చాన్నాళ్ల త‌ర్వాత‌.. బండి సంజ‌య్ యాక్టివ్‌!

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు బండి సంజ‌య్ యాక్టివ్ అయ్యారు. ఇటీవ‌ల కా లంలో ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

Update: 2026-06-13 14:09 GMT

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు బండి సంజ‌య్ యాక్టివ్ అయ్యారు. ఇటీవ‌ల కా లంలో ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేపథ్యంలో సంజ‌య్ ఎక్క‌డికి వెళ్లారు? ఏం చేస్తున్నార‌న్న చర్చ సాగింది. ఇదేస‌మ‌యంలో ఢిల్లీలో ఎన్డీయే స‌మావేశం జ‌రిగినా.. ఆయ‌న పెద్ద‌గా క‌నిపించ‌లేదు. మ‌రోవైపు.. నిత్యం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంద‌డి చేసే ఆయ‌న 15 రోజులుగా మౌనంగా ఉన్నారు.

ఈ ప‌రిణామాల‌తోనే బండి సంజ‌య్‌కు ఏమైంది? ఆయ‌న పార్టీపై అలిగారా? లేక‌.. కుమారుడి అరెస్టుతో దిగులు పెట్టుకున్నారా? అనేది చ‌ర్చ‌నీయాంశం అయింది. దీనికి సంబంధించి వార్త‌లు వ‌చ్చినా.. సంజ య్ ఎక్క‌డా పెద‌వి విప్ప‌లేదు. దీంతో ఆ స్పెక్యులేష‌న్ అలానే కొన‌సాగుతోంది. తాజాగా ఈ చ‌ర్చ‌ల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ.. జ‌నాల మ‌ధ్య‌కు సంజ‌య్ వ‌చ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ జిల్లాలో చేప‌ట్టిన స్వ‌చ్ఛ పాఠ‌శాల కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి పార్టిసిపేట్ చేశారు.

అయితే.. ఆయ‌న ఎక్క‌డా మీడియాతో మాట్లాడ‌కుండానే కార్య‌క్ర‌మాన్ని ముగించారు. నిజానికి సంజ‌య్ ఏమైనా మాట్లాడ‌తారేమోన‌ని మీడియా ప్ర‌తినిధులు వేచి చూశారు. ఆయ‌న మాట్లాడినా.. రాజ‌కీయ ప‌ర‌మైన అంశాలేవీ వినిపించ‌లేదు. ఇక‌, స్వ‌చ్ఛ పాఠ‌శాల కార్య‌క్ర‌మంలో భాగంగా పైపు ప‌ట్టుకుని స్థానిక కే.ఆర్‌. జెడ్పీ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌ను శుభ్రం చేశారు. అలానే త‌ర‌గ‌తి గదుల్లోకి వెళ్లి.. బ‌ల్ల‌లను కడిగి.. శుభ్రం చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పిలుపు మేర‌కు స్వ‌చ్ఛ పాఠ‌శాల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

ముభావంగానే..

మంత్రి సంజ‌య్‌.. ఎప్పుడూ.. యాక్టివ్‌గా ఉంటారు. విష‌యం ఏదైనా ఆయ‌న చాలా చ‌లాకీగా క‌నిపిస్తారు. ఆయ‌న మాట తీరు కూడా అలానే ఉంటుంది. కానీ.. తాజా కార్య‌క్ర‌మంలో మంత్రి ముభావంగానే క‌నిపిం చారు. మౌనంగా త‌న ప‌ని తాను చేసుకుని వెళ్లిపోయిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. అంత‌కుమించి దూకుడుగా వ్యాఖ్య‌లు చేయ‌డం.. విమ‌ర్శ‌లు గుప్పించ‌డం లేదు. దీంతో ఆయ‌న ఏదో ఆవేద‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపించింద‌ని మీడియా వ‌ర్గాల్లో వినిపించింది.

Tags:    

Similar News