వాలంటీర్స్ రిక్రూట్మెంట్... డ్రోన్లు కూల్చివేస్తే రూ.2.2 లక్షలు!

ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో భీకర దాడులు కొనసాగిస్తోన్న వేళ.. ఈ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సర్కార్ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.;

Update: 2025-06-12 12:30 GMT

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ అవిరామంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ సారి రష్యాది పై చేయి అయితే.. మరోసారి ఉక్రెయిన్ ది పైచేయిగా ఉంటుంది. మరోపక్క కొన్ని రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడుతుంది. దీమో.. ఆ డ్రోన్లను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సర్కార్ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది ఆసక్తిగా మారింది.

అవును... ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో భీకర దాడులు కొనసాగిస్తోన్న వేళ.. ఈ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సర్కార్ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మాస్కో నుంచి వస్తున్న డ్రోన్లను కూల్చడానికి సైన్యం ప్రమేయం లేకుండా వాలంటీర్లను ఉపయోగించుకునేలా ప్లాన్ చేసింది. ఆ డ్రోన్లను కూల్చినవారికి నగదు ఆఫర్ చేస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే... అవిరామంగా సాగుతున్న యుద్ధంలో రష్యా నుంచి వచ్చే డ్రోన్ లను అడ్డుకునే పౌరులకు నెలకు రూ.2.2 లక్షలను అందిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన ఈ కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ ప్రతినిధి తారస్ మెల్నిచుక్ ప్రకటించారు.

ఈ డ్రోన్స్ ను ధ్వంసం చేసే కార్యక్రమానికి సంబంధించి శిక్షణ పొందిన వాలంటీర్లను నియమించనుంది. వారు ఆయుధాలతో పాటు మానవరహిత విమానాలు వంటి వాటిని ఉపయోగించి శత్రుదేశం నుంచి వస్తున్న డ్రోన్‌ లను నేలకూల్చాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక కార్యక్రమ వల్ల రష్యా నుంచి వచ్చే డ్రోన్ల ముప్పును సమర్థమంతంగా ఎదుర్కోగలమని ఉక్రెయిన్‌ భావిస్తుందని అంటున్నారు.

కాగా... రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం అవిరామంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనివల్ల రెండు వైపుల విపరీతంగా ఆస్తి నష్టం, సైనిక నష్టం జరుగుతుందని అంటున్నారు! ప్రధానంగా ఈ యుద్ధంలో డ్రోన్లు కీలకంగా మారాయి. నిఘా, వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి వచ్చే డ్రోన్లను కూల్చేందుకు వాలంటీర్లను నియమించుకుంటుంది ఉక్రెయిన్.

ఇక.. ఉక్రెయిన్ వైమానిక దళం నివేదిక ప్రకారం... జూన్ 9న రష్యన్ దళాలు ఒకేసారి 499 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 479 షాహెద్ స్ట్రైన్ యూఏవీలు, వివిధ రకాల సిమ్యులేటర్ డ్రోన్లు ఉన్నాయి. అయితే వీటిలో 460 డ్రోన్లు, 19 క్షిపణులను ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా కూల్చివేశాయి.

Tags:    

Similar News