టీడీపీ లక్ష్మణ రేఖ...తమ్ముళ్ళకు అర్ధమైందిగా !
ఈ విషయంలో తమ్ముళ్లకు గట్టిగానే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని భావిస్తున్న నేపధయంలోనే బోండా ఎపిసోడ్ తెర మీదకు వచ్చింది అని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ వైసీపీకి ప్రత్యర్ధిగా భావించడం లేదు, ఏపీకి ఆ పార్టీ వినాశనం అని ఒకటికి వంద సార్లు గట్టిగా చెబుతోంది. గొడ్డలి పార్టీ అంటోంది. ఆ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకుని రావద్దు అని జనాలకు టీడీపీ పెద్దలు పదే పదే కోరుతున్నారు. వైసీపీ రహిత ఏపీ అని బలమైన నినాదాలు ఇస్తున్నారు. అయితే మరో వైపు చూస్తే వైసీపీతో గ్రౌండ్ లెవెల్ లో చాలా మంది తమ్ముళ్ళు చెట్టాపట్టాలు వేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అలాగే వారితో కలసి వ్యాపారాలు చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఇవన్నీ కూడా అధినాయకత్వం దృష్టిలో ఉన్నాయి. వేయి కళ్ళతో వాటిని కనిపెడుతోంది.
తప్పుడు సంకేతాలు అంటూ :
తాము ఒక వైపు వైసీపీని ఏపీకి విద్వంశకరమైన శక్తిగా అభివర్ణిస్తూంటే క్షేత్ర స్థాయిలో వారితోనే కలసి మెలసి ఉంటే జనాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని హైకమాండ్ గట్టిగా భావిస్తోంది. అందుకే టెలి కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ మీటింగుల ద్వారా తరచూ హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది. ప్రత్యేకించి కొందరి విషయంలో క్లాస్ కూడా తీసుకుంటోంది. అయితే మరింత ఓపెన్ గా సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వంటి వారు మాట్లాడడం అంతే కాదు వైసీపీ నేతలతో కలసి ముచ్చట్లు పెట్టడం అన్నది టీడీపీ అధినాయకత్వం తట్టుకోలేకపోతోంది అని అంటున్నారు.
బోండాకు చెబితే చాలు :
ఈ విషయంలో తమ్ముళ్లకు గట్టిగానే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని భావిస్తున్న నేపధయంలోనే బోండా ఎపిసోడ్ తెర మీదకు వచ్చింది అని అంటున్నారు. అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన విషయంలో సీరియస్ యాక్షన్ కి దిగిపోయింది అని అంటున్నారు. త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసి మరీ బోండా నుంచి వివరణ తీసుకుంది అని అంటున్నారు. బోండా సైతం పార్టీ లైన్ దాటేది లేదని స్పష్టం చేశారు. తాను ఇక మీదట పార్టీ ఏ విధంగా చెబితే అలాగే అంటూ ఆయన ఈ వ్యవహారం మీద సాగుతున్న రచ్చను ముగించారు. అయితే బోండాకు చెప్పడం అంటే ఆయనకు మాత్రమే కాదు మొత్తంగా పార్టీలోని తమ్ముళ్ళకే ఈ రకమైన సందేశం అని అంటున్నారు.
పల్లా వార్నింగ్ :
అదే సమయంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే పార్టీ శ్రేణులకు పంపించారు. పార్టీ గీత దాటితే ఎంతటివారైనా సరే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. అతిక్రమించిన వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనకాడమని ఆయన గట్టిగానే హెచ్చరించారు.ఈ విషయమో ఎవరికైనా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే శిరోధార్యం వాటిని పాటించి తీరాల్సిందే అని కూడా అన్నారు. పార్టీ లైన్ ప్రకారం చూస్తే ఏ నేత కూడా ఇతర రాజకీయ ప్రత్యర్థులు విపక్ష నేతలతో వేదికలు పంచుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు టీడీపీ ఇచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాదు ఓపెన్ గా వేదికల మీద పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రసంగాలు ప్రకటనలు చేయవద్దు అని కూడా సూచించారు. దాంతో ఎంతటి నాయకుడు అయినా తోక జాడిస్తే ఏమి జరుగుతుందో పార్టీ అయితే చెప్పేసింది. ఆ మీదట ఎవరికి వారుగా ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు. ఈ పాటికే తమ్ముళ్ళకు మొత్తం మ్యాటర్ అర్ధం అయి ఉంటుందని కూడా అంటున్నారు.