్మడి పశ్చిమగోదావరిలో బుధవారం కోడి పందేలు భారీస్థాయిలో జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే పందెగాళ్లు పలు చోట్ల వాటికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా... దుగ్గిరాల, మీర్జాపురం, చేబ్రోలు, గొల్లగూడెం, కొయ్యలగూడెం, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, చింతలపూడి, పోలవరం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు.

ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని దాదాపు ప్రతీ గ్రామంలోనూ పెద్ద ఎత్తున బరులు దర్శనమిచ్చాయని చెప్పొచ్చు. సఖినేటిపల్లి, అంతర్వేది, మోరి, మల్కిపురం, గొంది, బట్టేలంక, చింతలమోరి, కరవాక, కేశనపల్లి, రాజోలు, తాటిపాక, ముమ్మిడివరం, నగరం, పి.గన్నవరం, అంబాజీపేట, అమలాపురం, రావులపాలెం, రాజమండ్రి, కాకినాడ, రామచంద్రాపురం ఇలా చెప్పుకుంటే పోతే ఆర్టీసీ బస్సులపై పేర్లు లేని ఊర్లను కలుపుకుని పెద్ద ఎత్తునే పదాలు సాగుతున్నాయని చెబుతున్నారు.

ఈ పందాల్లో రాయలసీమ, తెలంగాణతో పాటు తమిళనాడు నుంచి పలువురు వచ్చి పాల్గొన్నారు.. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలను వీక్షించారు.. మరికొంతమంది పాటిస్పేట్ చేశారు. ఇక ఏపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు తెలంగాణకు చెందిన పలువురు నేతలు గోదావరి జిల్లాలో సందడి చేశారు. ఇదే సమయంలో... డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి కోడిపందేల్లో ఆస్ట్రేలియన్ల సందడి చేయడం గమనార్హం. ఈ సందర్భంగా కోళ్లను పట్టుకుని వాళ్లు ఫోటోలకు ఫోజులిచ్చారు.

Tags:    

Similar News