ఆమెకు 27.. అతడికి 72.. భారత్ లో పెళ్లాడిన విదేశీ జంట
కొన్ని పెళ్లిళ్లు రోటీన్ కు భిన్నంగా సాగుతుంటాయి. ఇప్పుడు చెప్పే పెళ్లి సైతం ఆ కోవకు చెందిందే.;
కొన్ని పెళ్లిళ్లు రోటీన్ కు భిన్నంగా సాగుతుంటాయి. ఇప్పుడు చెప్పే పెళ్లి సైతం ఆ కోవకు చెందిందే. పెళ్లిళ్లు స్వర్గంలో డిసైడ్ అవుతాయన్న నానుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని జంటల్ని చూసినప్పుడు ఇలాంటి భావనే కలుగుతుంది. అందుకు తాజాగా భారత్ లో జరిగిన ఒక ఉక్రెయిన్ జంట వివాహమే నిదర్శనంగా చెప్పొచ్చు. సదరు జంట పెళ్లే సమ్ థింగ్ స్పెషల్ అయితే.. వారిద్దరు తమ వివాహాన్ని భారత్ లో.. అందునా హిందూ సంప్రదాయం ప్రకారమే జరగాలని డిసైడ్ కావటం మరో విశేషంగా చెప్పాలి.
ఇంతకూ ఆ జంట ఇస్పెషల్ అన్నది ఎందుకంటే.. అతడికి 72 అయితే.. ఆమెకు కేవలం 27 మాత్రమే. అయితే.. వారిద్దరు కొంతకాలంగా కలిసి ఉండటమే కాదు.. కలిసి జీవించాలని డిసైడ్ అయ్యారు. దీనికి పెళ్లితో మరింత దగ్గర కావాలని భావించారు. వారిద్దరికి ఇష్టమైన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు బంధుమిత్రులతో కలిసి రాజస్థాన్ లోని జోధ్ పుర్ కు వచ్చి భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడారు.
ఉక్రెయిన్ కు చెందిన 72 ఏళ్ల స్టానిస్లావ్.. 27 ఏళ్ల అన్ హెలినా నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు ఈ మధ్యనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా తమ అభిరుచికి తగ్గట్లు భారతదేశంలో హిందూ దర్మాన్ని అనుసరించి వివాహమాడాలని భావించిన వారు..ఒక ఈవెంట్స్ సంస్థ సహకారాన్ని తీసుకున్నారు. జోధ్ పుర్ కోటలో డెస్టినేషన్ వేడ్డింగ్ వేడుకను ఘనంగా పూర్తి చేశారు.
వివాహ వేడుకలో భాగంగా పెళ్లికొడుకు.. పెళ్లి కుమార్తెలు ఇద్దరు సంప్రదాయ దుస్తుల్ని ధరించటం.. పూజా క్రతువులో పాల్గొనటం.. వేద మంత్రోచ్ఛారణల మధ్య వధువు మెడలో వరుడు తాళి కట్టటం.. కలిసి ఏడడుగులతో వివాహ బంధంలో అడుగు పెట్టారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కు జోధ్ పుర్ కోట వేదికగా నిలుస్తుంటుంది. అయితే.. ఈ పెళ్లి మాత్రం మిగిలిన పెళ్లిళ్లకు కాస్త డిఫరెంట్ గా మారటమే కాదు.. ఈ జంట రోటీన కు భిన్నంగా కనిపించారని చెబుతున్నారు. ఏమైనా ఈ జంట కోరుకున్నట్లే వీరి వివాహ వేడుక భారీగా.. భారత సంప్రదాయం ప్రకారం సాగింది.