సముద్రంలో అగ్ని పర్వత్వంను ఆనుకొని బంగారు గుడ్లు.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు..

ఇటీవల సముద్రంలో శాస్త్రవేత్తలు ఒక వింతను కనుగొన్నారు. కెనడాలోని పసిఫిక్ తీరంలో నీటి అడుగున ఒక అగ్ని పర్వతం ఉంది.;

Update: 2025-07-26 07:30 GMT

శాస్త్రవేత్తలకు అంతుచిక్కనివి ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైనవి విశ్వం, సముద్రగర్భం. ఆశ్చర్యం కల్పించే ఇంకా డిస్కవరీలోకి రాని జీవులు ఎన్నో సముద్ర గర్భంలో ఉన్నట్లు సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు. సముద్రంలో కొంత వరకే మనిషి, మరి కొంత వరకు మిషన్లు వెళ్తాయి. కానీ అంతకు లోతుకు కూడా కొన్ని రకాల జీవులు నివాసాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాయి. భూమిపై చాలా రకాల సముద్రాలు ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత. సముద్రాల కింద అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు.

ఇటీవల సముద్రంలో శాస్త్రవేత్తలు ఒక వింతను కనుగొన్నారు. కెనడాలోని పసిఫిక్ తీరంలో నీటి అడుగున ఒక అగ్ని పర్వతం ఉంది. ఈ అగ్ని పర్వతం సమీపంలో లోతైన సముద్ర జాతికి చెందిన లక్షలాది మెరిసే బంగారు గుడ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ఉనికి బహిర్గతం అయిన సమయంలో ఈ పర్వతం చల్లగా ఉందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ రాను రాను దాని గురించి ఇంకా తెలుసుకుంటే ఆశ్చర్యానికి గురయ్యారు. కెనడాకు చెందిన ఫిషరీస్ అండ్ ఓషన్స్ కు చెందిన మెరైన్ బయాలజిస్ట్ చెరిస్సేడ్ ప్రీజ్ బృందం ఈ పర్వతాన్ని ఆవిష్కరించింది. ఈ విషయాన్ని లైవ్ సైన్స్ లో నివేధించింది. 2023లో ఒక ఆడ స్కేట్ (సముద్ర జీవి) గుడ్లు పెట్టే ఫుటేజీ, వీడియోను ఈ బృందం బయటకు తెచ్చింది. ఇది శాస్త్రవేత్తలను కొంత ఆశ్చర్యం కలిగించింది. జల గర్భంలోతైన ప్రదేశంలో మైనస్ డిగ్రీల వాతావరణం ఉంటుంది. ఆ ప్రదేశంలో ఈ గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. సాధారణంగా గుడ్లలో పిల్లలు రూపాంతరం చెందాలంటే ఎంతో కొంత వేడి అవసరం కానీ అంత లోతులో మైనస్ డిగ్రీల ప్రదేశంలో పిల్లలు ఎలా పుడతాయని ఆశ్చర్యం కలిగింది.

కానీ అక్కడే ఉన్న అగ్ని పర్వతం జీవుల మనుగడకు కారకం కానుందని తెలిసింది. అగ్ని పర్వతం అంటే లోపల ఉన్న లావా ఉడుకుతుంది కాబట్టి వేడిగా ఉంటుంది ఇది మనకు తెలుసు కానీ ఈ పర్వతం సముద్రంలో మైనస్ డిగ్రీల ప్రదేశంలో ఉంది. అయినా ఎంతో కొంత వేడిని జనరేట్ చేస్తుంది. అందుకే ఈ జీవులు అక్కడ గుడ్లను పెడుతున్నాయి. స్కేట్ జీవులు సముద్ర గర్భంలో గుడ్లను పెడతాయి. వాటిలో నుంచి పిల్లలు రావాలంటే సంవత్సరాలు పడుతుందట. ఎందుకంటే అక్కడ సరిపోయేంత వాతావరణం ఉండదు. ఈ గుడ్లు పొదగడానికి నాలుగు నుంచి పది సంవత్సరాల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది జంతువుల్లోనే సుదీర్ఘ కాలం. ఎర్త్.కామ్ నివేధిక ప్రకారం.. అగ్ని పర్వతం నుంచి వచ్చే వేడితో పిండం అభివృద్ధికి శక్తి అందుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

డీప్ సీ రీసెర్చ్ లో భాగంగా స్కేట్లు గుడ్లు పెట్టే ప్రదేశాన్ని కనుగొన్నారు. డు ప్రీజ్ ఈ ప్రదేశం గురించి వివరిస్తూ ‘పగడాలు ఉన్న తోట, పుట్టిన స్కేట్ పిల్లలకు మంచి నర్సరీ’ అన్నాడు. సముద్ర జీవి అయిన స్కేట్ జాతికి చెందిన గుడ్లు సముద్రంలో ఒక బంగారు గుడ్ల తోటను తలపించాయి. ఇలాంటి అందమైన ప్రకృతి దృశ్యాలు సముద్రంలో ఎన్నో ఉన్నాయి.

Tags:    

Similar News